E-Paper
Advertisement

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్
Advertisement

Crime Thriller Series: ఒక సాధారణ మహిళా కానిస్టేబుల్‌ అండర్‌కవర్ ఆపరేషన్‌ లో భాగంగా నేర ప్రపంచంలోకి వెళ్తే ? అక్కడికి వెళ్లిన తర్వాత అదే మాఫియా ఆమెను తమలో ఒకరిగా అంగీకరిస్తే ? పైగా పోలీసులు ఒకవైపు ఆమెను నమ్ముతుంటే… మరోవైపు డ్రగ్ మాఫియా డాన్ కూడా ఆమెను నమ్మితే ? ఈ రెండు ప్రపంచాల మధ్య చిక్కుకున్న ఓ మహిళ ఎలాంటి నిర్ణయం తీసుకుంది ? తనను తాను కాపాడుకుంటూనే మాఫియాను ఎలా ఎదుర్కొంది ? ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణమే She Season 2. మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ముంబైలో సాధారణ మహిళా కానిస్టేబుల్‌ గా పని చేసే భూమిక పరదేశి జీవితంలో ఊహించని మలుపు వస్తుంది. నగరాన్ని వణికిస్తున్న డ్రగ్ మాఫియా కింగ్ నాయక్‌ ను పట్టుకునేందుకు పోలీసులు ఆమెను అండర్‌కవర్ ఆపరేషన్‌ లోకి పంపిస్తారు. అందుకోసం ఆమె తన గుర్తింపును దాచుకుని నాయక్ నెట్‌వర్క్‌ లోకి అడుగు పెడుతుంది. అయితే ఈ ఆపరేషన్‌ లో మరో మార్పు మొదలవుతుంది. మొదట్లో తనపై తనకే నమ్మకం లేని ఆమె… క్రమంగా తనలోని ధైర్యాన్ని గుర్తిస్తుంది. తన ఆకర్షణను కూడా ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటూ నాయక్ నమ్మకాన్ని సంపాదిస్తుంది. పోలీసులకు రహస్య సమాచారాన్ని అందిస్తూనే, మరోవైపు నాయక్ సామ్రాజ్యంలో తన స్థానాన్ని బలపరుచుకుంటుంది.

Advertisement

ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ముంబై యాంటీ నార్కోటిక్స్ విభాగానికి చెందిన ఫెర్నాండెజ్ భూమికను ఉపయోగించి నాయక్‌ ను పట్టుకోవాలని చూస్తుంటాడు. కానీ నాయక్ మాత్రం ఆమెను సాధారణ వ్యక్తిగా చూడడు. తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు భూమికను కీలక వ్యక్తిగా మార్చాలని నిర్ణయించుకుంటాడు. ఇలా భూమిక ఒకేసారి రెండు వైపులా ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. పోలీసులు ఆమెను తమ మనిషిగా భావిస్తుంటే.. నాయక్ ఆమెపై పూర్తిగా నమ్మకం పెట్టుకుంటాడు. ఈ డబుల్ గేమ్‌ లో ఒక్క చిన్న పొరపాటు జరిగినా ఆమె ప్రాణాలకే ప్రమాదం. చివరికి భూమిక ఎవరిని మోసం చేసింది ? చట్టం వైపు నిలిచిందా ? లేక నాయక్ నేర సామ్రాజ్యంలోనే తనకంటూ ఓ స్థానం సంపాదించుకుందా ? ఈ ట్విస్టులే సీజన్‌ క్లైమాక్స్‌ ను ఆసక్తికరంగా మారుస్తాయి.

తెలుగులో ఉందా లేదా ?

క్రైమ్ డ్రామా జానర్‌లో వచ్చిన హిందీ సిరీస్ She Season 2. ఇందులో అదితి పోహంకర్ భూమికగా, కిషోర్ కుమార్ జి నాయక్‌గా, విశ్వాస్ కిని ఫెర్నాండెజ్‌గా నటించారు. ఈ సిరీస్‌ ను ఇంతియాజ్ అలీ క్రియేట్ చేశారు. Netflixలో ఈ సిరీస్‌ కు హిందీతో పాటు ఇంగ్లిష్, తమిళం, మరాఠీ ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు ఆడియో లేదు. బోల్డ్ కంటెంట్‌ తో పాటు అండర్‌కవర్ ఆపరేషన్స్, మాఫియా, డబుల్ గేమ్‌లతో కూడిన ఈ క్రైమ్ డ్రా థ్రిల్లర్ ప్రియులకు తప్పకుండా నచ్చుతుంది.

Advertisement

Read Also: గంటకి 300 కిలోమీటర్ల వేగం… బుల్లెట్ ట్రెయిన్‌లో డెడ్లీ కిల్లర్స్ వేట… తెలుగులో స్ట్రీమింగ్

Tags

Related News

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×