West Bengal: పశ్చిమ బెంగాల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రైల్వే శాఖ బాధ్యతారాహిత్యం, సిబ్బంది నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ ఉదంతమే ఒక నిదర్శనం. జల్పాయ్‌గురి- రామ్ నగర్ రూట్‌లో ప్రయాణిస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు ఒక బాలుడు కింద పడిపోయాడు.
సాధారణంగా రైలులో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు వెంటనే అలర్ట్ అవుతారు. ఇక్కడ కూడా అదే జరిగింది. తన తమ్ముడు కింద పడిపోవడంతో ఆ సోదరి హాహాకారాలు చేసింది. తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ ఛైన్‌ను లాగారు. కానీ, లోకో పైలట్ మాత్రం రైలును ఆపకుండా ఏకంగా 1 కి.మీ మేర ముందుకు తీసుకెళ్లడం అత్యంత దిగ్భ్రాంతి కరం. ఛైన్ లాగినా స్పందించకపోవడం రైల్వే భద్రతా నిబంధనలను తుంగలో తొక్కడమే.
ఇక వ్యవస్థలో ఉన్న లోపాలు అక్కడితో ఆగలేదు. తన తమ్ముడిని కాపాడుకోవాలనే ఆవేదనతో ఆ సోదరి సహాయం కోసం రైలులోని TTE ని వేడుకున్నా, హెల్ప్‌లైన నంబర్లకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. సరైన స్పందన లభించకపోవడంతో ఆమె పడ్డ రోదన చూస్తున్న వారిని కలిచివేస్తోంది. ప్రయాణికుల ప్రాణాల కంటే సమయపాలన ముఖ్యం అన్నట్టుగా వ్యవహరించిన సిబ్బంది తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తుంటే.. అత్యవసర సమయాల్లో రైల్వే వ్యవస్థ ఎంత నిస్సహాయంగా ఉందో అర్థమవుతోంది.
Also Read: కన్నీళ్లు పెట్టుకున్న అమీర్ ఖాన్.. పుత్రోత్సాహమా? లేక?
బెంగాల్ లో షాకింగ్ ఘటన
రన్నింగ్ ట్రైన్ నుంచి కిందపడిపోయిన బాలుడు
ఎమర్జెన్సీ చైన్ లాగినా ఆపకుండా 15 కి.మీ వెళ్లిన లోకో పైలట్
తమ్ముడి కోసం సోదరి రోదన
సాయం కోసం అడిగితే TTE మరియు హెల్ప్‌లైన్ నుంచి సరైన స్పందన లేదు
వైరల్ అవుతున్న ఈ వీడియో
రైల్వే వ్యవస్థ నిర్లక్ష్యంపై నెటిజన్ల… pic.twitter.com/9G5z849zil
— BIG TV Breaking News (@bigtvtelugu) April 27, 2026