Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనపరంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఎన్నో సహాయ సేవా కార్యక్రమాలను చేస్తూ తన మంచి మనసును కూడా చాటుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేసిన అల్లు అర్జున్ తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఇటీవల కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరగడంతో సుమారు 28 మంది వరకు ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ ప్రమాద ఘటనపై ఎంతోమంది తీవ్ర ఆవేదన చెందారు అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ ప్రమాద ఘటనలో మరణించిన ఒక బాధితుడి కుమార్తెకు జీవితాంతం ఆర్థిక భరోసా కల్పిస్తూ అండగా నిలిచారు. ఈ ప్రమాదంలో భాగంగా తండ్రిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలు కడింపల్లి దుర్గకు(Kadimpalli Durga ) హీరో అల్లు అర్జున్ అండగా నిలిచారు. మానసికంగా దివ్యాంగురాలు అయినటువంటి దుర్గ తండ్రి మరణించడంతో ఈమె ఆనాధగా మిగిలిపోయారు. మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేని నేపథ్యంలో ఈమె దీనస్థితి గురించి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.
దుర్గ పరిస్థితి కాస్త అల్లు అర్జున్ దృష్టికి చేరడంతో అల్లు అర్జున్(Allu Arjun) దుర్గ పోషణ కోసం తన మంచి మనసును చాటుకున్నారు. జీవితాంతం దుర్గకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండటం కోసం ప్రతినెల 7,500 ఆమె బ్యాంకు ఖాతాలో వేయబోతున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. ఇక అల్లు అర్జున్ చేసిన ఈ సహాయం గురించి మరో నిర్మాత బన్నీ వాసు పర్యవేక్షణలో అల్లు అర్జున్ అభిమానుల సంఘం ప్రతినిధులు నేరుగా దుర్గా ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ అందించిన సహాయం గురించి ఆమెకు వివరించి తనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని భరోసా కల్పించారు.
మొన్న పావలా శ్యామల , నేడు దుర్గ..
దుర్గ బాధ్యతను జీవితాంతం అల్లు అర్జున్ తీసుకున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ బన్నీ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇటీవల అల్లు అర్జున్ నటి పావలా శ్యామలకు కూడా ఈ విధమైనటువంటి ఆర్థిక భరోసా కల్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పావల శ్యామలకు ప్రతినెల పదివేల రూపాయలు చొప్పున అల్లు అర్జున్ అందించబోతున్న విషయం తెలిసిందే. ఇలా పావలా శ్యామలతో పాటు కాకినాడ బాణసంచా మృతుడి కుమార్తెకు ప్రతినెల ఆర్థిక సహాయం చేయబోతున్నట్లు తెలియడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.
Also Read: Alekhya Tarakaratna: తారకరత్న మరణం.. ఇంటికి పిలిచి మరి అవమానించారు.. అలేఖ్య ఎమోషనల్!