E-Paper
Advertisement

Big tv Kissik Talks: అలాంటి వాడు మాత్రం భర్తగా వద్దు.. దండం పెట్టేసిన రీతూ..

Big tv Kissik Talks: అలాంటి వాడు మాత్రం భర్తగా వద్దు.. దండం పెట్టేసిన రీతూ..
Advertisement

Big tv Kissik Talks: బుల్లితెర నటిగా, జబర్దస్త్ కమెడియన్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రీతూ చౌదరి ఒకరు. ఈమె బుల్లితెర నటిగా తన కెరియర్ ప్రారంభించి పలు సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం జబర్దస్త్ వేదికపై కూడా తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న రీతు చౌదరి(Ritu Chowdary) ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని 13 వారాలపాటు హౌస్ లో కొనసాగి బయటకు వచ్చారు. ఇక బిగ్ బాస్ అనంతరం ఈమె బీబీ జోడి కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొన్న సంగతి తెలిసిందే.

అర్థం చేసుకునేవాళ్లు రావాలి..

ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న రీతు చౌదరి తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రీతు చౌదరి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉండాలి తనలో ఎలాంటి క్వాలిటీ ఉండాలనే విషయాల గురించి వర్ష ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రీతు సమాధానం చెబుతూ లుక్స్ పరంగా ఎలా ఉన్న తనకు అభ్యంతరం లేదు కానీ ఒక అమ్మాయి మనసును అర్థం చేసుకునేవాడు కావాలి. ఒక భార్యకు మాత్రమే కాకుండా సొసైటీలో ఉన్న ఆడవాళ్ళకి కూడా గౌరవం ఇచ్చే అబ్బాయి కావాలి. అలాగే కచ్చితంగా ఏదో ఒక ప్రొఫెషన్ లో స్థిరపడి, నాతోపాటు మా అమ్మ అన్నయ్యని కూడా మంచిగా చూసుకునే అబ్బాయి రావాలని ఈమె తన మనసులో ఉన్న కోరికలను మొత్తం బయట పెట్టారు.

బిజినెస్ మ్యాన్ వద్దు బాబోయ్ ..

Advertisement

ఇలా కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి రీతు చౌదరి తెలియచేయడంతో వెంటనే వర్ష బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమైనా ఉన్నావా అంటూ అడగడంతో ఒక్క సారిగా రీతూ దండం పెడుతూ బిజినెస్ మ్యాన్ వద్దు బాబోయ్ అంటూ ఈమె తెలియజేశారు. వాళ్ళు ఎంతసేపు ఉన్న తమ బిజినెస్ గురించి మనీ గురించి ఆలోచిస్తారు తప్ప వేరే విషయాల గురించి ఆలోచించరని అలాంటి వాళ్ళు తనకు భర్తగా అస్సలు వద్దు అంటూ రీతు తెలియజేశారు.

Advertisement

ఇక పెళ్లి తర్వాత చాలామంది విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇలాంటి వారికి మీరు ఎలాంటి సమాధానం చెబుతారనే ప్రశ్న ఎదురవడంతో పెళ్లికి ముందు చేసుకోబోయే వారితో కొంతకాలం ట్రావెల్ చేస్తేనే ఒకరినొకరు అర్థం చేసుకోగలరు. ఇక పెళ్లయిన తర్వాత ఒక మూడు నాలుగు సంవత్సరాలు పిల్లల గురించి ఆలోచించకుండా మేము జీవితాంతం కలిసి ఉంటామని ఫిక్స్ అయినప్పుడే పిల్లల్ని ప్లాన్ చేయాలని అలా కాకుండా పిల్లల్ని కనేసి విడాకులు తీసుకొని విడిపోతే ఆ పిల్లలు తల్లి, తండ్రి లేనివారు అవుతారని అలాంటి పరిస్థితి మాత్రం ఎవరికీ కల్పించవద్దు, ఏదైనా పిల్లలని ప్లాన్ చేయకముందే డిసైడ్ అవ్వాలని ఈ సందర్భంగా రీతు చౌదరి తెలియ చేశారు.

Also Read: Big tv Kissik Talks: బిగ్ బాస్ లో ఆక్షణం ఉండలేకపోయాను.. హార్డెస్ట్ వీక్ అంటూ

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×