E-Paper
Advertisement

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మొత్తం ఎంతమంది? ఎవరెవరంటే ?

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మొత్తం ఎంతమంది? ఎవరెవరంటే ?
Advertisement

Bigg Boss 10 Wild Card Entries:అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా 6 మంది కామనర్స్ ,యూట్యూబ్, సీరియల్స్, షోలు సినిమాల ద్వారా ఏకంగా పదిమంది సెలబ్రిటీలు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి అడుగు పెట్టారు. అలా 16 మందితో షో ప్రారంభం అయింది. ఇప్పటికే బ్లూ టీం , రెడ్ టీమ్ అంటూ రెండు గ్రూపులుగా విడిపోయారు. కంటెస్టెంట్స్ ఎవరికి వారు బలాబలాలు నిరూపించుకుంటూ అటు తమ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని కూడా మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అందరూ అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతోనే షో దూసుకుపోతోంది. ముఖ్యంగా షో గురించి చెప్పాలి అంటే అదిత్ అరుణ్ , రోహిత్ మధ్య గొడవలతో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే షో మొత్తం వీళ్ళిద్దరి చుట్టూనే తిరిగేలా అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ కి సంబంధించిన ఒక లిస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిగ్ బాస్ హౌస్ లోకి 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్..

సాధారణంగా ప్రతి సీజన్లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా వైల్డ్ కార్డు ఎంట్రీస్ హౌస్ లోపలికి వచ్చిన తర్వాత గేమ్ చూసి వచ్చేవారు.. లోపల సృష్టించే బీభత్సం ఎలాంటిదో గత సీజన్లలో ఆల్రెడీ మనం చూసాం. ఈ సీజన్ లో కూడా ఆ రేంజ్ క్రేజ్ ఉన్న కంటెస్టెంట్స్ ని దింపబోతున్నారని సమాచారం వినిపిస్తోంది. ముఖ్యంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.

Advertisement

ALSO READ:మనవడి కోసం నాగబాబు సంచలన నిర్ణయం!

ఆ ఎనిమిది మంది వీరేనా?

మరి హౌస్ లోకి వచ్చే ఆ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయానికి వస్తే.. ఇప్పటికే అగ్నిపరీక్ష సీజన్ 2 లో తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న ఇద్దరిని వైల్డ్ కార్డు ద్వారా తీసుకొస్తారట . దీపక్ , మితిలేష్, రామకృష్ణ , అపూర్వ ఇలా నలుగురు ఉండగా.. ఈ నలుగురిలో ఇద్దరినీ వైల్డ్ కార్డు ద్వారా తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఒక అమ్మాయి , ఒక అబ్బాయిని హౌస్ లోకి తీసుకురావాలని , అందులో అపూర్వ, మిథిలేష్ లను దాదాపు వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం కన్ఫామ్ చేశారు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఎక్కువగా లేడీస్ కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది . అందులో భాగంగానే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఫేమ్ సోనియా, ఆషిక వంటి వారితో పాటు సీరియల్ హీరోయిన్ సౌందర్య రెడ్డి అనే సెలబ్రిటీని వైల్డ్ కార్డు ద్వారా తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అబ్బాయిల విషయానికొస్తే నూకరాజు, రాకేష్, మరో కమెడియన్ లను సంప్రదించారట. వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి . ఒకవేళ వీళ్లంతా గనుక హౌస్ లోకి అడుగుపెడితే షో గేమ్ మరింత రసవత్తరంగా మారుతుంది అని చెప్పాలి. మరి చూద్దాం బిగ్ బాస్ నిర్వాహకులు వైల్డ్ కార్డు ద్వారా ఎవరెవరిని హౌస్ లోకి దింపుతారో..

Related News

అలీ హోస్ట్ గా మరో కొత్త షో..ఈసారి డబుల్ అల్లరి అంటూ!

బిగ్‌బాస్ హోస్టింగ్‌కు ఇంత డబ్బా? రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!

బిగ్ బాస్ 10లో ఎవరు ఎంత తీసుకుంటున్నారు? లెక్కలు బయటికి!

‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి హీరో ఔట్.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

యాటిట్యూడ్ చూపిస్తున్నారు.. కామనర్స్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఫైర్!

ఆట మొదలుపెట్టిన షాలిని.. ఇదికదా అసలైన సింపథీ గేమ్!

8 ఏళ్లకే తల్లి మరణం.. ఆపై తండ్రి కూడా..బిగ్ బాస్ కంటెస్టెంట్ జీవితంలో అన్నీ కన్నీళ్లే!

Big Stories

Advertisement
×