E-Paper
Advertisement

Thanuja: నా బ్రతుకు నన్ను బ్రతుకనివ్వండి… ట్రోల్స్ పై ఎమోషనల్ అయిన బిగ్ బాస్ బ్యూటీ!

Thanuja: నా బ్రతుకు నన్ను బ్రతుకనివ్వండి… ట్రోల్స్ పై ఎమోషనల్ అయిన బిగ్ బాస్ బ్యూటీ!
Advertisement

Thanuja: తనూజ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ముద్దమందారం సీరియల్ ద్వారా ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం పలు సీరియల్స్ లో నటించారు. ఇక ఇటీవల బిగ్ బాస్ 9 తెలుగు రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఈమె రన్నర్ గా బయటకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ల విషయంలో కొంతమంది సపోర్ట్ చేయగా మరికొందరు విమర్శిస్తూ ఉంటారు. ఇక ఈ షో అయిపోయిన తర్వాత కూడా బయట కొంతమంది కంటెస్టెంట్లపై నెగిటివిటీ అలాగే కొనసాగుతూ వస్తోంది. అయితే తనూజ పట్ల వస్తున్న నెగిటివిటీ గురించి కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు.

నాకు ఎలాంటి పీఆర్ టీం లేదు..

ఈ సందర్భంగా తనూజ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాలను తెలియజస్తూ.. గత కొంతకాలంగా నా మనసులో తిరుగుతున్నదంతా మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే ముందుగా ఎవరైతే నన్ను విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలను ఆపండి. అందరిలాగే నాకు ఒక జీవితం ఉంది.. నా పని ఏదో నేను చేసుకుంటూ ఉన్నాను. నా బ్రతుకు నన్ను బ్రతుకనివ్వండి. ప్రతిదానికి పిఆర్ అనడం మానేయండి అంటూ ఈమె వేడుకున్నారు. నేను ఒకరిని టార్గెట్ చేశానంటూ తప్పుగా అర్థం చేసుకొని నాపై విమర్శలు చేయడం సరికాదని తనూజ తెలిపారు. ఇతరులపై మీకు ఎలాంటి ప్రేమ ఉందో నేను అర్థం చేసుకోగలను కానీ, నేనే పరిస్థితులలో ఉన్నానో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఇలాంటి విమర్శలతో నా క్యారెక్టర్ ను అవమానిస్తున్నారని ఈమె ఎమోషనల్ అయ్యారు.

నా కుటుంబం పై ప్రభావం చూపుతోంది..

Advertisement

ఇలా సోషల్ మీడియాలో తన గురించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ బాధలను బయటకు చెప్పుకోలేక మౌనం వహిస్తున్నానని, మీ అందరిలాగే నాకు ఒక కుటుంబం ఉంది. మీరు చేసే ఈ చెత్త కామెంట్లు నా కుటుంబం పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది . దయచేసి ఫేక్ అకౌంట్స్ నుంచి ఇలాంటి చెత్త కామెంట్లు చేయొద్దు అంటూ ఈమె అభ్యర్థించారు. కేవలం నన్ను మాత్రమే కాకుండా ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారిని కూడా ద్వేషిస్తున్నారని తెలిపారు.

గౌరవంగా బ్రతకాలనుకుంటున్నా..

Advertisement

నేను ఎవరిని కిందకు లాగే ప్రయత్నం చేయలేదు నా పని ఏదో నేను చేసుకుంటూ ప్రశాంతంగా, గౌరవంగా బ్రతకడానికి ప్రయత్నాలు చేస్తున్నాను దయచేసి తనపై విమర్శలను ఆపండి అంటూ ఈ సందర్భంగా ఈమె సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. మరి తనూజ చేసిన ఈ పోస్టు కారణంగా ఈమెపై వస్తున్నటువంటి నెగిటివిటీ తగ్గుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాతే తనూజ పై ఇలాంటి నెగెటివిటీ పెరిగిందని చెప్పాలి.

Also Read; Sriya Saran:ఆ ట్యాగ్ చాలా సంతోషాన్ని ఇచ్చింది.. మీ ప్రేమ వెలకట్టలేనిది!

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×