E-Paper
Advertisement

గూగుల్ చేస్తే బిగ్ బాస్ నరేష్ అని రావాలి… కప్పు కొట్టే బయటకు వెళ్తా: పొట్టి నరేష్

గూగుల్ చేస్తే బిగ్ బాస్ నరేష్ అని రావాలి… కప్పు కొట్టే బయటకు వెళ్తా: పొట్టి నరేష్
Advertisement

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10 తెలుగు కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా హౌస్ లోకి వెళ్తున్నారు. అయితే 11వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి జబర్దస్త్ నరేష్ (Jabardasth Naresh)ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ కార్యక్రమం నుంచి ఇప్పటికి ఇద్దరు కమెడియన్లు హౌస్ లోకి కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక పొట్టి నరేష్ ఎంట్రీ ఇవ్వడంతోనే పంజా సినిమాలోని భూమికి జానెడు అనే పాట ద్వారా స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం నాగార్జునతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.

గూగుల్ సెర్చ్ చేస్తే…

తన తల్లి అక్కినేని కుటుంబంలోని హీరోలు అందరికీ పెద్ద అభిమాని అని తెలిపారు. అందుకే తనని మీరు తమ్ముడు అని పిలవాలి అంటూ నాగార్జునని కోరుతారు.నరేష్ కు 10 అడుగుల కాన్ఫిడెన్స్ ఉందని నాగ్ చెప్పగా.. హౌస్ లోకి వెళ్లిన తర్వాత 100 అడుగుల కాన్ఫిడెన్స్ చూపిస్తాను అంటూ సమాధానం చెప్పారు. ఇకపోతే ఈ వేదికి పై నుంచి నరేష్ తన మనసులో కోరికలను కూడా తెలియజేశారు. తనకు బిగ్ బాస్ లో గెలిచి కప్పుతో బయటకు వెళ్లాలన్నదే తన కోరిక అని తెలియజేశారు . అదే విధంగా తన పేరును గూగుల్ లో సెర్చ్ చేస్తే బిగ్ బాస్ నరేష్ (Bigg Boss Naresh)అని రావాలన్నది తన కోరిక అంటూ ఈ సందర్భంగా పొట్టి నరేష్ తెలియ చేశారు.

నరేష్ ను బాక్సుల పెట్టి పంపిన బిగ్ బాస్…

Advertisement

ఇక తాను హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తప్పకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తానని తెలియజేశారు. ఇక నరేష్ ను బిగ్ బాస్ స్పెషల్ గా హౌస్ లోకి పంపించారు.నరేష్ ను బాక్స్‌లో పెట్టి హౌస్‌లోకి పంపించారు. అప్పటికే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లతో నాగార్జున ఒక లెటర్ పంపుతారు ..హౌస్ లోకి వచ్చిన బాక్స్ పై ఓ పజిల్ పెట్టి దాన్ని పూర్తి చేస్తే ఓ కీ దొరికిద్దని. ఆ కీ తో బాక్స్ ఓపెన్ చేస్తే సర్ ప్రైజ్ ఉంటుందని లెటర్ ద్వారా తెలియచేశారు. ఇక హౌస్ మేట్స్ కీ తో ఆ బాక్స్ ఓపెన్ చేయడంతో బాక్స్ నుంచి నరేష్ బయటకు రావడంతో అందరూ సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు.

నరేష్ సర్ప్రైజ్ ఎంట్రీ..

Advertisement

ఇలా ఊహించని విధంగా నరేష్ బిగ్ బాస్ ఎంట్రీ అందరిని ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాలి. ఇక జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అవకాశాన్ని అందుకున్నారు. మరి బిగ్ బాస్ హౌస్ అనుకున్న విధానంగానే కప్పు గెలిచి బయటకు వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇలా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇవ్వడంతో హౌస్ లో సందడి వాతావరణం నెలకొంది. ఇక రేపటి నుంచి అసలు సిసలైన ఆట మొదలవుతుందని చెప్పాలి.

Also Read: డిగ్రీలో 5 సబ్జెక్టులు ఫెయిల్.. సింగపూర్ లో హౌస్ కీపింగ్ జాబ్.. . సుధీర్ రెడ్డి స్టోరీ ఇదే!

Related News

డిగ్రీలో 5 సబ్జెక్టులు ఫెయిల్.. సింగపూర్ లో హౌస్ కీపింగ్ జాబ్.. . సుధీర్ రెడ్డి స్టోరీ ఇదే!

టికెట్ గెలుచుకొని వచ్చా.. కప్పు తీసుకొని పోతా.. మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ!

ఇక ఆట షూర్.. బిగ్ బాస్ 10 హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్!

అదిరిపోయిన బిగ్ బాస్ 10 హౌస్.. మ్యాజిక్ కీతో ఆటను మలుపు తిప్పిన నాగార్జున!

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

Big Stories

Advertisement
×