AP TET 2025 Exam: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET 2025) షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ లో రెగ్యులర్ అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు విద్యాశాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. టెట్ నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే టెట్ వెబ్ సైట్ ను సిద్ధం చేసింది. శుక్రవారం(అక్టోబర్ 24, 2025)న టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
టెట్ ఆన్‌లైన్ దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 23, 2025 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 25న ఆన్‌లైన్ లో టెట్ మాక్ టెస్ట్ నిర్వహిస్తారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 10న రెండు షిఫ్టుల్లో టెట్ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటలకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు రెండో షిఫ్ట్ వ్రాత పరీక్షలు జరుగుతాయి. టెట్ ఫలితాలను జనవరి 19, 2026వ తేదీన ప్రకటిస్తారు.
ఈ మేరకు టెట్ పూర్తి నోటిఫికేషన్ అక్టోబర్ 24న విద్యాశాఖ విడుదల చేయనుంది. టెట్ పై ఇతర వివరాల కోసం హెల్ప్ డెస్క్ నంబర్లు 8121947387, 8125046997, 7995649286, 7995789286, 9963069286ను సంప్రదించాలని విద్యాశాఖ సూచించింది. కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ పరీక్షల నోటిఫికేషన్, సమాచార బులెటిన్, పరీక్షల షెడ్యూల్, సిలబస్, పేమెంట్ వివరాలు, అభ్యర్థులకు సూచనలు కోసం http://tet2dsc.apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.