E-Paper
Advertisement

గోల్ కొట్టాలని గుడ్డివాడి వేషం… కట్ చేస్తే అడ్డంగా బుక్… వేరే దేశం వెళ్ళడానికి ఇదేం పాడు పని భయ్యా

గోల్ కొట్టాలని గుడ్డివాడి వేషం… కట్ చేస్తే అడ్డంగా బుక్… వేరే దేశం వెళ్ళడానికి ఇదేం పాడు పని భయ్యా
Advertisement

Egyptian Comedy Drama: జీవితంలో ఎలాగైనా సెటిల్ అవ్వాలని చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మంచి ఉద్యోగం కోసం కొందరు కష్టపడితే, విదేశాలకు వెళ్లి కొత్త జీవితం ప్రారంభించాలని మరికొందరు కలలు కంటారు. కానీ ఆ కలను నిజం చేసుకోవడానికి ఓ వ్యక్తి ఏకంగా తనకు కళ్లు కనిపించవన్నట్టు నటిస్తే ఎలా ఉంటుంది ? వినడానికి కాస్త వింతగా అనిపించినా, ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే ‘వాయ్ వాయ్ వాయ్’ (Voy! Voy! Voy!). ఈజిప్టులో పేదరికంతో ఇబ్బందులు పడుతున్న ఓ యువకుడు, యూరప్‌ కు వెళ్లేందుకు వేసే మాస్టర్ ప్లాన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కామెడీతో పాటు సస్పెన్స్, ఎమోషన్స్ కలిసిన ఈ సినిమా రెగ్యులర్ కథల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. నిజ జీవిత ఘటనల నుంచి స్ఫూర్తి పొందిన ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా లేదా ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

హసన్ ఈజిప్టులో తన తల్లితో కలిసి ఉండే ఓ పేద యువకుడు. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నా, ఆ సంపాదనతో అతడికి ఏమాత్రం సరిపోదు. ఆ పేదరికం నుంచి బయటపడాలని, యూరప్‌ కు వెళ్లి మంచి జీవితాన్ని ప్రారంభించాలని కలలు కంటుంటాడు. కానీ విదేశాలకు వెళ్లడం అంత సులభం కాదు. సరైన అవకాశం దొరకదు. అలాంటి సమయంలో హసన్‌ కు ఓ వింత అవకాశం కనిపిస్తుంది. అంధుల ఫుట్‌బాల్ జట్టు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు పోలాండ్‌ కు వెళ్లబోతోందని తెలుసుకుంటాడు. ఆ జట్టుతో కలిసి యూరప్‌ కు వెళ్లగలిగితే తన జీవితమే మారిపోతుందని భావిస్తాడు.

Advertisement

కానీ అందుకు తాను కూడా అంధుడినని అందరినీ నమ్మించాలి. అంతే… కళ్లు బాగానే కనిపిస్తున్నా, తనకు చూపు లేదన్నట్టు నటిస్తూ ఆ జట్టులో చోటు సంపాదించేందుకు ప్లాన్ వేస్తాడు. అక్కడి నుంచి హసన్‌ కు అసలైన పరీక్ష మొదలవుతుంది. అంధుడిలా నటించడం ఒక ఎత్తయితే, నిజంగా చూపు లేని ఆటగాళ్లతో కలిసి శిక్షణ తీసుకోవడం మరో ఎత్తు. వాళ్ల మధ్య తన గుట్టు బయట పడకుండా జాగ్రత్త పడాలి. అదే సమయంలో ఫుట్‌బాల్ జట్టుతో కలిసి ప్రయాణించే అవకాశం చేజారిపోకుండా చూసుకోవాలి. చిన్న పొరపాటు జరిగినా అతడి అసలు రంగు బయటపడే ప్రమాదం ఉంటుంది.

ఈ ప్రయాణంలో హసన్‌కు జట్టు కోచ్, ఇతర ఆటగాళ్లు, ఆ టీమ్ గురించి కథనాలు రాయడానికి వచ్చే ఓ యువ జర్నలిస్ట్ పరిచయమవుతారు. ఒక్కొక్కరితో అతడికి ఏర్పడే పరిచయాలు కథను మరో మలుపు తిప్పుతాయి. తన లక్ష్యం కోసం మొదలు పెట్టిన మోసం అతడికి ఎలాంటి ఇబ్బందులు తెచ్చి పెడుతుంది ? చివరకు యూరప్‌కు వెళ్లాలనే తన కల నెరవేరుతుందా లేదా ? అనేదే సినిమాలో చూసి తెలుసుకోవలసిన కథ.

తెలుగులో ఉందా ?

Advertisement

‘వాయ్ వాయ్ వాయ్’ 2023లో విడుదలైన ఈజిప్షియన్ కామెడీ డ్రామా. భారతదేశంలో జియోహాట్‌స్టార్ (Jio Hotstar)లో ఈ సినిమాను చూడొచ్చు. హిందీ వెర్షన్ అందుబాటులో ఉంది. అయితే తెలుగు డబ్బింగ్ ఆడియో రిలీజ్ కాలేదు. మొహమ్మద్ ఫరాగ్ (Mohamed Farrag) హసన్ పాత్రలో నటించగా, నెల్లీ కరీమ్ (Nelly Karim), బయూమీ ఫౌద్ (Bayoumi Fouad), తాహా దేసూకీ (Taha Desouky) కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఒమర్ హిలాల్ (Omar Hilal) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవ్విస్తూనే… పేదరికం, విదేశాలకు వెళ్లాలనే ఆశ, అవకాశాల కోసం మనుషులు తీసుకునే నిర్ణయాల గురించి ఆలోచింపజేసేలా కథను తీర్చిదిద్దారు.

Read Also: కూతురు ప్రేమలో పడితే తండ్రికి టెన్షన్‌… ఆమె లవ్‌ లైఫ్‌ పాడు చేయడానికి సీక్రెట్‌ ప్లాన్లు… భలే కామెడీ భయ్యా

Related News

ఇన్నాళ్లూ తాజ్‌మహల్‌ గురించి మనం చదివింది నిజమేనా ? పుస్తకాలలో చెప్పని నిజాలు… ఈ కోర్టు రూమ్ డ్రామాను డోంట్ మిస్

థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న జైలర్ 2?

 హర్రర్ నుంచి హీస్ట్ థ్రిల్లర్ వరకు ఈ వారం ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సినిమాలు… ఈ తెలుగు సినిమాలు మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు

This Week OTT Releases : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

జగపతిబాబు షోలో బాలయ్య రహస్యాలు రివీల్ చేసిన నారా లోకేష్!

ప్రేమ కోసం షోలోకి… కెమెరాలు ఆగాక వాళ్ల బంధాలు ఏమయ్యాయి ? క్రేజీ కొరియన్ సిరీస్

చక్రవర్తి సింహాసనానికే ఎసరు పెట్టే నింజాలు… ఒక్క సీక్రెట్ బయటకొస్తే బ్లడీ బ్లడ్ బాత్… యాక్షన్ తో ఇరగదీస్తున్న సిరీస్

Big Stories

Advertisement
×