Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 47వ రోజుకు సంబంధించి మూడవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. అందులో ఎల్లో లెవెల్ లో ఉన్నవారు గ్రీన్ లెవెల్ కి చేరుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. కావడి ఛాలెంజ్ లో అమన్, దెబ్జానీ, నీతు గెలిచి గోట్ గా మారి 2 వారాల ఇమ్యూనిటీ బెనిఫిట్ ను సొంతం చేసుకోవడమే కాకుండా ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నారు. ఇక నేటి ఎపిసోడ్లో రెండవ టాస్క్ లో భాగంగా కనిపెట్టండి టాస్క్ లో ముఖేష్ గెలిచి తాను కూడా గోట్ బెనిఫిట్ ను సొంతం చేసుకున్నారు. ఇక మిగిలింది వర్షిణి , శివ, త్రిగుణ్, నరేష్, రాంప్రసాద్.
వీరి ఐదుగురిలో ఎవరైతే విజేతగా నిలుస్తారో ఆ ఇద్దరిని గోట్ గా పరిగణిస్తామని బిగ్ బాస్ తెలిపారు. అలా తాజాగా విడుదల చేసిన మూడవ ప్రోమోలో స్నేహితులుగా హౌస్ లోకి అడుగుపెట్టిన రాంప్రసాద్ , నరేష్ దొంగలుగా మారగా.. గాడ్స్ గా త్రిగుణ్, శివ పోటీపడ్డారు. గ్రీన్ లెవెల్ లోకి వెళ్లేందుకు ఇస్తున్న చివరి ఛాన్స్ అంటూ టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్ . ఈ చాలెంజ్లో నలుగురు పోటీదారులు రెండు టీములుగా విడిపోయి ఆడాల్సి ఉంటుంది. ఇద్దరు గాడ్స్ గా మరో ఇద్దరు దొంగలుగా మారాలి. దొంగలు లోటస్ లో ఉన్న డైమండ్ ను తీసుకొని పారిపోవడానికి ప్రయత్నించాలి. సేఫ్ జోన్ లోకి వెళ్లే ముందే గాడ్స్ దొంగలను పట్టుకోవాలి అంటూ టాస్క్ నిర్వహించారు.
also read:రెండేళ్లలోపే అరుదైన ఘనత సాధించిన బిగ్ బాస్ మానస్ కొడుకు!
అయితే ప్రోమోలో మొదట దొంగలుగా ఉన్న నరేష్ డైమండ్స్ ని తీసుకొని సేఫ్ జోన్ లో పెట్టినట్టు చూపించారు. కానీ ప్రోమో ఆఖరిలో శివ, త్రిగుణ్ వారిని అడ్డుకొని డైమండ్స్ సొంతం చేసుకున్నట్లు చూపించారు. మొత్తానికైతే శివ, త్రిగుణ్ ఆటలో గెలిచినట్లు ప్రోమోలో చూపించారు. మొత్తానికైతే గోట్ బెనిఫిట్స్ 6 మంది సొంతం చేసుకున్నట్లు చూపించారు. ఈ 6 మంది మరో రెండు వారాలపాటు ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నారు అనడంలో సందేహం లేదు. అలా ఆ 6 మంది ఎవరెవరు అనే విషయానికి వస్తే అమన్, దేబ్జానీ, నీతూ, ముఖేష్, శివ, త్రిగుణ్.. అన్నట్టు తెలుస్తోంది మరి బిగ్ బాస్ అధికారికంగా గోట్ గా నిలిచిన వారిని ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే.
ఇదిలా ఉండగా ఈ వారం ఏకంగా 12 మంది నామినేషన్ లోకి వచ్చారు. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే గ్రాండ్ ఫినాలేకి ఐదు మందిని మాత్రమే ఉంచాల్సి వస్తే హౌస్ లో రెండు లేదా మూడుసార్లు డబుల్ ఎలిమినేషన్ నిర్వహించాల్సి ఉంటుంది ఇక ప్రస్తుతం 17 మంది హౌస్లో కొనసాగుతున్నారు . మరి ఈసారి డబుల్ ఎలిమినేషన్ పెడితే ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మరి హౌస్ నుండి వెళ్లే ఆ ఇద్దరు ఎవరో తెలియాల్సి ఉంది.