E-Paper
Advertisement

మారెమ్మపై రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్.. సినిమా చూశాక ఏమన్నాడంటే!

మారెమ్మపై రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్.. సినిమా చూశాక ఏమన్నాడంటే!
Advertisement

Maremma Movie:మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి మరో కొత్త నటుడు టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ ‘మారెమ్మ’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.

గ్రామీణ నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్స్ మిక్స్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మంచాల నాగరాజు దర్శకత్వం వహించారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదల కానుంది.

Advertisement

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే మూవీ టీమ్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రవితేజ, యూనిట్ మొత్తానికి తన శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.

ఈ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ.. ‘మారెమ్మ’ సినిమాను తాను ఇప్పటికే చూశానని, కథ, కథనాలు తనకు బాగా నచ్చాయని చెప్పారు. “ఈ సినిమాను నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీశారు. తెలంగాణలోని మైసాపురం బ్యాక్‌డ్రాప్‌లో చాలా రూటెడ్‌గా, రస్టిక్‌గా తెరకెక్కించారు. నాకైతే సినిమా బాగా నచ్చింది. డెఫినెట్‌గా ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం నాకుంది” అని తెలిపారు.

Advertisement

అలాగే సాంకేతిక నిపుణులపై రవితేజ ప్రశంసలు కురిపించారు. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం, పాటలు అద్భుతంగా ఉన్నాయని, ఆయనకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. సినిమాటోగ్రాఫర్ ప్రశాంత్ పనితనాన్ని మెచ్చుకుంటూ, నిర్మాతలకు ఈ సినిమాతో మంచి పేరు, సక్సెస్ రావాలని ఆకాంక్షించారు.

“దర్శకుడు నాగరాజుకి ఇది మొదటి సినిమా అయినప్పటికీ చాలా అద్భుతంగా తీశారు. ఇలాంటి ఒక విభిన్నమైన సబ్జెక్ట్ ఎంచుకుని, మాధవ్‌తో చేయించడం మెచ్చుకోతగ్గ విషయం అని చెప్పుకొచ్చారు .మాధవ్ ఈ సినిమా కోసం తనను తాను మార్చుకున్న తీరు, ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయని .సి సెప్టెంబర్ 10న వస్తున్న ఈ యంగ్ టాలెంట్‌ను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను” అని రవితేజ అన్నారు.

హీరో మాధవ్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి రవితేజను చూస్తూ పెరిగానని, తన తొలి సినిమా ఈవెంట్‌కు ఆయన రావడం చాలా గర్వంగా ఉందన్నారు. “ఆయన నాకు కేవలం పెదనాన్న మాత్రమే కాదు.. ఒక అన్నయ్య లాంటివారు” అని తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘మారెమ్మ’లో మాస్ యాక్షన్‌తో పాటు మంచి హ్యూమన్ ఎమోషన్స్, ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంటాయని చెప్పారు. కథానాయిక దీప బాలు, విలన్‌గా చేసిన వికాస్ తమ పాత్రల్లో జీవించేశారని తెలిపారు.

ఈ ఈవెంట్‌లో పాల్గొన్న దర్శకుడు హసిత్ గోలి టీమ్‌కి విషెస్ చెబుతూ, ఈ సినిమా చూస్తుంటే ‘జల్లికట్టు’ గుర్తుకొచ్చిందని చెప్పడం విశేషం . ఇక దర్శకుడు మంచాల నాగరాజు మాట్లాడుతూ.. 2006 కాలంనాటి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ ముఖ్యంగా పల్లెటూరి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని, సెప్టెంబర్ 10న థియేటర్లలో ‘మారెమ్మ’ జాతర మొదలవుతుందని కాన్ఫిడెన్స్ గా చెప్పడం విశేషం.

Also read :క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

చూడాలి మరి ఈ రూటెడ్ డ్రామాతో మాధవ్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తారో !

Tags

Related News

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!

గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

ఫ్యాన్స్ గెట్ రెడీ…బాలయ్య NBK 111 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!

Big Stories

Advertisement
×