Spirit: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో రాబోతున్న తాజా చిత్రం ‘స్పిరిట్’ . ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని.. అప్పుడే రెబెల్ స్టార్ ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా నిన్న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ఆడియో టీజర్ ని మేకర్స్ విడుదల చేశారు. కేవలం ఆడియో టీజర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు చిత్ర బృందం.
ఇకపోతే అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా ఈ స్పిరిట్ మూవీతో మరో లెవెల్ కి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మాస్టర్ ప్లాన్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏకంగా ఒకరు కాదు ఇద్దరు స్టార్ కిడ్స్ ని రంగంలోకి దింపారు సందీప్ రెడ్డి వంగ. అసలు విషయంలోకి వెళ్తే.. మాస్ మహారాజా రవితేజ (Raviteja), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) వారసుడు కూడా ఈ సినిమా కోసం పనిచేయబోతున్నారు. ముఖ్యంగా రవితేజ తనయుడు మహాధన్ భూపతి రాజు, త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్ ఈ సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్లుగా వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా వద్ద టెక్నికల్ మెలుకువలు నేర్చుకోవడానికి ఈ ఇద్దరు స్టార్ వారసులు స్పిరిట్ లో జాయిన్ కావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇకపోతే ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ , కాంచన తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ALSO READ:Bigg Boss : తప్పతాగి బిగ్ బాస్ షోకు వెళ్లిన హోస్ట్.. సెన్స్ లేదా అంటూ ఆడియన్స్ ఫైర్!