E-Paper
Advertisement

Khammam News: “ఖమ్మం జిల్లాకు సాగునీరు, పారిశ్రామిక కళ”: పాలేరు సభలో మంత్రులు భట్టి, ఉత్తమ్ కీలక ప్రకటనలు!

Khammam News: “ఖమ్మం జిల్లాకు సాగునీరు, పారిశ్రామిక కళ”: పాలేరు సభలో మంత్రులు భట్టి, ఉత్తమ్ కీలక ప్రకటనలు!
Advertisement

Khammam News: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు జిల్లా అభివృద్ధిపై కీలక ప్రసంగాలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో పాటు విద్యా, వైద్య, పారిశ్రామిక రంగాలలో జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని వారు హామీ ఇచ్చారు.

రైతులకు సాగునీటి కష్టాలు తీరుస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

పాలేరు నియోజకవర్గంతో తనకు మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని, కాలువల నిర్మాణానికి ఒక్క ఎకరం భూసేకరణ కూడా చేయలేదని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

యువతకు ఉపాధి, జిల్లాకు పారిశ్రామిక కళ:  భట్టి విక్రమార్క

Advertisement

 ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జిల్లాలో సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి రంగాలను బలోపేతం చేయడమే తమ దార్శనికత అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో జిల్లాకు జేఎన్‌టీయూ (JNTU) క్యాంపస్, నర్సింగ్ కళాశాలలు మరియు కీలక సాగునీటి పనులను తీసుకువచ్చామని వివరించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకురావాలని, జిల్లాకు ప్రత్యేక ఇండస్ట్రియల్ ప్యాకేజీలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

Read Also: నైనీ బొగ్గు గనుల వ్యవహారం.. కథనాలపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×