E-Paper
Advertisement

టీవీఎస్ To బజాజ్.. ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో టాప్‌ ఎవరంటే?

టీవీఎస్ To బజాజ్.. ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో టాప్‌ ఎవరంటే?
Advertisement

TVS vs Bajaj vs Ather vs Ola: భారత ఆటోమొబైల్ మార్కెట్‌ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరుగడంతో పాటు రోజువారీ ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో టీవీఎస్, బజాజ్, ఏథర్, హీరో విడా, ఓలా లాంటి కంపెనీల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

అమ్మకాల్లో టాప్‌లో ఎవరు?

2026 సెప్టెంబర్ అమ్మకాల గణాంకాల ప్రకారం, ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో TVS మోటార్ కంపెనీ ముందంజలో నిలిచింది. ఆ తర్వాత బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్‌ కు చెందిన విడా బ్రాండ్లు ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ కూడా ఈ మార్కెట్‌లో కీలక పోటీదారుగా కొనసాగుతోంది. సెప్టెంబర్ నెలలో నమోదైన రిటైల్ అమ్మకాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

TVS: సుమారు 54,000 యూనిట్లు

బజాజ్: సుమారు 48,400 యూనిట్లు

Advertisement

ఏథర్: సుమారు 30,500 యూనిట్లు

హీరో విడా: సుమారు 24,300 యూనిట్లు

ఓలా ఎలక్ట్రిక్: సుమారు 13,450 యూనిట్లు అమ్ముడయ్యాయి.

TVS, బజాజ్ మధ్య పోటీ

TVS ఐక్యూబ్ వంటి స్కూటర్లకు ఉన్న ఆదరణ కంపెనీ అమ్మకాలకు తోడ్పడుతోంది. మరోవైపు బజాజ్ చేతక్ కూడా మంచి అమ్మకాలు నమోదు చేస్తూ గట్టి పోటీ ఇస్తోంది. సెప్టెంబర్‌లో గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే రెండు కంపెనీల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఏథర్ తన రిజ్టా, 450 సిరీస్ స్కూటర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. హీరో విడా కూడా అమ్మకాల వృద్ధిని సాధించింది. మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే స్వల్పంగా తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

కొనుగోలుదారులు ఏం చేయాలంటే?   

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేటప్పుడు అమ్మకాల సంఖ్య ఒక్కటే ప్రమాణంగా తీసుకోకూడదు. ఒక్కసారి ఛార్జింగ్‌తో ప్రయాణించే దూరం, బ్యాటరీ వారంటీ, ఛార్జింగ్ సదుపాయాలు, సర్వీస్ సెంటర్స్, స్పేర్ పార్ట్స్ లభ్యత, వెహికల్ ధర లాంటి అంశాలను కూడా పరిశీలించాలి. మొత్తంగా భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌ లో పోటీ పెరుగుతోంది. TVS, బజాజ్ ముందంజలో ఉండగా, ఏథర్, విడా, ఓలా తమ స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఏ కంపెనీ మరింత దూసుకెళ్తుందో చూడాలి.

Read Also: క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

Tags

Related News

ఇండియాలో టెస్లా రోడ్‌స్టర్ బుకింగ్స్.. వామ్మో.. రిజర్వేషన్ కోసం రూ.2.50 కోట్లా?

మారుతి జిమ్నీ To మహీంద్రా థార్.. రూ.20 లక్షల లోపు పవర్‌ఫుల్ 4×4 SUVలు ఇవే!

రెడ్ అండ్ బ్లాక్ లుక్‌లో హ్యుందాయ్ బేయాన్.. ఫీచర్లు అదుర్స్!

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

Big Stories

Advertisement
×