Bigg Boss 10 Contestants:మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సీజన్ కి కూడా నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరించనున్నారు. దశావతారం, థీమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సీజన్లోకి కంటెస్టెంట్ గా ఎవరు అడుగు పెట్టబోతున్నారు అనే ఉత్కంఠ ఇప్పటికే ఆడియన్స్ లో నెలకొంది. అయితే సెప్టెంబర్ 6వ తేదీన గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టే పదిమంది సెలబ్రిటీస్ వీరే అంటూ.. ఫైనల్ లిస్ట్ ఇదే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ ఆటో రాంప్రసాద్, పొట్టి నరేష్ హౌస్ లోకి అడుగుపెడుతుండగా ..సినీ నటులు టెంపర్ వంశీ , ఆదిత్ అరుణ్, సుధీర్ రెడ్డి హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. ఇక సీరియల్స్ నుంచి ముఖేష్ గౌడ, చైత్రారాయ్, దేబ్జానీ మోదక్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. ఇక యాంకర్ కం నటిగా గుర్తింపు తెచ్చుకున్న వర్షిని సౌందరరాజన్ కూడా సీజన్ 10 లో పార్టిసిపేట్ చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ లిస్టు దాదాపు కన్ఫామ్ అయిపోయింది అంటూ ఒకవైపు వార్తలు రాగా.. ఇక ఈ లిస్టు కన్ఫామ్ అవునా కాదా తెలియాలి అంటే సెప్టెంబర్ 6 సాయంత్రం 7:00 వరకు ఎదురు చూడాల్సిందే.
ఆర్ జె చరణ్, మిథిలేష్, రాజకుమారి దయాన, షాలిని పటేల్, సృష్టి వ్యాకరన్, నవరసాలు మామ ఆర్కె, అమన్ మసూద్, భాగీ తుల్లూరి, హేమంత్, సేనాపతి దీపక్, అపూర్వ, యాంకర్ ప్రియా , సింగర్ ఝాన్సీ, రోహిత్ నాయుడు, గాయత్రి వీరంతా అగ్ని వారియర్స్ గా దూసుకుపోతున్నారు. వీరిలో ఆరు మంది బెస్ట్ పీపుల్స్ ని బయటకు తీసి హౌస్ లోకి పంపించబోతున్నారు. ఇక ప్రత్యేకించి వీరిలో ఝాన్సీ, రోహిత్ నాయుడు, షాలిని, సృష్టి వ్యాకరన్, నవరసాలు ఆర్కే, ఆర్జే చరణ్ దాదాపు కన్ఫామ్ అయిపోయారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
also read:బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ.. ‘ప్రేమలు’ మూవీ లాంటి సక్సెస్ లభిస్తుందా?
దశావతారం థీమ్ తో రాబోతున్న ఈ బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లో అన్నీ కూడా పది రెట్లు రెట్టింపుతో రాబోతున్నాయంటూ హోస్ట్ నాగార్జున వెల్లడించిన విషయం తెలిసిందే. పదిమంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ అడుగు పెట్టబోతున్నారు . టాస్క్ లలో, గేమ్స్ లో సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నారు కామనర్స్ . తగ్గేదేలే అనేట్టుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా వీరి ఎంపిక షోకి మరింత హెల్ప్ అవుతుందని, ఈసారి బిగ్ బాస్ హౌస్ వేరే లెవెల్ లో ఉండబోతోందని తెలుస్తోంది.