E-Paper
Advertisement

బిగ్‌బాస్ 10పై పెరిగిన హైప్.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లేనా ?

బిగ్‌బాస్ 10పై పెరిగిన హైప్.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లేనా ?
Advertisement

Bigg Boss 10:బిగ్‌బాస్ ..తెలుగు బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో గా ముద్ర పడ్డ ఈ క్రేజీ ఎంటర్ టైనింగ్ షో ఇపుడు పదో సీజన్ గా మన ముందుకు రాబోతోంది.ఇక ప్రతి ఏడు ఈ షో మొదలయ్యే సమయానికి కంటెస్టెంట్లు ఎవరు రాబోతున్నారనే దానిపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చలు జరగడం చాలా కామన్.

ఇక ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభం కానుండటంతో మళ్ళీ ఆ ప్రశ్నలే ఇపుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి . టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్రత్యేకమైన పదో సీజన్ సెప్టెంబర్ 6, 2026న ఎంతో ఘనంగా ప్రారంభం కానున్న సంగతి తెల్సిందే.. దీంతో ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టబోయే ఆ సెలబ్రిటీలు ఎవరనే దానిపై ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ కనిపిస్తుంది.

Advertisement

ఈ షోపై అంచనాలు డబుల్

ఇక గత కొన్ని సీజన్లుగా నాగార్జున తనదైన నటన, టైమింగ్ తో వీకెండ్ ఎపిసోడ్లను ఎంతో సరదాగా, ఆకట్టుకునేలా నడిపిస్తున్నాడని చెప్పక్కర్లేదు. ఇప్పుడు ల్యాండ్‌మార్క్ 10వ సీజన్ కావడంతో ఈ షోపై అంచనాలు డబుల్ అయిపోయాయి.. ఇక సినిమాల నుండి బుల్లితెర నుండి , సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుండి నుంచి ఈసారి ఎవరెవరికి అవకాశం దక్కుతుందో చూడాలని ఈగర్ గా వాచ్ చేస్తున్నారు ఆడియన్స్ .

Advertisement

పంచులతో సందడి ఖాయం

ఇక ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పేర్లలో ముఖ్యంగా జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ పేరు గట్టిగా వినిపిస్తోంది. తనదైన పంచ్‌లు, టైమింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాంప్రసాద్ హౌస్‌లోకి వస్తే పంచులతో సందడి ఖాయం అని ఫిక్స్ అవుతున్నారు నెటిజన్లు .

ఆయనతో పాటు ‘వినాయకుడు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణుడు, ‘పుష్ప’, ‘సాహో’ వంటి పాన్ ఇండియా చిత్రాల్లో నెగెటివ్ పాత్రల్లో మెరిసిన టెంపర్ వంశీ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి కూడా .

ఆమె ఎంట్రీ షోకి మెయిన్ ఎసెట్

ఇక యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు ఆదిత్ అరుణ్, పాపులర్ యాంకర్ మరియు నటి వర్షిణి సౌందరరాజన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి .. వర్షిణికి ఉన్న గ్లామర్, క్రేజ్ దృష్ట్యా ఆమె ఎంట్రీ షోకి మెయిన్ ఎసెట్ గా భావిస్తున్నారట.

అంతేకాకుండా ఈసారి పక్క రాష్ట్రాల నుండి చైత్ర రాయ్, ముఖేష్ గౌడ, తేజస్విని గౌడ వంటి కన్నడ, తెలుగు ఆర్టిస్టులతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సుధీర్ రెడ్డి, కమెడియన్ పొట్టి నరేశ్ పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.

అయితే ఈ పేర్లన్నీ కేవలం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నవే. సెప్టెంబర్ 6న జరగబోయే గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్ వరకు అధికారికంగా ఎవరి పేర్లూ పక్కా అని తెలిసేలా లేదు.

Also read :క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

ఏదేమైనానాగార్జున గ్రాండ్ ఎంట్రీతో ఈ పదో సీజన్ ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలంటే లాంచ్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Tags

Related News

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Big Stories

Advertisement
×