E-Paper
Advertisement

Tanveer Ahmed: బ్యాట్ లో చిప్స్ పెట్టి సంజు దొంగాట ఆడాడు..ఫ‌ర్హాన్ ను న‌ట్టేట ముంచేశారు

Tanveer Ahmed:  బ్యాట్ లో చిప్స్ పెట్టి సంజు దొంగాట ఆడాడు..ఫ‌ర్హాన్ ను న‌ట్టేట ముంచేశారు
Advertisement

Tanveer Ahmed:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం ఇండియా పై విషం కక్కుతున్నారు. ఇండియా గెలవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చెప్తున్నారు. అయితే సంజు శాంసన్ కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు వచ్చిన నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్యాట్ లో చిప్ లు ఆడిన సంజుకు ( Sanu Samson) ఇలా మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇస్తారని నిలదీశారు త‌న్వీర్ అహ్మద్. దీనికి అసలు సిసలు అర్హుడు ఫర్హాన్ ( Sahibzada Farhan ) అంటూ వ్యాఖ్యానించాడు.

Also Read: IND VS NZ Final: అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్న సూర్య కుమార్, రోహిత్ శర్మను మించి సెల‌బ్రేష‌న్స్‌

సంజుకు అవార్డు ఇవ్వ‌డంపై త‌న్వీర్ అహ్మ‌ద్ సీరియ‌స్‌

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విజేతగా టీమిండియా నిలిచింది. అయితే ఈ టోర్నమెంటులో కేవలం ఐదు మ్యాచ్ లలోనే ఆడిన సంజు శాంసన్, 321 పరుగులు సాధించాడు. ఈ సందర్భంగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సంజు శాంసన్ కు ఇచ్చింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిలింగ్. అయితే దీనిపై పాకిస్తాన్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తమ ఓపెనర్ ఫర్హాన్ 383 పరుగులు చేస్తే ఆ అవార్డు ఎందుకు దక్కలేదని నిలదీస్తున్నారు. ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) స్పందించాడు. బ్యాట్ లో చిప్ లు ఆడి సంజు శాంసన్ ఐసీసీని మోసం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. లేకపోతే చివరి క్షణంలో ఫామ్ లోకి వచ్చి సంజు శాంసన్ ఎలా ఆడతాడని నిలదీశారు. అయినా సంజు శాంసన్ కంటే ఎక్కువగా పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ పరుగులు చేశాడని గుర్తు చేశారు. న్యాయం ప్రకారం ఫర్హాన్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రావాలని స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు తన్వీర్ అహ్మద్.

మూడేళ్లలో మూడు టైటిల్స్ ఎలా వస్తాయి?

మూడు సంవత్సరాలలో ఐసీసీ ( ICC) టోర్నమెంట్ లను మూడింటిని గెలుచుకుంది టీమిండియా ( Team India). అయితే దీనిపై కూడా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు మూడేళ్లలో మూడు టైటిల్స్ ను ఏ జట్టు కూడా గెలుచుకోలేదని ఫైరయ్యారు. ఇదంతా ఐసీసీ బాస్ జై షా (ICC Boss JAy Shah) కుట్రలే అంటూ ఆరోపణలు చేశారు. అతను లేకపోతే టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవదని షాకింగ్ కామెంట్స్ చేశారు తన్వీర్ అహ్మద్.

Advertisement

Also Read: IND VS NZ Final: ముచ్చ‌ట‌గా మూడోసారి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విశ్వ విజేత‌గా టీమిండియా, ఫ్రైజ్ మ‌నీ ఎన్ని కోట్లంటే

 

?utm_source=ig_web_copy_link

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×