E-Paper
Advertisement

భారత్ లో అతిపెద్ద రైల్వే జంక్షన్.. మొత్తం దేశాన్ని కలిపేస్తుంది!

భారత్ లో అతిపెద్ద రైల్వే జంక్షన్.. మొత్తం దేశాన్ని కలిపేస్తుంది!
Advertisement

Mathura Railway Junction: భారత్ లో రైల్వే వ్యవస్థ ఎంత విస్తృతంగా ఉందో అందరికీ తెలుసు. ఈ భారీ నెట్‌ వర్క్‌ లో కొన్ని స్టేషన్లు తమంకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. అలాంటి కీలక స్టేషన్లలో ఒకటి మధుర జంక్షన్. ఇది దేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఏంటీ మధుర రైల్వే జంక్షన్ ప్రత్యేకత?

మధుర జంక్షన్ నుంచి ఒకటి కాదు, రెండు కాదు. మొత్తం ఏడు ప్రధాన రైల్వే మార్గాలు ఇక్కడి నుంచి ప్రారంభం అవుతాయి. అందుకే, దీనిని చాలా కీలక జంక్షన్‌ గా పరిగణిస్తారు. రైల్వే నెట్‌వర్క్‌ లో జంక్షన్ అంటే ఒకే చోట నుంచి అనేక దిశలకు రైళ్లు వెళ్లే పాయింట్. మధుర జంక్షన్ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.

మొత్తం 10 ప్లాట్‌ ఫారమ్‌లు

Advertisement

ఈ స్టేషన్‌ లో సుమారు 10 ప్లాట్‌ ఫారమ్‌లు ఉన్నాయి. ఇవి ఇక్కడి నుంచి రోజూ నడిచే పదుల సంఖ్యలో రైళ్లను సమర్థంగా నిర్వహిస్తాయి. ప్రతి రోజు వేలాది మంది ప్రయాణికులు ఇక్కడి నుండి రాకపోకలు సాగిస్తుంటారు. ప్యాసింజర్ ట్రైన్స్, ఎక్స్‌ ప్రెస్‌ లు, సూపర్ ఫాస్ట్ రైళ్లు ఈ స్టేషన్ నుంచి వెళ్తుంటాయి.

దేశంలోని అన్ని నగరాలకు రైల్వే సౌకర్యం

మధుర జంక్షన్‌ కు మరో ముఖ్యమైన విశేషం కనెక్టివిటీ. దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ ఇక్కడి నుండి రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు ఈ స్టేషన్ సెంటర్ పాయింట్ గా పని చేస్తుంది. ఈ స్టేషన్ దేశ వ్యాప్తంగా ప్రయాణించే ప్యాసింజర్స్ కు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది కేవలం ప్రయాణికుల రాకపోకలకు మాత్రమే కాదు, సరుకు రవాణాకూ కూడా ముఖ్య కేంద్రంగా ఉంది. వాణిజ్య కార్యకలాపాలు, లోడింగ్, అన్‌లోడింగ్ లాంటి పనులు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. దీని వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు బలోపేతం అవుతుంది.

చారిత్రాత్మక ప్రాధాన్యత

Advertisement

మధుర జంక్షన్ చారిత్రక ప్రాధాన్యత కూడా కలిగి ఉంది. చాలా కాలంగా ఇది రైల్వే నెట్‌ వర్క్‌ లో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. కాలానికి అనుగుణంగా ఇక్కడ సదుపాయాలు కూడా మెరుగుపరచబడ్డాయి. ప్రయాణికుల కోసం వేచి ఉండే ప్రాంతాల నుంచి డిజిటల్ డిస్ప్లే బోర్డుల వరకు బోలెడు ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మధుర జంక్షన్   సాధారణ రైల్వే స్టేషన్ కాదు. దేశ రవాణా వ్యవస్థలో కీలక కేంద్రంగా నిలిచింది. అనేక మార్గాలు ఇక్కడి నుంచి వెళ్లడంతో పాటు, వేలాది మంది ప్రయాణికులకు రోజూ సేవలు అందిస్తోంది. భారతీయ రైల్వే విస్తృతిని చూపించే బెస్ట్ ఎగ్జాంఫుల్ గా ఈ రైల్వే జంక్షన్ ను చెప్పుకోవచ్చు.

Read Also: అమ్మో ఇండియన్ రైల్వే.. అన్ని లక్షల మంది పని చేస్తున్నారా?

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×