E-Paper
Advertisement

కేరళ స్టైల్ ప్రాన్స్ ఫ్రై..హోటల్ టేస్ట్ మించిపోయేలా ఇంట్లోనే ఇలా రెడీ చేయండి!

కేరళ స్టైల్ ప్రాన్స్ ఫ్రై..హోటల్ టేస్ట్ మించిపోయేలా ఇంట్లోనే ఇలా రెడీ చేయండి!
Advertisement

Kerala Style Prawns Fry: తీర ప్రాంత వంటకాల్లో కేరళ వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా అక్కడ వాడే మసాలాలు, కొబ్బరి నూనె వాసన వంటకం రుచిని రెట్టింపు చేస్తాయి. అందులోనూ రొయ్యలతో చేసే ఏ వంటకమైనా క్షణాల్లో మాయమైపోతుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ‘కేరళ స్టైల్ ప్రాన్స్ ఫ్రై’ కేవలం రుచిలోనే కాదు, తయారీలోనూ చాలా ప్రత్యేకం. ఇంటర్‌నెట్‌లో, ఫుడ్ వ్లాగ్స్‌లో ఈ రెసిపీకి విపరీతమైన క్రేజ్ ఉంది. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

రొయ్యలు (ప్రాన్స్ – శుభ్రం చేసుకున్నవి)-500 గ్రాములు

Advertisement

చిన్న ఉల్లిపాయలు (షాలోట్స్ / సాంబార్ ఉల్లిపాయలు) – 12- 15 (సన్నగా తరిగినవి)

అల్లం – 1 ముక్క (సన్నగా తరిగినది లేదా పేస్ట్)

Advertisement

వెల్లుల్లి రెమ్మలు – 10 (కచ్చాపచ్చాగా దంచినవి)

పచ్చిమిర్చి – 4

కరివేపాకు – 3 రెమ్మలు

పసుపు – అర టీస్పూన్

కారం – 1.5 టేబుల్ స్పూన్లు

కాశ్మీరీ కారం – 1 టీస్పూన్

మిరియాల పొడి – 1 టీస్పూన్

ధనియాల పొడి – 1 టీస్పూన్

గరం మసాలా – అర టీస్పూన్

కొబ్బరి నూనె – 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

నిమ్మరసం – కొద్దిగా

తయారీ విధానం:

1. ముందుగా రొయ్యలను ఉప్పు, పసుపు వేసి నీటిలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో రొయ్యలు తీసుకుని, అందులో చిటికెడు పసుపు, అర టీస్పూన్ కారం, కొద్దిగా మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు రొయ్యల లోపలికి బాగా ఇంకుతాయి.

2. కేరళ వంటకాలంటేనే కొబ్బరి నూనె. స్టవ్ మీద మందపాటి కడాయి లేదా ఇనుప పాన్ పెట్టి, అందులో 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు వేసి చిటపట లాడనివ్వాలి. ఇప్పుడు సన్నగా తరిగిన చిన్న ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

3.ఉల్లిపాయలు వేగాక, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, అల్లం ముక్కలను వేయాలి. వీటిని పచ్చి వాసన పూర్తిగా పోయే వరకు వేయించాలి. దీని నుంచి వచ్చే సువాసన కేరళ స్టైల్ వంటకాలకు అసలైన రుచిని ఇస్తుంది.

Also Read: నోరూరించే బెండకాయ పచ్చడి..చపాతీ,అన్నంలోకి సూపర్ కాంబినేషన్!

4. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, అందులో.. మిగిలిన కారం, కాశ్మీరీ కారం, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. మసాలాలు మాడి పోకుండా కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ.. ఆయిల్ పైకి తేలే వరకు వేయించాలి.

5. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను కడాయిలో వేయాలి. రొయ్యలు వేయగానే.. నీరు ఊరుతుంది. ఆ నీరంతా పూర్తిగా ఇంకిపోయే వరకు మూత పెట్టకుండా మీడియం మంటపై వేయించాలి. రొయ్యలు గట్టిపడకుండా మెత్తగా.. అలాగే క్రిస్పీగా మారేలా చూసుకోవాలి. చివరగా గరం మసాలా, పైన మరో రెమ్మ కరివేపాకు, కొద్దిగా నిమ్మరసం పిండుకుని దించేయాలి.

చిట్కాలు:
రొయ్యలను ఎక్కువ సేపు ఉడికిస్తే.. రబ్బరులా మారుతాయి. కాబట్టి తక్కువ సమయంలో వేయించుకోవడం ముఖ్యం.

సాంబార్ ఉల్లిపాయలు అందుబాటులో లేకపోతే సాధారణ ఉల్లిపాయలను సన్నగా తరిగి వాడుకోవచ్చు. కానీ చిన్న ఉల్లిపాయలతో టేస్ట్ చాలా బాగుంటుంది.

వేడి వేడి అన్నంలోకి, రసం లేదా పప్పుచారుతో ఈ కేరళ స్టైల్ ప్రాన్స్ ఫ్రై నంజుకుని తింటే ఆ ఫీల్ ఏ వేరు. వీకెండ్‌లో ఈ ట్రెండీ డిష్‌ను తప్పకుండా ట్రై చేయండి.

Related News

హోటల్ స్టైల్ కరివేపాకు చికెన్ ఫ్రై..టేస్ట్ అదిరిపోద్ది!

దీపావళికి ముందే ఈ 5 పనులు చేసేయండి.. పండగ రోజు అస్సలు టెన్షన్ ఉండదు!

లేఆఫ్ తర్వాత.. రెండేళ్ల కొడుకుతో ఆఫీసుకెళ్లిన ఉద్యోగి, చివరికి ఓ నిజం తెలుసుకున్నాడు

ప్రసవం తరువాత పెరిగిన బరువు తగ్గాలా? ఇంట్లోనే సులభంగా ఈ 3 వ్యాయామాలు చేయండి

ఈ 7 రకాల వ్యక్తులతో గొడవపడితే మీకే నష్టం.. వీరితో శత్రుత్వం అసలు పెట్టుకోకూడదు

గంజాయి, డ్రగ్స్ వ్యసనంతో బాధపడుతున్నారా? ఈ దురలవాటు మానేయడానికి మార్గాలివే

ప్లాస్టిక్ గుడ్లపై FSSAI కీలక సూచనలు..గుడ్డు తాజాదనాన్ని ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోండి!

Big Stories

Advertisement
×