E-Paper
Advertisement

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు
Advertisement

AP DSC-2025: కూటమి ప్రభుత్వం గతేడాది నిర్వహించిన డీఎస్సీ-2025‌లో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఫోకస్ చేసిన బిగ్‌ టీవీ, బాధితుల పక్షాన నిలబడింది. దీంతో అన్యాయం జరిగిందన్న బాధితులు మీడియా ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ టీవీకి సంబంధించి సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవడం వల్ల తమకు నిజంగా అన్యాయం జరిగిందని అభ్యర్థులు వాపోతున్నారు.

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ అక్రమాలు

ఏపీలో డీఎస్సీ-2025 వ్యవహారం కూటమి ప్రభుత్వంలో అగ్ని రాజేస్తోంది. ఆ అంశంలో బిగ్ టీవీ ఛానెల్ తీగలాగితే డొంక అంతా కదిలింది. తొలుత కర్నూలు జిల్లాకు పరిమితమైన ఈ వ్యవహారం మెల్లగా అన్ని జిల్లాలను పాకుతోంది. బిగ్ టీవీ చేస్తున్న కథనాలకు నష్టపోయిన అభ్యర్థులు మీడియా ముందుకొచ్చి తన గోడు వినిపిస్తున్నారు.

ప్రభుత్వంలో వణుకు మొదలు

Advertisement

అవును మాకు ముమ్మాటికీ అన్యాయం జరిగిందని కన్నీరు మున్నీరు అవుతూ తమ గోడు బయటపెడుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో తాము నష్టపోయామని, తమ సర్టిఫికెట్లు ప్రభుత్వం గుర్తించలేదని వాపోతున్నారు. కర్నూలు, విజయనగరం ఇలా ఏది చూసినా ప్రతీ జిల్లాల నుంచి అభ్యర్థులు ధైర్యంగా బిగ్ టీవీని ఆశ్రయించి లోపాలను బట్ట బయలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వంలో క్రమంగా వణుకు మొదలైంది.

 బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

ఈ విషయాలు బయటపెడుతున్నామని భావించిన ఏపీ సర్కార్, తమ ఛానెల్‌ సోషల్ మీడియా ఖాతాలపై ఉక్కుపాదం మోపింది. తొలుత ఇన్‌స్టా ఖాతాలను నిలిపివేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఫేస్‌బుక్‌పై కొరడా ఝులిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే బిగ్ టీవీ సోషల్‌మీడియా ఖాతాలపై ఆంక్షలు విధించింది.

Advertisement

ALSO READ: పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త 

డీఎస్సీపై తమ ఛానల్‌లో ప్రచారం అవుతున్న కథనాలు సోషల్ మీడియాలో కనిపించకపోవడంతో పలువురు యూజర్లు బిగ్ టీవీకి ఫోన్ చేసి ఏమైందంటూ కనుక్కోవడం మొదలుపెట్టారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా వెనక్కి తగ్గలేదు. వాటిపై ఇంకా కొత్త కొత్త కథనాలు ప్రసారం చేస్తోంది. డీఎస్సీ అభ్యర్థుల ఆవేదనను ప్రజల ముందుకు తీసుకొస్తుంది. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని బాధితులకు భరోసా ఇస్తుంది బిగ్ టీవీ. అంతేకాదు ఆర్గనైజ్‌గా రిపోర్టలను కొట్టిస్తోంది ప్రభుత్వం. సోషల్ మీడియా కంపెనీలకు మెయిల్స్ సైతం పెట్టింది ప్రభుత్వం. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

 

 

Related News

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×