Brahmamudi Rudrani: బుల్లితెరపై సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారమవుతున్న సీరియల్స్లలో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.. భార్యాభర్తలు బంధం గురించి బ్రహ్మముడి గురించి ఈ సీరియల్ లో ఎంతో చక్కగా వివరించారు. ఇందులో హీరో అత్త పాత్రలో రుద్రాణి నటించింది. ఆమె చూడడానికి చిన్న వయసులో ఉన్నా కూడా అలాంటి పాత్రలు చేయడం పై కొంతమంది ఫీల్ అవుతున్నారు… అయితే ఈ సీరియల్కు ఆమె పాత్ర హైలెట్ గా నిలుస్తుంది. ఈమె అసలు పేరు షర్మిత గౌడ.. ఈమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బుల్లితెర సెలబ్రిటీలంతా ఓ లెక్క రుద్రాణి మరో లెక్క అనేట్టుగా ఉంది ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు, వీడియోలు చూస్తే. హీరోయిన్లకు మతిపోయేలా బికినీ షూట్‌లో బెంబేలెత్తిస్తోంది రుద్రాణి.. తాజాగా వినాయక చవితి సందర్భంగా తన కొడుకుల తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
షర్మిత కొడుకు పిక్స్..
బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో తెలుగు వాళ్ళ కన్నా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.. కొందరు ఇక్కడ వచ్చిన తర్వాత తెలుగుని అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నారు.. అలా ఇప్పుడు చాలామంది తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అందులో బ్రహ్మముడి నటి రుద్రాణి ఒకరు. రుద్రాణి ఫిజిక్ ముందు ‘బ్రహ్మముడి’ సీరియల్ హీరోయిన్లు కూడా సరితూగరు. ఈమె అందం ముందు సినిమా హీరోయిన్ కూడా పనికిరారు. హాట్ అందాలతో పాటుగా బికినీలో కూడా ఫోటోలు దిగి షేర్ చేస్తుంది. ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఈ మీకు ఇంకా పెళ్లి కాలేదు ఏమో అని అనుకుంటున్నారు. కానీ ఈమెకు పెళ్లయ్యి 15 ఏళ్లకు పైగా ఉన్నా కొడుకు, అలాగే కూతురు కూడా అన్నారు.. రీసెంట్ గా వినాయక చవితి సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫోటోలలో తన పిల్లలతో దిగింది.. అవి చూసిన ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయింది. ఇంత పెద్ద పిల్లలు ఉన్నా కూడా ఇంత అందంగా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: శనివారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
ఈమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే..
షర్మిత క్యారెక్టర్ పెద్దగా ఉన్నా సరే ఆమె వాయిస్ మాత్రం చాలా చిన్నది అని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ కన్నా మూడు నెలల వరకు చిన్నదే. ఈమె కన్నడ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్. అనేక సినిమాలు సీరియల్స్‌లో నటించింది.. ముఖ్యంగా సన్ టీవీలో ప్రసారం అయిన ‘నీలా’ సీరియల్‌తో గుర్తింపు సంపాదించింది… ఇక ఈమె చిక్కమగళూరులో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. డిగ్రీ పూర్తి చేసిన తరువాత.. మోడలింగ్‌లో కెరియర్ స్టార్ట్ చేసింది.. 2017లో మిస్ కర్ణాటక అవార్డుని గెలుచుకుంది. ఆ తర్వాత కన్నడ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈమె ఎప్పుడెప్పుడు ఎలాంటి ఫోటోలు వదులుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.