Bigg Boss 10 Dakshi:తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10లో ఎప్పటికప్పుడు ఊహించని కొత్త మలుపులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గత వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా షాలిని లేదా వర్షిణి ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. షాలినినీ ఎలిమినేట్ చేస్తున్నట్లు చెప్పి, ఆమెను సీక్రెట్ రూమ్ కి పంపించారు. ఏడవ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ పూర్తవగానే.. ఆమెను హౌస్ లోకి పంపించి మళ్లీ గొడవ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడవ వారానికి సంబంధించి ఏకంగా 12 మంది నామినేషన్ లోకి వచ్చారు. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు రాగా అది నిజమైంది.
ఇక శనివారం ఎపిసోడ్ లో భాగంగా ఒక స్టార్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసి.. సండే ఎపిసోడ్లో భాగంగా మరొకరిని ఎలిమినేట్ చేయబోతున్నట్లు సమాచారం . ఇకపోతే కనివిని ఎరుగని రీతిలో ఒక ఊహించని కంటెస్టెంట్ ఇప్పుడు హౌస్ ని వీడాల్సిన పరిస్థితి రావడంతో ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మరి ఈరోజు ఎలిమినేట్ అయిన ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.. ఈవారం త్రిగుణ్, రోహిత్ రామకృష్ణ , అమన్, శ్వేతా నాయుడు, వంశీ, వర్షిణి, సుధీర్, శివ, దక్షి, ఝాన్సీ, నీతూ మాస్టర్ ఇలా మొత్తం 12 మంది ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. అయితే హౌస్ లో నిర్వహించిన ప్రతిష్టాత్మక గోట్ టాస్క్ లో అమన్, నీతూ, దేబ్జానీ, ముఖేష్ ఈ వారంతో పాటు వచ్చేవారం కూడా నామినేషన్ల నుండి పూర్తిగా సేవ్ అయ్యారు.
ఇక మిగతా కంటెస్టెంట్లకు సంబంధించిన తాజా ఓటింగ్ ను బట్టి చూస్తే ఆసక్తికర విషయాలు వైరల్ అయ్యాయి. ఓటింగ్ పరంగా రోహిత్ ఎప్పటిలాగే మొదటి స్థానంలో దూసుకుపోతుండగా.. తర్వాతి స్థానాలలో త్రిగుణ్, రామకృష్ణ, అమన్, ఝాన్సీ, వర్షిణి , సుధీర్, వంశీ వరుస క్రమంలో కొనసాగుతున్నారు. ఇక ఓటింగ్ చివరి స్థానాలలో శ్వేతా నాయుడు, నీతూ మాస్టర్, దక్షి, శివ నిలిచారు. అయితే నీతూ మాస్టర్ ఇప్పటికే గోట్ టాస్క్ ద్వారా సేవ్ అవడంతో ఆమె ఆ టెన్షన్ నుండి బయటపడ్డారు. ఇక ప్రస్తుతానికి దక్షి, శ్వేతా నాయుడు, శివ డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్ళల్లో సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం దక్షి (Dakshi) తొలి ఎలిమినేషన్ గా హౌస్ నుండి బయటకు వచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
also read:వయసు మారితే బాడీ లాంగ్వేజ్ కూడా మారాల్సిందే – రాగ్ మయూర్!
గతవారం షాలిని ఎలిమినేట్ కాకపోవడం, పైగా 12 మంది నామినేషన్ లో నిలవడంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. మరి వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ కేవలం దక్షిను మాత్రమే ఎలిమినేట్ చేసి సరి పెడతారా? లేదంటే డేంజర్ జోన్ లో ఉన్న మరో కంటెస్టెంట్ ను కూడా బయటకు పంపి డబుల్ ఎలిమినేషన్ సర్ప్రైజ్ ఇస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన దక్షి.. ఇంత త్వరగా ఎలిమినేట్ అవ్వడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.