E-Paper
Advertisement

ఆయిల్ ట్యాంకర్- లారీ ఢీ కొని, ఒకరు సజీవ దహనం, అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆయిల్ ట్యాంకర్- లారీ ఢీ కొని, ఒకరు సజీవ దహనం, అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Advertisement

Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హిరేహాల్ మండలం జాజరకల్లు టోల్ ప్లాజా సమీపంలో ఆయిల్ ట్యాంకర్, లారీ బలంగా ఢీకొన్నాయి. పెద్ద ఎత్తుల మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది?

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అంటూ పోలీసులు చెబుతుంటారు. పదే పదే రోడ్లకు ఇరువైపులా తాటికాయంత అక్షరాలతో హెచ్చరిక బోర్డులు పెడుతుంటారు. అయినా వాహనదారులు అవేమీ పట్టించుకోరు. తాజాగా మంగళవారం మధ్యాహ్నం అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

రెండు లారీలు ఢీ కొన్న ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. హీరేహల్‌ మండలం జాజరకల్‌ టోల్‌ ప్లాజా బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను.. వేగంగా వస్తున్న మరొక లారీ ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

Advertisement

ఆయిల్ ట్యాంకర్- లారీ ఢీ కొని, ఒకరు సజీవ దహనం

రెండు లారీల్లోనూ మంటలు చెలరేగడంతో ఏం జరిగిందో తెలుసుకునే లోపు లారీ డ్రైవర్ మంటల్లో సజీవ దహనమయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అటు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. స్థానికులు మంటలు ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.

ఈలోగా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈలోగా పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

ALSO READ: ఫోన్‌లో చిన్న బిర్యానీ గొడవ.. కట్ చేస్తే కొడుకు కళ్లెదుటే తల్లిదండ్రులు

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×