E-Paper
Advertisement

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కంటెంట్ ఇకపై కనిపించదు.. మెటాకు కేంద్రం గట్టి ఆదేశాలు జారీ!

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కంటెంట్ ఇకపై కనిపించదు.. మెటాకు కేంద్రం గట్టి ఆదేశాలు జారీ!
Advertisement

Fake News Control: సోషల్ మీడియాలో మనం చూసే వీడియోలు, ఫొటోలు ఒక్కోసారి మనల్ని బాగా ప్రభావితం చేస్తుంటాయి. ముఖ్యంగా దేశంలో ఏదైనా గొడవలు జరిగినప్పుడు లేదా నిరసనలు ఉధృతంగా ఉన్నప్పుడు, కొన్ని రకాల పోస్టులు మాత్రమే మన ఫీడ్‌లోకి పదే పదే వస్తుంటాయి. ఇలాంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ అయింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను నడిపే మెటా సంస్థకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) తాజాగా ఒక కీలకమైన అడ్వైజరీని జారీ చేసింది.

ఎన్నికల సంఘం తీరుపై నిరసనల వేళ ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఒకవైపు ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా కోరుతూ నిరసనలు జరుగుతుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో కొన్ని నిర్దిష్టమైన కథనాలు మాత్రమే ప్రజలకు ఎక్కువగా కనిపించేలా అల్గారిథమ్స్ పనిచేస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఏ ఒక్క వర్గం వాదననో లేదా ఒకే రకమైన అభిప్రాయాన్ని పదే పదే హైలైట్ చేయడం వల్ల ప్రజల్లో అనవసరమైన గందరగోళం, ఆందోళన పెరుగుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement

Also Read: యాప్స్, ఫొటోస్ డిలీట్ చేసినా స్టోరేజ్ ఫుల్ అని వస్తోందా? అయితే ఈ సీక్రెట్ ట్రిక్ ట్రై చేయండి!

పాత వీడియోలకు చెక్:

సోషల్ మీడియాలో ఎక్కడో గతంలో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలను, ఇప్పుడు జరుగుతున్నట్లుగా మార్చి పోస్టు చేస్తుంటారు. దీనివల్ల ప్రజల్లో భయాందోళనలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి ఫేక్ వీడియోలు, తప్పుదోవ పట్టించే గ్రాఫిక్స్, ఎడిట్ చేసిన ఫొటోలకు సరైన సందర్భం లేదా సమాచారం లేకపోతే వాటిని వెంటనే అడ్డుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఏది నిజం, ఏది అబద్ధం అని యూజర్లకు అర్థమయ్యేలా ప్లాట్‌ఫారమ్‌లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

అల్గారిథమ్‌లపై కేంద్రం నజర్:

Advertisement

మెటా ఉపయోగిస్తున్న రికమండేషన్ సిస్టమ్స్ ఒకే రకమైన కోణాన్ని ప్రమోట్ చేయకుండా.. అన్ని రకాల సమాచారాన్ని సమతుల్యంగా చూపించాలని ప్రభుత్వం కోరింది. ఎందుకంటే అల్గారిథమ్‌లు కేవలం కొన్ని రకాల కంటెంట్‌కే ఎక్కువ రీచ్ ఇస్తున్నాయని ప్రభుత్వ సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా లేదా హిచ్‌ను రెచ్చగొట్టేలా ఉండే సమాచారాన్ని సోషల్ మీడియా సంస్థలు అత్యంత వేగంగా గుర్తించి తొలగించాలని, చట్టప్రకారం ప్రభుత్వ ఏజెన్సీలకు సహకరించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.

సెన్సార్‌షిప్‌పై భిన్నాభిప్రాయాలు:

ప్రభుత్వం జారీ చేసిన ఈ అడ్వైజరీపై డిజిటల్ హక్కుల సంఘాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఇది చట్టపరంగా ఎలాంటి బైండింగ్ లేకపోయినా, ప్రభుత్వాలు చేసే ఇలాంటి హెచ్చరికలు పరోక్షంగా సెన్సార్‌షిప్‌లా మారుతున్నాయని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ అభిప్రాయపడింది. ఏది ఏమైనా, టెక్ కంపెనీలు తమ ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చే కంటెంట్ విషయంలో మరింత బాధ్యతగా ఉండాలని, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read: విదేశాలకు వెళ్తున్నారా? రోమింగ్ బిల్లుల బెంగ వదిలేసి, ఇలా eSIM వాడేయండి!

Tags

Related News

ఫోన్ పోయిందా? వాట్సాప్ చాట్‌ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఈ పని చేయండి!

సముద్రం అడుగున వింత రాళ్లు.. గాలి తగలగానే భగ్గుమంటూ మంటలు, కారణం ఏమిటీ?

వాట్సాప్ లేటెస్ట్ అప్ డేట్..చాటింగ్ స్టైల్ మారబోతోంది బాస్

యాప్స్, ఫొటోస్ డిలీట్ చేసినా స్టోరేజ్ ఫుల్ అని వస్తోందా? అయితే ఈ సీక్రెట్ ట్రిక్ ట్రై చేయండి!

ల్యాప్‌టాప్‌‌పై నీళ్లు పడ్డాయా? ఆన్ చేసే.. ముందు ఈ ఒక్క తప్పు చేయెద్దు!

విదేశాలకు వెళ్తున్నారా? రోమింగ్ బిల్లుల బెంగ వదిలేసి, ఇలా eSIM వాడేయండి!

రూ. 40వేలలోపే లగ్జరీ లుక్..ఆఫర్‌లో బెస్ట్ ఫ్రిజ్‌లు

Big Stories

Advertisement
×