E-Paper
Advertisement

Muduchintalapalli: మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా.. కాంగ్రెస్‌లో జోరందుకున్న చేరికలు

Muduchintalapalli: మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా.. కాంగ్రెస్‌లో జోరందుకున్న చేరికలు
Advertisement

Muduchintalapalli: ముడిచింతలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలంతా ఉత్సాహంగా పని చేస్తున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి(Harivardhan Reddy) తెలిపారు. సోమవారం ముడిచింతలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కనక రాజుతో పాటు సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన వెల్లడించారు. కష్టపడి పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో కాంగ్రెస్‌పై అపారమైన నమ్మకం పెరిగిందన్నారు. అదే నమ్మకంతో ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.

Also Read: Allu Sirish: ‘మగజాతి ఆణిముత్యం’గా అల్లు శిరీష్.. ఈసారైనా హిట్ కొడతాడా

పథకాలే పార్టీకి ప్రధాన బలం

Advertisement

బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో నైతిక హక్కు లేదని, స్వార్థపరులు, దోపిడీ చేసే వారే ఆ పార్టీ టికెట్ ఇచ్చిందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందునే ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ముందుకు వస్తున్నారని స్పష్టం చేశారు. అనంతరం మాజీ మేయర్ అజయ్ యాదవ్(Ajay Yadav) మాట్లాడుతూ, సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన బలం అని అన్నారు. ఆ పథకాల ప్రభావంతో అనేక మంది పార్టీకి చేరుతున్నారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముడిచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులన్నింటిలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిర్యాజిగూడ మాజీ మేయర్ అజిత్ సింగ్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సీపీ సజ్జనార్ తీరుపై హరీష్ రావు ఫైర్!

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×