E-Paper
Advertisement

Bigg Boss 10: బిగ్ బాస్ 10లోకి ఇద్దరు టాప్ సెలబ్రిటీస్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

Bigg Boss 10: బిగ్ బాస్ 10లోకి ఇద్దరు టాప్ సెలబ్రిటీస్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
Advertisement

Bigg Boss 10:వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో తొమ్మిది సీజన్లను ఘనంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు 10వ సీజన్ కి సర్వం సిద్ధమవుతోంది. ఈసారి గ్రాండ్ గా అంతకుమించి మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకోవడానికి నిర్వహకులు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సెలబ్రిటీల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అంతా బాగానే ఉన్నా ఈ టాప్ సెలబ్రిటీలు డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోకమానరు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ 10లోకి ఇద్దరు టాప్ సెలబ్రిటీస్..

బిగ్ బాస్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సీజన్ 10 అక్టోబర్ నెల నుండి ప్రారంభం కానుంది అని సమాచారం. మునుపటి షోలాగే ఈసారి కూడా కామన్ మ్యాన్ కేటగిరిని హౌస్ లోకి తీసుకోవడానికి అగ్నిపరీక్ష అనే కార్యక్రమాన్ని నిర్వహించి.. అందులో నెగ్గిన ఐదు మందిని హౌస్ లోకి తీసుకోబోతున్నారట. ఇకపోతే కంటెస్టెంట్స్ విషయంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్ తో కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ, నటి కావ్య శ్రీ ఈ సీజన్లో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నారని సమాచారం.

కోటి 60 లక్షలు రెమ్యూనరేషన్..

Advertisement

ఇకపోతే వీరిని హౌస్ లోకి తీసుకురావడం అనే విషయం పక్కన పెడితే.. వీరు డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా అమర్దీప్ భార్య తేజస్విని తనకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని వారానికి ఆరు లక్షల రూపాయల వరకు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమిళ సీరియల్స్ చేస్తున్న ఈమె ఆ సీరియల్స్ ను వదులుకొని ఈ షో కోసం రావాల్సి ఉండడంతో మేకర్స్ కూడా ఈ భారీ మొత్తాన్ని ఆమెకు ఇవ్వడానికి అంగీకరించారట. ఇక మరొకవైపు బుల్లితెర నటి కావ్యశ్రీ కూడా దాదాపుగా ఐదు లక్షల రూపాయలు వారానికి చొప్పున పారితోషకం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమయి.. వీరిద్దరూ హౌస్ లో చివరి వరకు కొనసాగితే మాత్రం కేవలం వీరి రెమ్యూనరేషన్ బడ్జెట్ మాత్రమే కోటి 60 లక్షల రూపాయల మార్కును దాటే అవకాశం ఉంది. ఒకవేళ ఇద్దరిలో ఏ ఒక్కరు గెలిచినా సరే అదనంగా మరో 50 లక్షలు అలాగే విలువైన బహుమతులు ఎన్నో సొంతం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఈ ఇద్దరికీ ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు కూడా ఈ రేంజ్ లో డబ్బులు ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ALSO READ:కన్నీళ్లు పెట్టుకున్న అమీర్ ఖాన్.. పుత్రోత్సాహమా? లేక?

ఎక్కడా రాజీ పడని మేకర్స్..

Advertisement

ఇకపోతే సెలబ్రిటీల విషయంలో ఎందులోనూ రాజీ పడకుండా అత్యంత ప్రజాదారణ ఉన్న కంటెస్టెంట్లను ఈసారి హౌస్ లోకి తీసుకురావాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకుంటూనే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండేలా కంటెస్టెంట్లను సెలెక్ట్ చేస్తున్నారు.. ఏది ఏమైనా కేవలం ఇద్దరికే ఇంత భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నారంటే మిగిలిన కంటెస్టెంట్లతో కలిపి మొత్తం సీజన్ బడ్జెట్ ఎంతలో ఉంటుందో ఊహకి అందడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు .ఇక త్వరలోనే దీనిపై అన్ని వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి.

Related News

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

Big Stories

Advertisement
×