E-Paper
Advertisement

బిగ్‌బాస్ 10లోకి హాట్ బ్యూటీ.. లీకైన కంటెస్టెంట్ల లిస్ట్.?

బిగ్‌బాస్ 10లోకి హాట్ బ్యూటీ.. లీకైన కంటెస్టెంట్ల లిస్ట్.?
Advertisement

Bigg Boss Telugu 10 Contestants Buzz: ఇప్పటికే తొమ్మిది సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ తాజాగా పదో సీజన్ కి శ్రీకారం చుట్టింది.ఈ క్రమంలోనే అఫీషియల్ ప్రోమో గ్రాండ్ గా లాంచ్ చేసింది కూడ . టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారన్న సంగతి తెల్సిందే.ఇక ఎప్పటిలాగే ఈ సారి కూడాసరికొత్త స్టైల్ తో ఈసారి కూడా సరికొత్త స్టైల్‌తో కంటెస్టెంట్లను గైడ్ చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఈ పదేళ్ల పండుగ సీజన్‌ను ‘దశావతారం’ అనే క్రేజీ  కాన్సెప్ట్‌తో డిజైన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నటాక్.అంటే  విభిన్నమైన రూల్స్, మునుపెన్నడూ చూడని కఠినమైన టాస్కులతో ఈసారి ఆట మరింత రసవత్తరంగా మారనుందన్న మాట.

సాధారణంగా ప్రతి ఏటా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ షో, ఈసారి కాస్త ముందుగానే అంటే ఆగస్టు చివరి వారంలోనే ప్రేక్షకులను పలకరించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. దాంతో సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల లిస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది.

Advertisement

ఎవరెవరు ఉన్నారంటే ..
ఈ లిస్ట్‌లో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు కన్నడ, తెలుగు సీరియల్స్ నటి పల్లవి గౌడ. తన గ్లామర్, యాక్టింగ్‌తో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న పల్లవి హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే షోకు ప్రత్యేక ఆకర్షణ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. ఆమెతో పాటు ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్ వంటి నవ్వుల రారాజుల పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో రాకింగ్ రాకేష్ నటించి నిర్మించిన ‘కేశవ చౌదరి’ సినిమా తర్వాత ఆయనకు క్రేజ్ పెరగడం, నూకరాజు సోషల్ మీడియా రీల్స్ వైరల్ కావడం వీరికి ప్లస్ పాయింట్‌గా మారింది.

also read :గూస్‌బంప్స్ తెప్పిస్తున్న విజయ్ సేతుపతి డైలాగ్స్.. పూరి జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ టీజర్ టాక్!
వీరు కూడా ఉండే అవకాశం
వీరితో పాటు యూట్యూబ్ రంగం నుండి నందూస్ వరల్డ్ నందూ, డాన్స్ మాస్టర్ పండు, ‘ఆట’ ఫేమ్ సందీప్ సతీమణి జ్యోతి, రాయల్ మెక్ రమణల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బుల్లితెర క్రేజీ కపుల్స్ తేజస్విని గౌడ మరియు శివ్ కుమార్ జంటగా లేదా విడివిడిగా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. గత సీజన్ కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, ప్రముఖ రైటర్ కడలి సత్యనారాయణలతో పాటు ఈటీవీ ప్రభాకర్ లేదా ఇటీవల హీరోగా ‘బ్లాక్ డాగ్’ వంటి సినిమాలతో బిజీగా ఉన్న ఆయన కుమారుడు చంద్రహాస్ బిగ్‌బాస్ ఎంట్రీపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి.

Advertisement

ఆగస్టు వరకు వేచి చూడాల్సిందే
ఈ సెలబ్రిటీల హంగామాతో పాటు ఈ సీజన్ 10లో సామాన్యులకు (కామనర్స్) కూడా బంపర్ ఆఫర్ దక్కనుంది. ఇందుకోసం ‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2’ పేరుతో సరికొత్త టాలెంట్ హంట్ నిర్వహించబోతున్నారట. గతంలో బిగ్‌బాస్ విజేతలుగా, రన్నరప్‌లుగా నిలిచిన శివాజీ, గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ లేదా అభిజిత్ వంటి పాపులర్ సెలబ్రిటీలు దీనికి జడ్జీలుగా వ్యవహరించే అవకాశం ఉంది. దీని ద్వారా ఐదుగురు సామాన్యులను ఎంపిక చేసి నేరుగా మెయిన్ హౌస్‌లోకి పంపించనున్నారు. జూన్, జులై నెలల్లోనే దీనికి సంబంధించిన ఆడిషన్స్, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

గతేడాది బిగ్‌బాస్ 9 సీజన్ డిసెంబర్ 2025లో ముగిసినప్పటి నుండి ఫ్యాన్స్ ఈ కొత్త సీజన్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. హౌస్‌లోకి వెళ్లే ఫైనల్ కంటెస్టెంట్లు ఎవరనేది తెలియాలంటే ఆగస్టు 2026 లో జరిగే గ్రాండ్ లాంచ్‌ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

also read :‘పెద్ది’ తర్వాత మెగా పవర్ స్టార్‌కు సర్జరీ.. సుకుమార్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?

Related News

Monday Movies in Tv : సోమవారం సినీ ప్రియులకు పండగే.. టీవీల్లోకి బ్లాక్ బాస్టర్స్..!

కొత్త లోగో.. కొత్త ఫార్మాట్.. మీరు ఎన్నడూ చూడని సరికొత్త టీవీ న్యూస్ ఛానెల్‌గా..

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఎవ్వరు ఊహించని సీరియల్ టాప్..?

Gundeninda GudiGantalu Today episode: ఎపిసోడ్ కు హైలెట్ సీన్.. శృతి గ్రేట్ కదా.. మనోజ్ ను మోసం చేసిన రోహిణి..

Podarillu Today Episode : చక్రీ సీరియస్.. సురేష్ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. రచ్చ చేసిన వరాలు ..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ తో అవని గొడవ.. పల్లవికి మరో టెన్షన్.. అశ్విన్, పల్లవి దొరికిపోతారా?

Illu Illalu Pillalu Today Episodes: గ్రాండ్ గా శారదాంబ బర్త్ డే వేడుక.. ధీరజ్ పై నర్మద కౌంటర్స్.. ప్రేమకు సర్ప్రైజ్..

మీడియాలో ‘బిగ్ టీవీ’ కొత్త అధ్యాయం.. ప్రత్యక్ష ప్రసారాలతో రీ-ఎంట్రీ.. ప్రజల వైపే మా పయనం!

Big Stories

Advertisement
×