E-Paper
Advertisement

కోర్ట్ బ్యూటీ శ్రీదేవి ‘ హైకూ’ మూవీ రివ్యూ.. తొలిప్రేమ ఎలా ఉందంటే?

కోర్ట్ బ్యూటీ శ్రీదేవి ‘ హైకూ’ మూవీ రివ్యూ.. తొలిప్రేమ ఎలా ఉందంటే?
Advertisement

Haiku Movie Review: 

నటీనటులు: శ్రీదేవి అప్పాల, ఏగన్, ఫెమినా జార్జ్ తదితరులు
దర్శకత్వం: యువరాజ్ చిన్నసామి
సంగీతం: సిద్ధు కుమార్
నిర్మాత: డా. డి. అరుళానందు, మ్యాథ్యూ అరుళానందు

హైకూ సినిమా కథేంటంటే:

Advertisement

మనోహర్ తన స్నేహితులతో కలిసి చేసిన అల్లరి కారణంగా కాలేజీ నుంచి సస్పెండ్ అవుతాడు. ఎక్కడా సీటు దొరకని పరిస్థితుల్లో కోయంబత్తూరులోని ఓ మహిళా కళ్యాణ/ఉమెన్స్ కాలేజీ కో-ఎడ్యుకేషన్‌గా మారడంతో మనోహర్‌కు అక్కడ అడ్మిషన్ లభిస్తుంది. ఆ కాలేజీలో అమ్మాయిల మధ్య ఒక్కడే అబ్బాయిగా చేరిన మనోహర్.. అక్కడ కోడి (శ్రీదేవి అప్పాల)ని చూసి ఇష్టపడతాడు. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలు, ఉద్యోగం, కుల సమస్యల కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మూడేళ్లకు ఐటీ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్న మనోహర్ జీవితంలోకి నివేత (ఫెమినా జార్జ్) వస్తుంది. గతాన్ని మరిచిపోలేని మనోహర్, కొత్త జీవితాన్ని కోరుకునే నివేత ప్రయాణం ఎలా సాగింది? మొదటి ప్రేమ వైఫల్యం నుంచి మనోహర్ ఎలా బయటపడ్డాడు? చివరికి ఈ ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగింది అనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.

సినిమా విశ్లేషణ:

తొలి ప్రేమ, కాలేజీ జ్ఞాపకాలు, విడిపోయిన బంధాలు మరియు మనుషుల మధ్య జరిగే భావోద్వేగాల నేపథ్యంలో దర్శకుడు యువరాజ్ చిన్నసామి ఈ లవ్ స్టోరీని తెరకెక్కించారు. సినిమా ప్రథమార్థంలో లేడీస్ కాలేజీలో ఒక్కడే అబ్బాయి చేరడం, ఆ తర్వాత అమ్మాయిలు చేసే అల్లరి, ఫన్నీ సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంలో మరొక ప్రేమకథ ప్రారంభమైనప్పటికీ, గత ప్రేమ తాలూకు జ్ఞాపకాలు మరియు సంఘర్షణ కథను ఎమోషనల్ వైపు టర్న్ చేస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ ఆకట్టుకునేలా ఉంటుంది. రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నంగా మంచి ఫీల్‌గుడ్ ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని మలచడంలో దర్శకుడు సఫలమయ్యారు.

ప్లస్ పాయింట్లు :

Advertisement

నటీనటుల అభినయం, కోడి పాత్రలో శ్రీదేవి అప్పాల చాలా మెచ్యూర్డ్‌గా నటించి ఆకట్టుకున్నారు. హీరో ఏగన్ మరియు హీరోయిన్ ఫెమినా జార్జ్ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

సంగీతం సిద్ధు కుమార్ అందించిన పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. సాధారణ సన్నివేశాలను కూడా మ్యూజిక్ మరో స్థాయికి తీసుకెళ్లింది.

కథా నేపథ్యం ఎంచుకున్న లవ్ అండ్ ఎమోషనల్ పాయింట్, కాలేజీ బ్యాక్‌డ్రాప్ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి.

నిర్మాణ విలువలు, విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉండి రిచ్ లుక్ తెచ్చాయి.

also read:ప్రశాంత్ నీల్ ‘418’ మూవీ రివ్యూ.. హార్రర్ మూవీ మెప్పించిందా?

మైనస్ పాయింట్లు :-

రెండో భాగంలో అక్కడక్కడా కథనం కొద్దిగా నెమ్మదించడం.

కొన్ని సన్నివేశాలను మరింత పదునుగా, భావోద్వేగభరితంగా తెరకెక్కించి ఉంటే ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండేది.

చివరి ఆఖరి మాటగా:

మంచి ఫీల్, కాలేజీ జ్ఞాపకాలు మరియు చక్కటి భావోద్వేగాలతో సాగే ఈ ‘హైకూ’ యూత్ మరియు లవ్ స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని పంచుతుంది.

Haiku Movie Rating: 2.75 / 5

Related News

ప్రశాంత్ నీల్ ‘418’ మూవీ రివ్యూ.. హార్రర్ మూవీ మెప్పించిందా?

గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ

‘రణబాలి’ మూవీ రివ్యూ.. విరోష్ జంట హ్యాట్రిక్ కొట్టిందా?

అనుపమ ‘క్రేజీ కళ్యాణం’ మూవీ రివ్యూ.. తెలంగాణ పల్లెటూరి అమ్మాయి ఆకట్టుకుందా?

జైలర్ 2 మూవీ రివ్యూ.. రజినీకాంత్ జైలర్ మ్యాజిక్ రిపీట్ చేశారా?

మయూఖ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

చకోర మూవీ రివ్యూ..

Big Stories

Advertisement
×