Sandeep Raj: ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా త్వరలోనే మోగ్లీ 2025 (Mowgli 2025)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సయ్యారే అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో రోషన్ కనకాలకు జోడిగా నటి సాక్షి (Sakshi)హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు కలర్ ఫోటో ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్(Sandeep Raj) దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్ గా సందడి చేయబోతున్నారు. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఈ పాటను విడుదల చేయడంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ సందీప్ రాజ్ కు మీడియా వారి నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఇటీవల కాలంలో సందీప్ బండి సరోజ్ (Bandi Saroj) ను దూరం పెడుతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అలాగే ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు కూడా వచ్చాయని వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఇదే విషయంపై మీడియా వారు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు డైరెక్టర్ సందీప్ రాజ్ సమాధానం చెబుతూ అసలు విషయాన్ని బయట పెట్టారు. బయట చూసేవారికి మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అనిపించడం వాస్తవమే అని తెలిపారు.
ఇప్పుడు నేను నాకన్నా చిన్న వాళ్ళతో సినిమా చేస్తున్నప్పుడు సినిమా బాగా వస్తే వెంటనే వారిని వెళ్లి హగ్ చేసుకుని, ఎగిరి గంతులు వేస్తాము. అయితే బండి సరోష్ నాకన్నా కొంచెం పెద్దోడు కాబట్టి ఏదైనా మేం చేసే వర్క్ బాగా వస్తే బ్రో చాలా బాగుంది అని చెబుతాము అందుకే మా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయనే భావన అందరిలో కలుగుతుందని తెలిపారు. అందరిలాగే మా మధ్య కూడా గొడవలు ఉంటాయని సందీప్ రాజ్తెలిపారు. ఇక మా మధ్య గొడవలు ఏ విషయం అంటే ఏదైనా ఒక సన్నివేశం గురించి మాట్లాడేటప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది లేదు అలా చేస్తే బాగుంటుందనే విషయం పట్ల విభేదాలు వస్తాయి.
ఇలాంటి విభేదాలు వచ్చినప్పుడు బండి సరోజ్ నాకు ఒక విషయం చెప్తారు. ముందు నేను అనుకున్నది చేసి చూపిస్తా నీకు నచ్చితే ఓకే లేదంటే లేదు అని చెబుతారు అలా కొన్ని సందర్భాలలో ఆయనకు అనిపించింది చేసి చూపించారు నచ్చితే ఓకే లేదంటే లేదని కూడా చెప్పాను. మా మధ్య ఇలాంటి బేదాభిప్రాయాలు తప్ప పెద్ద గొడవలు ఏమి లేవని ఈ సందర్భంగా సందీప్ రాజ్ బండి సరోజ్ తో విభేదాలు గురించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు ఇంతటితో పులిస్టాప్ పెట్టినట్టు అయింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలని పెంచేసాయి. ఈ సినిమాని డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.