E-Paper
Advertisement

Kissik Talks: బిగ్ బాస్ ఎలిమినేషన్ పై ప్రియా శెట్టి ఎమోషనల్!

Kissik Talks: బిగ్ బాస్ ఎలిమినేషన్ పై ప్రియా శెట్టి ఎమోషనల్!
Advertisement

Kissik Talks:ఇటీవల కాలంలో సెలబ్రిటీ టాక్ షోలు వరుసగా పుట్టుకొస్తూ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ముఖ్యంగా ఆడియన్స్ కోరిక మేరకు ఈ టాక్ షోలు కూడా సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఎప్పటిలాగే ప్రేక్షకులను అలరిస్తూ మంచి టాక్ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి ఈసారి గెస్ట్ గా వచ్చేసింది ప్రియా శెట్టి. అగ్నిపరీక్ష టాస్క్ లతో తనను తాను నిరూపించుకొని.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి అందం, అభినయంతో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారు హృదయాలు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. హౌస్ లోకి వచ్చిన 3వ వారమే ఎలిమినేట్ అయ్యి.. బయటకు వచ్చేసింది. దీంతో ఈమెది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని బిగ్ బాస్ లవర్స్ కూడా కామెంట్లు చేశారు. అయితే ఇలా హౌస్ లోకి వచ్చిన మూడు వారాలకే ఎలిమినేట్ అవ్వడంపై తాజాగా ఈ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో ప్రియా శెట్టి మాట్లాడింది.

అమెరికా ప్రయాణం ఆపుకొని బిగ్ బాస్ లోకి అడుగు..

“నేను అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలనుకున్నాను. కాకపోతే అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేవని.. ఇక్కడ బ్రతకడం కష్టమని నా స్నేహితులు చెప్పడంతో వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతున్న సమయంలో అమెరికా ప్రయాణాన్ని ఆపుకున్నాను. ఇక ఇండియాలోనే ఉండి తల్లిదండ్రులతో కలిసి చదువుకోవాలని ఎంబీఏ మెడిసిన్ ఎంట్రన్స్ కూడా రాశాను. అయితే అడ్మిషన్ తీసుకునే లోపే బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుండి కాల్ రావడం.. నా జీవితాన్ని కొత్త దిశగా మలిచింది. ఇక తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాను. అయితే హౌస్ లో నేను అగ్రెసివ్ గా ప్రవర్తించానని విమర్శలు వచ్చాయి. నిజానికి నేను చాలా క్యూట్.. అయితే షోలో నేను గట్టిగా మాట్లాడిన వైఖరిని మాత్రమే హైలెట్ చేశారు.

కావాలనే నన్ను ట్రిగర్ చేశారు -ప్రియా శెట్టి

Advertisement

నేనెప్పుడూ స్ట్రెయిట్ గా మాట్లాడుతాను. ఇన్ డైరెక్ట్ గా మాట్లాడడం నాకు రాదు. ఇక ఒక్కొక్కరి వాయిస్ ఒక్కోలా ఉంటుంది.నా వాయిస్ మాత్రం సహజంగానే గట్టిగా ఉంటుంది. అది బై బర్త్ వచ్చింది. ఇక నేను మాట్లాడినా సరే అరిచినట్టు ఉండేది. ఇక రెండవ వారానికి ఆ విషయం అందరికీ అర్థమైంది. సంజనా లాంటి వాళ్లు కూడా నీకు బై బర్త్ వచ్చిన డిఫెక్ట్ అది నువ్వేం చేస్తావని చెప్పేవాళ్ళు. అయితే ఎవరిని బ్లేమ్ చేయాలని నాకు లేదు.కానీ నా వాయిస్ నాకు కొన్నిసార్లు మైనస్ గా మారింది.. ఇక హౌస్ లో ఆటను అర్థం చేసుకొని ఆడదాం అనుకునే లోపే మూడో వారమే బయటికి వచ్చేసాను.

also read:Kissik Talks: అతడంటే పిచ్చి..కానీ అలా చేస్తారనుకోలేదు – ప్రియా శెట్టి!

కచ్చితంగా మరిన్ని అవకాశాలు అందుకుంటాను – ప్రియా శెట్టి

Advertisement

ముఖ్యంగా చాలామంది నన్ను వ్యక్తిగతంగా ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. అందుకే హౌస్ లో నుంచి త్వరగా వచ్చేసాను అంటూ కాస్త ఎమోషనల్ అయ్యింది. ఇకపోతే గేమ్ పూర్తిగా అర్థం అయ్యేలోపే ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని తెలిపిన ప్రియా తనని తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఆ అవకాశం దక్కలేదని చెప్పుకొచ్చింది. అయినా సరే ఆ అనుభవం తన జీవితానికి మంచి మార్గదర్శకంగా నిలిచిందని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటానని ఆశాభావం కూడా వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Kissik Talks: ప్రతి అమ్మాయికి ఆ సపోర్టు ఉండాలి – ప్రియా శెట్టి

Kissik Talks: వెన్నుపోటు పొడిచారు.. ఆ నరకాన్ని తట్టుకోలేకపోయా – ప్రియా శెట్టి

Kissik Talks: అతడంటే పిచ్చి..కానీ అలా చేస్తారనుకోలేదు – ప్రియా శెట్టి!

Illu Illaalu Pillalu Prema : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ప్రేమ రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Podarillu Today Episode : మహా మాటే నిజమైందా..? హమ్మయ్య కన్నా దొరికేశాడు.. సెంటిమెంట్ తో ఏడపించేశారు..

Intinti Ramayanam Today Episode: రాజేశ్వరి ప్లానేంటి..? శ్రీయకు నొప్పులు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Gundeninda GudiGantalu Today episode: కామాక్షి ఎంట్రీ అదుర్స్.. అర్ముఖంను ఆడుకున్న బాలు.. రోమతి తో మైండ్ బ్లాక్..

Big Stories

Advertisement
×