E-Paper
Advertisement

Municipal elections : నేడో రేపో నోటిఫికేషన్.. కత్తులు దూస్తున్న పార్టీలు!

Municipal elections : నేడో రేపో నోటిఫికేషన్.. కత్తులు దూస్తున్న పార్టీలు!
Advertisement

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడింది. ఇంకో పది రోజులు మాత్రమే ఉండటంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఎన్నికల హడావుడిలో మునిగిపోయారు. నిన్న రాత్రి మున్సిపల్ , కార్పొరేషన్లకు రిజర్వేషన్లు సైతం ఖరారయ్యాయి. ఎన్నికల కమిషన్ ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. ముందుగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా.. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముందుగా అభ్యర్థులను డిసైడ్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. మరో రెండ్రోజుల్లో అధికారికంగా ఎలక్షన్ నోటిఫికేషన్ రానుంది. ఆ వెంటనే కోడ్ అమల్లోకి రానుంది. అందుకే ఇప్పటినుంచే ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. కోడ్ అమల్లోకి రాకముందే అధికార పార్టీ సైతం ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

50 శాతం మహిళలకే రిజర్వేషన్

త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం సూచన మేరకు ఎన్నికల సంఘం 50 శాతం సీట్లను మహిళలకు రిజర్వు చేసింది. దీంతో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటనున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ రిజర్వేషన్ల వారీగా మహిళా అభ్యర్థుల కోసం వేటను మొదలెట్టినట్టు తెలుస్తున్నది. ఈ మూడు పార్టీలు ప్రధానంగా మున్సిపల్ చైర్మన్, చైర్ పర్సన్, మేయర్ స్థానాలపై కన్నెసినట్టు తెలుస్తున్నది. ముందుగా అధికార పార్టీ విషయానికొస్తే ఈసారి పార్టీలో ఆశావహులు భారీగానే పార్టీ పెద్దలు, మంత్రుల వద్ద లాబీయింగ్ మొదలెట్టినట్టు తెలుస్తున్నది. రిజర్వేషన్ల వారీగా జనరల్ స్థానాల్లో కేటాయించిన సీటును తమకే ఇవ్వాలని పురుష అభ్యర్థులు పట్టుబడుతున్నట్టు తెలుస్తున్నది. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కారణంగా ఈసారి పురుషుల అధిక్యానికి గండిపడనుంది.

బీఆర్ఎస్, బీజేపీది చెరో దారి..

Advertisement

మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చూస్తున్నట్టు తెలుస్తున్నది. అధికార పార్టీలో టికెట్ ఆశించిన భంగపడిన వారిని.. గెలిచే అవకాశాలు ఉన్న వ్యక్తులకు తమ పార్టీ తరఫున టికెట్ ఇవ్వాలని ఆ రెండుపార్టీలు చూస్తున్నట్టు జోరుగా చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే రెబల్ అభ్యర్థులకు సైతం పరోక్షంగా సపోర్టు చేయాలని నిర్ణయించుకున్నట్టు టాక్. గతంలో సర్పంచ్ ఎన్నికల్లో ఈ ఫార్ములా కారణంగానే అధికార పార్టీకి సీట్లు తగ్గాయి. ఎక్కడైతే తమ పార్టీ అభ్యర్థులు వీక్ ఉంటారో అక్కడ ఈ ట్రిక్ ప్లే చేయాలని ప్రతిపక్ష్ బీఆర్ఎస్, బీజేపీ ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Khammam News: “ఖమ్మం జిల్లాకు సాగునీరు, పారిశ్రామిక కళ”: పాలేరు సభలో మంత్రులు భట్టి, ఉత్తమ్ కీలక ప్రకటనలు!

Advertisement

ఇక జిల్లాల రద్దు అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తుంటే.. బీజేపీ మాత్రం హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులను హైలేట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. రేవంత్ ప్రభుత్వంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని.. అన్య మతస్తులు ఆలయాల మీద దాడులు చేస్తుంటే ఈ సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని.. మున్సిపల్ ఎన్నికల్లో సెంటిమెంట్ రగల్చాలని కాషాయ పార్టీ భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తున్నది.మరోవైపు ఆరు గ్యారెంటీలపైనా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది.ముఖ్యంగా మహిళలకు ప్రాధానత్యనిస్తూనే మహిళ ఓటర్లను ఆకర్షించాలని.. ప్రభుత్వం ఇస్తానన్న రూ.2500, తులం బంగారంపై మహిళలకు అవగాహన కల్పించి లబ్ది పొందాలని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు కత్తులు దూస్తున్నట్టు తెలుస్తున్నది.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×