Kissik Talks Mithilesh Reddy:బిగ్ బాస్ సీజన్ 10లోకి అగ్ని పరీక్ష సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొని.. అక్కడ గుర్తింపు తెచ్చుకొని వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన రెండు రోజుల్లోనే బిగ్ బాస్ ఇచ్చిన సూట్ కేస్ ఆఫర్ 15 లక్షలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు మిథిలేష్ రెడ్డి (Mithilesh Reddy). ఈయన తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ షోలో పాల్గొని సందడి చేశారు. ఇందులో భాగంగానే తన బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పి ప్రస్తుతం తాను ఏం చేయాలనుకుంటున్నానో చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.
కిస్సిక్ టాక్స్ షోలో భాగంగా హోస్ట్ వర్ష మాట్లాడుతూ.. మీరు ఎక్కడ జన్మించారు? మీ తల్లిదండ్రులు ఎవరు? మీ ఫ్యామిలీ వెల్ సెటిల్డా? అంటూ ఇలా ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి పలు ప్రశ్నలు సంధించింది. మిథిలేష్ మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా మదనపల్లిలో జన్మించాను. కానీ ఇప్పుడు అన్నమయ్య జిల్లాగా మార్చేశారు. ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ మొత్తం మదనపల్లిలోనే సాగింది. కానీ బీటెక్ (కంప్యూటర్ సైన్స్) చెన్నైలో చేశాను.
మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి) అని వర్షా ప్రశ్నించగా..” మా అమ్మానాన్న ఇద్దరు సెటిల్. నేను వాళ్లకు ఒక్కడే అబ్బాయిని. మా అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ కావడం వల్ల ఆర్థికంగా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి నాకు సంబంధం లేదు. ముఖ్యంగా నేను అనుకున్నది చేసే ఫ్రీడమ్ అయితే నాకు ఫ్యామిలీ నాకు ఇచ్చింది”.
ఇప్పుడు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించగా.. రెండు పాటలు చర్చల్లో ఉన్నాయి. కొన్ని కథలు కూడా వింటున్నాను. అందులో ఏదైనా బాగుండి నన్ను ఆలోచింపచేసి, ఎగ్జైట్ చేస్తే కచ్చితంగా ఆ ప్రాజెక్ట్ చేస్తాను అంటూ తెలిపారు.
also read:మిథిలేష్ అసలైన స్ట్రాటజీ.. 15 లక్షలకే కమిట్ అవ్వడం వెనుక ఇంత లాజిక్ ఉందా?
ఈ 15 లక్షల ప్రైజ్ మనీ తీసుకుని బయటకు రావడంపై మీ అమ్మానాన్న రియాక్షన్ ఏంటి? అని వర్ష ప్రశ్నించగా.. వాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మా అమ్మ కరెక్ట్ చేశావని పొగిడింది. బయట ఉండే సిచువేషన్లు, పిఆర్ టీంలు, నెగిటివ్ రివ్యూలు వీటన్నింటినీ తప్పించుకొని చాలా స్మార్ట్ గా బయటకు వచ్చేసావు అంటూ చెప్పారు అంటూ చెప్పుకొచ్చారు మిథిలేష్ రెడ్డి. మొత్తానికి అయితే ప్యూర్ కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టి అసలైన స్ట్రాటజీతో మైండ్ గేమ్ తో రెండు రోజుల్లోనే భారీ డబ్బుతో పాటు ఊహించని క్రేజ్ సొంతం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు మిథిలేష్ రెడ్డి.