E-Paper
Advertisement

మిథిలేష్ అసలైన స్ట్రాటజీ.. 15 లక్షలకే కమిట్ అవ్వడం వెనుక ఇంత లాజిక్ ఉందా?

మిథిలేష్ అసలైన స్ట్రాటజీ.. 15 లక్షలకే కమిట్ అవ్వడం వెనుక ఇంత లాజిక్ ఉందా?
Advertisement

Kissik Talks Mithilesh Reddy:బిగ్ బాస్ హిస్టరీలో ఎవరి పేరు గుర్తున్నా.. గుర్తుండకపోయినా.. అందరూ గుర్తు పెట్టుకునే ఏకైక పేరు మిథిలేష్. ఎవరూ ఊహించని విధంగా కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన 48 గంటల్లోనే బిగ్ బాస్ కే టెన్షన్ ఇస్తూ.. హోస్ట్ నాగార్జున (Nagarjuna) నే షాక్ కి గురిచేస్తూ ఏకంగా రూ.15 లక్షల సూట్ కేస్ ఆఫర్ ను తీసుకొని స్మార్ట్ స్ట్రాటజీతో బయటకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. బిగ్ బాస్ సీజన్ 10 లో రెండు రోజుల్లోనే విపరీతమైన క్రేజ్ తో పాటు డబ్బును కూడా సొంతం చేసుకొని అందరిని అబ్బురపరిచారు. ముఖ్యంగా అగ్ని పరీక్ష జ్యూరీస్ ని కూడా మెప్పించిన మిథిలేష్ తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు. ఇందులో ఎన్నో విషయాలను పంచుకున్న ఈయన ముఖ్యంగా రూ.15 లక్షలకే ఆగిపోవడం వెనక అసలు కారణాలు చెప్పారు.

టెన్షన్ బిగ్ బాస్ కి టెంప్టేషన్ నాకు..

రెండు రోజుల్లోనే 15 లక్షలు తీసుకొని బయటకు రావడం వెనుక మీ ఆలోచన ఏంటి? హోస్ట్ వర్ష ప్రశ్నించగా.. మిథిలేష్ మాట్లాడుతూ.. “బిగ్ బాస్ సీజన్ 10 థర్డ్ వీక్ లో టెన్షన్ వర్సెస్ టెంప్టేషన్ రౌండ్ నడుస్తోంది కదా.. ఆ థీమ్ లో బిగ్ బాస్ మనల్ని టెన్షన్ పెడదాం అనుకున్నారు. అందుకే బిగ్ బాస్ కి టెన్షన్ పెట్టాను. అంటే టెన్షన్ బిగ్ బాస్ కి టెంప్టేషన్ నాకు. ఓకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. నేను తీసుకున్న ఒక్క నిర్ణయంతో నాకు గుర్తింపుతో పాటు డబ్బు కూడా వచ్చింది. అంటూ మిథిలేష్ తెలిపారు.

అందుకే సూట్ కేస్ ఆఫర్ తీసుకున్నాను..

Advertisement

అసలు డబ్బు తీసుకొని హౌస్ నుండి వెళ్లిపోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? వాళ్ళు పెట్టే టెన్షన్ తట్టుకోలేక, ఆ గేమ్స్ అవన్నీ ఆడలేక వెళ్ళిపోదామని నిర్ణయించుకొని సూట్ కేస్ ఆఫర్తో బయటకు వచ్చారా? అని అడగగా.. “మనం మన కళ్ళ ముందు ఉన్న ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే మనం ఎంత పెర్ఫార్మన్స్ ఇచ్చినా ఎన్నో ఫ్యాక్టర్స్ అనేవి మనకు ఉంటాయి. ముఖ్యంగా హౌస్ లో మనం ఎన్ని రోజులు ఉన్నా సరే.. మనం క్యారెక్టర్ ఎలా బయటకు వెళ్తోంది. మన గురించి నెగిటివ్గా బయటకు వెళ్తోందా? అనే విషయాలు ఏవి కూడా మనకు తెలియవు. అందుకే అవన్నీ ఆలోచించుకొని కళ్ళ ముందు ఉన్న ఆపర్చునిటీని ఉపయోగించుకుందాం అనుకొని, ఒకవేళ మిస్ అయితే మళ్ళీ ఫైట్ చేద్దాం అనుకున్నాను..

also read:పెళ్లిపై ఊహించని కామెంట్స్ చేసిన ఇనయా సుల్తానా..!

రూ.15 లక్షలకే ఎందుకు ఆగిపోయానంటే – మిథిలేష్

Advertisement

ప్రైజ్ మనీ ఇంకా పెరుగు ఉండేదేమో కదా.. ఎందుకు 15 లక్షలకే టెంప్ట్ అయ్యారు అని వర్షా మళ్లీ ప్రశ్నించగా.. 15 లక్షలు అనేది పెరిగితే 20 లక్షలవుతుంది. ఇంకా పెరిగితే 25 లక్షలు అవుతుంది. అయితే అదంతా విన్నర్ ప్రైజ్ మనీ.. ప్రొడక్షన్ ప్రైజ్ మనీ కాదు కదా.. విన్నర్ ప్రైజ్ మనీని మనం తెచ్చుకోవాలి అంటే హౌస్ మేట్స్ ని ఒప్పించాల్సి ఉంటుంది. రూ.20 లక్షలు అన్నప్పుడు మేబి వాళ్ళు కన్విన్స్ అవ్వకపోవచ్చు ఏమో. ఒట్టి చేతులతో నేను ఉండాల్సి వచ్చేదేమో.. 15 లక్షల మాత్రమే కాబట్టి మెజారిటీ ఓట్స్ అనుకూలంగా రావడంతో నేను బయటకు వచ్చాను. విన్నర్ అవుతామని అందరికీ ఉంది. కాబట్టే ఆ పదహైదు లక్షలు వాళ్లు తక్కువ అమౌంట్ అనుకుంటున్నారు. విన్నర్ అవ్వాలి లేదా ప్రైస్ మనీ తో బయటకు రావాలి. ఈ ఇద్దరే జనాలకు గుర్తుంటారు. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను అంటూ తెలిపారు.

Related News

మీ ఇంట్లో డబ్బు తీసుకెళ్లానా?రూ.15 లక్షల ట్రోల్స్ పై మిథిలేష్ షాకింగ్ రియాక్షన్!

ఎవరీ మిథిలేష్.. బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

పెళ్లిపై ఊహించని కామెంట్స్ చేసిన ఇనయా సుల్తానా..!

ఇదేం క్రేజ్ మామా.. ‘గాజులు గల గల’ పాటకు జనం ఫిదా!

8 కాదు 12.. ఈ వారం నామినేషన్ లిస్ట్ ఇదే..ఎవరెవరున్నారంటే?

షాలిని ఈజ్ బ్యాక్.. షాక్ లో కంటెస్టెంట్స్!

Podarillu Serial : మహా, చక్రీ కలుస్తారా..? ఫైనల్ ట్విస్ట్ ఇదేనా..?

Big Stories

Advertisement
×