E-Paper
Advertisement

గాజులు గలగల పాటపై ఇంత రచ్చా? రాధమ్మ కూతురు ఆన్సర్ ఇదే!

గాజులు గలగల పాటపై ఇంత రచ్చా? రాధమ్మ కూతురు ఆన్సర్ ఇదే!
Advertisement

Gajulu Gajulu Gala Gala Song:సోషల్ మీడియాలో ఇపుడు ఎక్కడ చూసినా ఒకటే పాట .అదే గాజులు గాజులు.. గాజులు గల గల ..గాజులు గాజులు.. గాజులు గల గల.. నవరాత్రుల సందర్భంగా చేసిన ఈ పాట అలా నెట్టింట్లోకి వచ్చిందో లేదో ఒక్కసారిగా పాపులర్ అయిపొయింది.భవానీ మాల వేసిన రాధమ్మ కూతురు,కీర్తనలు చేసిన ఈ పాట ఇపుడు ఏకంగా కేవలం ఐదంటే ఐదు రోజుల్లోనే 9.4 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిందంటే ఈ గాజుల గల గలలు ఏ రేంజ్ లో సౌండ్ చేస్తున్నాయో అర్థం అవుతుంది.

ఇక పాట ఈ రేంజ్ లో వైరల్ అవ్వడంతో రాధమ్మ కూతురు పై అమ్మవారి దయ ఉందని, అందుకే ఇంత పాపులారిటీ సొంతం చేసుకుందని ప్రశంసల వర్షం కురిపించారు . ఇక ఈ ఏడు దసరాకి వచ్చిన ఎన్నో దుర్గమ్మ పాటలలో ఇదే వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ గా నిలిచిందని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.ఆల్ ది బెస్ట్ అని ఇలాగే మరిన్ని మంచి పాటలు చేయాలని కామెంట్ల వర్షం కురిపించారు చాలా మంది నెటిజన్లు.అయితే ఎంత పాజిటివ్ గా కామెంట్స్ వస్తున్నాయో అంతకు మించి నెగెటివ్ కామెంట్స్ ఈ పాటపై రావడం గమనార్హం.

Advertisement

విమర్శల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు 

ముఖ్యంగా రాదమ్మ కూతురు భవానీ మాల అమ్మవారిపై భక్తితో వేయలేదని,కేవలం రీల్స్ కోసమే వేసిందని కొందరు కామెంట్స్ చేస్తే,అసలు ఆమె కెమెరా వంక చూడడమే తప్ప భక్తి తో పాడడం లేదని ఏకిపారేస్తున్నారు.ఇక మరికొంత మందిఆత్మ శుద్ధి లేని ఆచారం ఎలా…..చిత్త శుద్ధి లేని శివ పూజ ఎలా… అంటూ రాధమ్మ కూతురు చేసిన ఈ పాటపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.మీకు కెమెరా, వీడియో లా మీద ఉన్న శ్రద్ధ,మీ మాల మీద, ఆ అమ్మవారి మీద అస్సలు లేదు. జై భవాని, జై శివాజీ అంటూ మరికొందరు రాధమ్మ కూతురు పై నెగెటివ్ కామెంట్స్ వదులుతున్నారు.

Advertisement

నేను భవానీ మాలని అపహాస్యం చేశానా?

దీంతో మొన్నటి వరకు మాలలో ఉన్న రాధమ్మ కూతురు మాల తీయగానే తాజాగా వీటిపై రియాక్ట్ అయ్యింది,ఏంటి నేను భవానీ మాలని అపహాస్యం చేశానా? చెప్పుతో కొడతాను.ఏంటీ  కేవలం రీల్స్ కోసమే నేను మాల వేశానా ?అసలు అన్నం తింటున్నారా లేదా గడ్డి తింటున్నారా ?నా పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది .నేను ఏం చేశానో నా భక్తీ ఎలాంటిదో అంటూ మండిపడింది.అసలు మీరు మనుషులేనా ?నా పై ట్రోల్స్ చేస్తారా ..?అయినా నా పాట కేవలం తక్కువ రోజుల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ కొల్లగొట్టడంతో వచ్చిన జలసి అది.మీరెన్ని చెత్త కామెంట్స్ చేసినా పీకేదేమీ లేదు .మీరలా ట్రోల్ చేస్తూనే ఉండండి ,నేను ఎదుగుతూనే ఉంటా అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయింది.

ఇంకెన్ని ట్రోల్స్ ని ఫేస్ చేస్తుందో

ఇక ఈ వీడియో ఇలా వచ్చిందో లేదో దీనిపై కూడా కామెంట్స్ వదిలారు నెటిజన్లు.అదీ అక్కా అలా జవాబు ఇవ్వు .వాళ్లకి సాధ్యం కానిది నువ్ చేశావని కడుపు మంట అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తే నువ్వు భవానీ మాల వేసుకుని నేర్చుకున్నది ఇదేనాఅంటూ మరికొంతమంది కౌంటర్లు వదులుతున్నారు.

ఏది ఏమైనా ఎవరు ఏమన్నా ఈ పాట ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది అన్నది వాస్తవం.మొత్తానికి డివైన్ ట్యూన్ కి మాస్ టచ్ మిక్స్ అయిన ఈ పాట వచ్చే రోజుల్లో ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో ,ఇంకెన్ని ట్రోల్స్ ని ఫేస్ చేస్తుందో కాలమే డిసైడ్ చేయాలి !

ALSO READ :ఇదేం క్రేజ్ మామా.. ‘గాజులు గల గల’ పాటకు జనం ఫిదా!

Tags

Related News

హౌస్ లో దొంగలుగా మారిన స్నేహితులు.. ఆ ఇద్దరూ వీరి ముందు నెగ్గుతారా?

రెండేళ్లలోపే అరుదైన ఘనత సాధించిన బిగ్ బాస్ మానస్ కొడుకు!

కళ్లకు చూపు లేదు.. కానీ పాటలతో ఫేమస్! రషీద్, సమీరా జీవితంలో ఇన్ని కష్టాలా?

టాస్క్ ఎఫెక్ట్.. స్పీడ్ పెంచిన నరేష్.. వారిద్దరిపై వేటు తప్పదా?

నరేష్ కి బిగ్ బాస్ అన్యాయం.. ఆ ముగ్గురే విజేతలు!

Podarillu : కన్నా తల్లి నిజం చెప్తుందా..? ఇలాంటి ట్విస్ట్ నెవ్వర్ బిఫోర్..

Illu Illaalu Pillalu : సీరియల్లో మరో ట్విస్ట్.. ఆ క్యారక్టర్ అవుట్..

Big Stories

Advertisement
×