Nindu Noorella Saavasam Serial Today Episode: సరస్వతి వార్డెన్ చెప్పినట్టుగానే ఆశ్రమం పిల్లలను తీసుకుని నాగార్జున సాగర్ టూర్ కు బయలుదేరుతుంది. వారితో పాటు మిస్సమ్మ, రాథోడ్, ఆనంద్, ఆకాష్, అంజు, బుజ్జమ్మ వెళ్తుంటారు. వాళ్లందరికీ సెండాప్ ఇవ్వడానికి బస్సు దగ్గరకు అమర్ వెళ్తాడు. అందరికీ జాగ్రత్తలు చెప్తుంటాడు. రాథోడ్ మాత్రం మీరేం బెంగ పెట్టుకోకండి సార్ పిల్లలను జాగ్రత్తగా తీసుకెళ్లి అంతే జాగ్రత్తగా తీసుకొస్తాము అని చెప్పగానే..
అమర్, మిస్సమ్మను జాగ్రత్తగా వెళ్లిరమ్మని వాళ్లు సాగర్ దగ్గరకు వెళ్లగానే.. పార్థు అరైంజ్ చేసిన పోలీసులు సెక్యూరిటీగా వస్తారని ఏదైనా అవసరం అయితే వెంటనే ఫోన్ చేయమని చెప్తుంటాడు. మిస్సమ్మ కూడా తాము ఇంటికి తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండమని అమర్‌కు చెప్తుంది. అమర్ సరే అంటుంటే మిస్సమ్మ వెళ్లి బస్సు ఎక్కబోతూ జారిపడబోతుంది. వెంటనే అమర్, మిస్సమ్మను పట్టుకుంటాడు. జాగ్రత్త భాగీ అంటాడు. మిస్సమ్మ సరే అంటూ బస్సు లోపలికి వెళ్లిపోతుంది. బస్సు వెళ్లిపోతుంటే.. పిల్లలందరూ అమర్‌కు బై చెప్తుంటారు. అమర్ ఎమోషనల్ అవుతాడు. తనకు తాను ఎందుకు ఇంత బాధపడుతున్నాను వాళ్లేదో నన్ను విడిచిపెట్టి వెళ్తున్నట్టు ఎమోషనల్ అవుతున్నాను అని మనసులో అనుకుంటాడు.
బస్సులో పిల్లలతో కలిసి రాథోడ్ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. మిస్సమ్మ మాత్రం మౌనంగా డల్లుగా కూర్చుని ఉంటుంది. రాథోడ్ ఏంటి మిస్సమ్మ అలా కూర్చున్నావు అని అడిగితే మిస్సమ్మ భయంగా ఆ ప్రచండ ఎక్కడి నుంచి దాడి చేస్తాడో అని భయంగా ఉంది రాథోడ్ అని చెప్పగానే.. ఇంత మంది ఉండగా ఆ ప్రచండ దాడి ఎలా చేస్తాడు మిస్సమ్మ అంటాడు రాథోడ్. ఆగస్టు 15 రోజు అంత మంది ఉండగానే.. తేనేటీగలు ఎందుకు దాడి చేశాయి అదంతా ప్రచండనే చేసి ఉంటాడని నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు కూడా ప్రచండ ఏం చేస్తాడోనని భయంగా ఉంది అని మిస్సమ్మ చెప్తే.. ఊరుకో మిస్సమ్మ సార్ ఊరికే ఉంటారా..? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాకో మిమ్మల్ని పంపించడానికి ఒప్పుకుని ఉంటాడు. అయినా అక్కడకు వెళ్లగానే.. పార్థు సార్ చెప్పిన పోలీసులు వస్తారు కదా అంటాడు రాథోడ్.
ప్రచండ కూడా కారులో తన శిష్యుడితో కలిసి వెళ్తుంటాడు. అసలు మీ ప్లానేంటి మాంత్రిక అని అడిగితే.. ఏముంది ఆ బుజ్జమ్మను బంధించి ఆమెలోని అరుంధతి ఆత్మ శక్తులను వశం చేసుకోవాలి అని చెప్తాడు. అంత మంది ఉండగా ఆ బుజ్జమ్మను ఎలా బంధిస్తావు అని శిష్యుడు అడిగితే ఎలాగైనా సరే ఆ బుజ్జమ్మను ఈసారి బంధించాలి అంటాడు ప్రచండ. బుజ్జమ్మను బంధించాలంటే మనం వారితో పాటు నాగార్జునసాగర్ వెళ్లాలి కానీ నువ్వు శ్రీశైలం తీసుకెళ్తున్నావేంటి అని శిష్యుడు ప్రశ్నిస్తే..
మనం వాళ్ల వెంట పడాల్సిన అవరసం లేదురా.. వాళ్లే మన దగ్గరకు వస్తారు అని ప్రచండ చెబితే అదెలా సాధ్యం అవుతుంది మాంత్రిక అని శిష్యుడు అడిగితే నా మంత్ర శక్తికి ఏదైనా సాధ్యమే ఈరోజు అసలుసిసలైన నా మంత్రశక్తులు అన్ని చూపిస్తాను అని చెప్తాడు ప్రచండ. అయితే కచ్చితంగా ఈరోజు వాళ్లకు మూడింది అన్నమాట అంటూ శిష్యుడు చెబితే అందులో అణువంతైనా అనుమానం లేదురా.. ఈసారి గెలుపు మనదే అంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.