E-Paper
Advertisement

తెలంగాణను గ్లోబల్ డిఫెన్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను గ్లోబల్ డిఫెన్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

Telangana Defence Hub: స్వేచ్ఛ బ్యూరో: దేశ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణను అంతర్జాతీయ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ‘రక్షా ఎక్స్‌పో – 2026 కర్టెన్ రైజర్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యుద్ధానికి అవసరమైన సాంకేతికతను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి, రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. యుద్ధం కోసమే కాకుండా శాంతిని కాపాడేందుకు కూడా ఆయుధాలు అత్యవసరం అన్నారు. శత్రువులను నిరోధించే వ్యూహాత్మక ఆధిక్యం భారత్‌కు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ వ్యూహాత్మకంగా అత్యంత సురక్షితమైన నగరమని, సైనిక, వైమానిక దళాల కీలక కేంద్రాలతో పాటు నిపుణులైన మానవ వనరులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని సీఎం తెలిపారు. పెట్టుబడులకు కూడా సురక్షితమైన నగరం అని సీఎం వ్యాఖ్యానించారు. ఇక సముద్రతీరం లేకపోయినప్పటికీ, వికారాబాద్ జిల్లా దామగుండంలో నౌకాదళ రాడార్ కేంద్రాన్ని నిర్మిస్తూ నౌకాదళానికి తెలంగాణ అత్యంత కీలక సేవలు అందిస్తోందని గుర్తుచేశారు. మరో వైపు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దడం ద్వారా రక్షణ రంగానికి అవసరమైన మానవ వనరులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

పెట్టుబడుల ప్రణాళికలను రెట్టింపు చేయండి..

Advertisement

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే సంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడి ప్రణాళికలను రెట్టింపు చేయాలని ,ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు సీఎంచెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి ‘పాలసీ పెరాలసిస్’ లేదని, రాజకీయాలు వేరైనా అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో స్పష్టమైన విధానం, దృఢ సంకల్పంతో ఉన్నామని స్పష్టం చేశారు.

త్వరలోనే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0..

Advertisement

తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా త్వరలోనే ‘ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0’ ను విడుదల చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు.దేశ జీ డీ పీ లో ప్రస్తుతం 5 శాతంగా ఉన్న తెలంగాణ వాటాను 2047 నాటికి 10 శాతానికి పెంచడమే లక్ష్యమని వెల్లడించారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను ఎదిగించడంలో రక్షణ ఉత్పత్తులు, ఏరోస్పేస్ రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’..

హైదరాబాద్‌ భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ కు అందరూ హాజరు కావాలని సీఎం ఆహ్వానించారు. గతేడాది సదస్సు విజయవంతమైందని, ఈసారి మరింత భారీ స్థాయిలో దీనిని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ , హెచ్‌ఏఎల్ , బీడీఎల్ , మిధాని, టాటా, ఎయిర్‌బస్, సాఫ్రాన్, స్కైరూట్, లాక్‌హీడ్ మార్టిన్, భారత్ ఫోర్జ్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: పోలీస్‌ వేలు కొరికి.. నడిరోడ్డుపై బట్టలిప్పేసి.. ర్యాపిడో డ్రైవర్ నానా హంగామా!

Tags

Related News

పనిచేయనప్పుడు పదవులెందుకు.. బీజేపీ నేతలకు బన్సల్ వార్నింగ్?

పోలీస్‌ వేలు కొరికి.. నడిరోడ్డుపై బట్టలిప్పేసి.. ర్యాపిడో డ్రైవర్ నానా హంగామా!

బాసర ట్రిపుల్ ఐటీపై ఎల్‌నినో‌ ఎఫెక్ట్.. దసరా సెలవుల పొడిగింపు, ఆన్ లైన్ క్లాసులు కంటిన్యూ

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ మెయిన్స్-2027 రిజిస్ట్రేషన్ మొదలు, కీలక మార్పులివే

ముంచుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు, విశాఖలో తీరం ధాటే ఛాన్స్

ఆఫీస్‌లో నీచమైన పని.. బాత్రూంలో ఫోన్ పెట్టి వీడియోలు తీసిన అటెండర్!

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ.. ఆ పరీక్షను వాయిదా వేయండి?

Big Stories

Advertisement
×