Kissik Talks:కర్నూలు ప్రాంతానికి చెందిన పక్కా రాయలసీమ అమ్మాయి ప్రియా శెట్టి . అగ్నిపరీక్ష షో ద్వారా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి.. తనను తాను నిరూపించుకునే లోపే అనూహ్యంగా మూడవ వారమే బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక బిగ్ బాస్ ద్వారా వచ్చిన గుర్తింపుతో సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయిన ఈ చిన్నది.. పలు రకాల గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు చేరువలో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి ఆడియన్స్ ను అలరించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.. ప్రముఖ న్యూస్ ఛానల్ బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహించిన కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది. ఇక తాజా ఎపిసోడ్ ను నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో ఎన్నో విషయాలను పంచుకుంది ప్రియా శెట్టి.
జబర్దస్త్ కమెడియన్ వర్ష హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియా శెట్టి ఎన్నో వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది. అందులో భాగంగానే మీ జీవితంలో ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా వెన్నుపోటు పొడిచారా? అని యాంకర్ వర్ష ప్రశ్నించగా.. ప్రియా శెట్టి మాట్లాడుతూ.. “చాలామంది నన్ను వెన్నుపోటు పొడిచారు. ముఖ్యంగా నేను నమ్మిన ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారు. పూర్తిగా నమ్మి నాతోనే చాలా క్లోజ్ గా ఉండి, లాస్ట్ మినిట్లో నాకు హ్యాండ్ ఇచ్చి నా గురించి వేరే వాళ్ళతో చెడుగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బ్యాక్ పిచ్చింగ్ చేసే వాళ్ల గురించి చెప్పాలి అంటే నా వల్ల అవ్వలేదు. నాతో ముందు చాలా సంతోషంగా, కూల్ గా మాట్లాడతారు. అలా నాకు నచ్చదు. ముందు ఒకలాగా వెనుక ఒకలాగా మాట్లాడతారు. అలా ఉండే వాళ్లతో చాలా కష్టం. అలా ఉంటే వాళ్లకి ఏం వస్తుంది. నాకు ఇప్పటికీ అర్థం కాదు. ముఖ్యంగా నా స్నేహితులు చేసిన మోసం నుండి నేను ఇప్పటికీ బయటపడలేకపోతున్నాను” అంటూ ఎమోషనల్ అయింది ప్రియా శెట్టి.
also read:Kissik Talks: బిగ్ బాస్ ఎలిమినేషన్ పై ప్రియా శెట్టి ఎమోషనల్!
వాళ్లు మారాలంటే మీరు ఒక్క మాటలో ఏం చెప్తారు అని వర్ష ప్రశ్నించగా.. ప్రియా శెట్టి మాట్లాడుతూ.. “అందరితో మంచిగా ఉండాలి అని నేను చెప్తాను. మనల్ని మోసం చేసే వాళ్ళ దగ్గర కూడా మనం మంచిగా ఉంటే.. వాళ్లే ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు. మనం ఇంత చేసినా సరే ఆ అమ్మాయి ఇంకా మనతో మంచిగానే ఉంది కదా అని వాళ్లలో మార్పు వస్తుంది. కచ్చితంగా సెల్ఫ్ రియలైజేషన్ జరుగుతుంది అంటూ తెలిపింది ప్రియా శెట్టి. మొత్తానికి అయితే తనను వెన్నుపోటు పొడిచిన వారిపై అలా చేసిన వారితో తాను ఎలా ఉంటుంది అన్న విషయాలపై మాట్లాడి అందరిని మరింత మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.