Vijayasaireddy Party: కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. తాను రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు తెలిపారు. అదే సమయంలో కుల రాజకీయాలకు తెరపైకి తెచ్చారు. పెట్టబోయే పార్టీలో యూత్‌కి 66 శాతం పోటీ చేసే ఛాన్స్ ఉంటుందని వివరించారు. టీడీపీ-వైసీపీలు ఫ్యాక్షన్ పార్టీలేనన్న ఆయన, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరమని కుండబద్దలు కొట్టేశారు.
సోమవారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీలో ప్రస్తుతం రెండు కులాలు పాలన సాగిస్తున్నాయని తేల్చేశారు. ఆ రెండు పార్టీలు అధికారం చేపట్టాలా? అని ప్రశ్నించారు. అనేక వర్గాలు ఉన్నప్పటికి గడిచి దశాబ్దమున్నరపాటు రెడ్లు-కమ్మలే పాలిస్తున్నారని తేల్చిచెప్పారు. టీడీపీని రెడ్ బుక్ పార్టీ అని, వైసీపీని రప్పా రప్పా పార్టీ అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తాను పార్టీ పెట్టినా సీఎంగా ఉండనని, వేరే వ్యక్తి ఉంటారని తేల్చిచెప్పారు. 80 శాతం ఉన్న వేరే సామాజికవర్గాల నేతలకు మా పార్టీలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. బీసీల్లో బలమైన నాయకులు ఉన్నారంటూ కొత్త పల్లవి మొదలుపెట్టారు. అదే సమయంలో టీడీపీ-వైసీలపై విమర్శలు గుప్పించారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ పార్టీల పాలనపై మండిపడ్డారు. ఆ రెండు ఫ్యాక్షన్ పార్టీలేనని తేల్చేశారు. ఈ విషయంలో రెండేళ్లు తాను సైలెంట్‌గా ఎందుకున్నానో వివరించారు కూడా. ఏడాదిగా రెడ్డి సామాజికవర్గం ఎలా ఆవిర్భవించింది? అనేదానిపై ఓ పుస్తకాన్ని రాసినట్లు వెల్లడించారు. సుమారు 350 పేజీలతో పుస్తకాన్ని రూపొందించానని, ఆ సామాజికవర్గానికి సంబంధించి చరిత్ర, ఆవిర్భావంపై వివరాలు ఉన్నట్లు తెలియజేశారు. వైసీపీ-టీడీపీ కుటుంబ రాజకీయ పార్టీలన్న మాజీ ఎంపీ.. దందాలు, సెటిల్‌మెంట్లు అలవాటుగా మారాయన్నారు.
ఏపీలో తమిళనాడు తరహా రాజకీయాలు నడుస్తున్నాయని కొత్త స్టోరీ లైన్ బయటపెట్టారు. ఎన్నికల కోసం భారీగా ఖర్చు చేసి, గెలిచిన తర్వాత దోచుకుంటున్నాయని ఘాటుగా విమర్శించారు. తాను పెట్టబోయ పార్టీలో చేరేవారికి దేశభక్తి ఉండాలంటూ క్వాలిఫికేషన్ పెట్టారు. 80 శాతం ఓట్లున్న కులాలకు అధికారం చేపట్టే అర్హత ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. మా పార్టీ తరపున బీసీ వర్గాల్లో బలమైన నాయకులు ఉన్నారని, వారికి ఛాన్స్ ఇస్తానని తేల్చేశారు. ఏపీలో రెండు పార్టీలు ఉన్నాయని, మూడో రాజకీయ పార్టీ అవసరం ఎంతైనా ఉందన్నారు.
ALSO READ: స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
జనసేన విషయాన్ని ఆయన పక్కన పెట్టేశారు. తమ పార్టీ విధి-విధానాలు, ప్రాధాన్యతల గురించి చెప్పుకొచ్చారు. మా పార్టీలో చేరేవారు 66 శాతం యువతకు ప్రాతినిథ్యం ఉంటుందన్నారు. పార్టీ పేరు పెట్టకుండానే హామీల చిట్టా బయటపెట్టారు. వ్యవసాయానికి, గృహ వినియోగానికి ఉచిత కరెంటు ఇస్తామన్నారు విజయసాయిరెడ్డి. ప్రజలు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారన్న వీఎస్ఆర్, సోలార్ విద్యుత్‌ని ప్రోత్సహిస్తామన్నారు. అమరావతి రాజధానని స్వాగతిస్తామని మనసులోని మాట బయటపెట్టారు. పార్టీ ప్రణాళిక, మానిఫెస్టో, స్ట్రాటజీని త్వరలో ప్రకటిస్తారని తెలిపారు విజయసాయిరెడ్డి.