E-Paper
Advertisement

Big TV Kissik talks Promo : మణికొండ రాసిస్తానంటున్న కస్తూరి.. మరీ అంత ఆస్తి ఉందా ?

Big TV Kissik talks Promo : మణికొండ రాసిస్తానంటున్న కస్తూరి.. మరీ అంత ఆస్తి ఉందా ?
Advertisement

Big TV Kissik talks Promo : ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ టాక్ షోలు ఎక్కువగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ బిగ్ టీవీ ఛానల్ వేదికగా “కిస్సిక్ టాక్స్” అంటూ ఒక షో నిర్వహిస్తున్నారు.ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వర్ష హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ఇప్పుడు 33వ ఎపిసోడ్ కి సంబంధించిన తాజా ప్రోమోని విడుదల చేశారు. ఇందులో కస్తూరి శంకర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మణికొండ రాసిస్తానంటున్న కస్తూరి..

ఇకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కస్తూరి మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మణికొండ రాసిస్తానంటూ ఆమె సంచలన కామెంట్లు చేసింది. ప్రోమో విషయానికి వస్తే.. అన్నమయ్య సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు.. ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటూ వర్షా కామెంట్ చేయగా..ఏం బ్యాలెన్స్ చేస్తున్నానమ్మా.. ఏమి ఉన్నా లేకపోయినా కళ్లద్దాలతోనే తిరుగుతున్నాను అంటూ కౌంటర్ వేసింది కస్తూరి. ఇక చందమామకు రెండు పేర్లు ఉంటాయి.. ఒకటి చందమామ మరొకటి కస్తూరి అంటూ తెగ పొగిడేసింది వర్ష. దీంతో కస్తూరి ఏం కావాలమ్మా నీకు మణికొండ రాసివ్వాలా ఇచ్చేస్తా.. అని చెప్పగా మణికొండ అంతా రాసిస్తా అంటున్నారు మీకు ఎంత ఆస్తులు ఉన్నాయి అంటూ వర్షా అడిగింది.

ఆస్తుల చిట్టా విప్పిన కస్తూరి..

Advertisement

చెన్నైలో ఒక హౌస్ ఉంది.. హైదరాబాదులో ఉంది.. అది కూడా గృహలక్ష్మి సీరియల్ వల్ల ఒక గృహం కొన్నాను అంటూ తన ఆస్తులు చిట్టా చెప్పడం మొదలుపెట్టింది కస్తూరి. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కోసమే ఇక్కడ మీరు ఇల్లు కొన్నారా అని వర్షా ప్రశ్నించగా.. నాకు ముందు నుంచి హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడ ఇల్లు కొనుగోలు చేశాను అంటూ తెలిపింది. మొత్తానికి అయితే ఆస్తుల వివరాలు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది కస్తూరి శంకర్.

అందుకే జుట్టు కత్తిరించాను.. కస్తూరి ఎమోషనల్ కామెంట్స్..

ఇకపోతే ఇదే ప్రోమోలో కస్తూరి శంకర్ మాట్లాడుతూ.. “నేను హైదరాబాదీయులు అంటే కూడా ఇష్టం అని చెప్పవచ్చు. కానీ ఈ వయసులో ప్రేమలో పడింది అంటూ థంబ్ నెయిల్స్ వేసేస్తారు నాకు అవసరమా.? ఒకప్పుడు నాకు చాలా జుట్టు ఉండేది.. పొడవుగా ఉండేది.. కానీ దిష్టి కారణంగా కత్తిరించేశాను అంటూ చెప్పుకొచ్చింది. అసలేం జరిగింది అంటే నేను జైలుకు వెళ్లాను కదా అంటూ అసలు విషయాన్ని చెప్పి ఆశ్చర్యపరిచింది కస్తూరి శంకర్. ఇక సినిమాలలో చూపించినట్టు నిజజీవితంలో జైలు జీవితం అంత సులభం కాదు అంటూ తన ఎక్స్పీరియన్స్ ని పంచుకుంది. నిజానికి నేను ఇష్టపడే హైదరాబాదులో ఉన్నాను. కానీ తెలుగు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాను అని నన్ను జైల్లో పెట్టారు. మా పిల్లల ఒంట్లో ప్రవహించేది కూడా తెలుగు రక్తమే కదా.. దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారో తెలీదు అంటూ ఎమోషనల్ అయ్యారు కస్తూరి. ఆ దిష్టి మొత్తం పోవాలి అని సగం జుట్టును కత్తిరించాను అంటూ తెలిపింది.

Advertisement

ALSO READ:Spirit: స్పిరిట్ కోసం సందీప్ మాస్టర్ ప్లాన్.. ఏకంగా ఇద్దరు స్టార్ కిడ్స్ రంగంలోకి!

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×