OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. రకరకాల సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏం జరుగుతుందోనని ఆసక్తిని పెంచుతుంటాయి. ఇలాంటి సినిమాలకు ఆడియన్స్ కూడా ఫిదా అవుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక అపరిచిత వ్యక్తి పొరపాటున ఒక అల్మారాలో లాక్ అవుతాడు. అది ఒక ఫ్యామిలీకి డెలివరీ అవుతుంది. ఇక ఆ ఇంట్లో సీక్రెట్ గా అందరినీ వాచ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో స్టోరీ ఒక హార్ట్ టచ్ ఫీలింగ్ ని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
కథలోకి వెళ్తే
డామియన్ కొన్ని సంవత్సరాలుగా కార్పెంటర్ పని చేస్తుంటాడు. ఒకరోజు ఇతన్ని యజమాని మందలిస్తాడు. అతనిపై కోపంతో ఆఫీస్ నుండి పారిపోతాడు. ఇక అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో, అతను ఒక వ్యాన్‌లో ఉన్న పాత అల్మరాలో దాక్కుంటాడు. ఆ అల్మరా లూసియా, ఫెడే దంపతుల ఇంటికి డెలివరీ అవుతుంది. వీళ్లకు మరియా అనే టీనేజ్ కూతురు ఉంటుంది. ఆ రాత్రి డామియన్ ఇంట్లోనే ఉండి, ఈ ఫ్యామిలీని రహస్యంగా గమనించాలని అనుకుంటాడు. అల్మరాలో, బెడ్ కింద దాక్కుంటూ, లూసియా ఒంటరితనం, ఫెడే వైఖరి, మరియా వయసులో ఉన్న సమస్యలను గమనిస్తాడు. లూసియా చనిపోయిన తన తమ్ముడిని తలుచుకుని బాధపడుతుంటుంది.
డామియన్ రాకతో ఇంట్లో జరుగుతున్న సంఘటనలు, తన తమ్ముడి ఆత్మ వల్లే జరుగుతున్నాయని అనుకుంటుంది. డామియన్ ఈ కుటుంబానికి రహస్యంగా సహాయం చేయడం మొదలుపెడతాడు. ఇది ఊహించని మలుపులు దారి తీస్తుంది. ఇక లూసియా ఇంట్లో ఎవరో ఉన్నారని అనుమానించడం ప్రారంభిస్తుంది. క్లైమాక్స్ వరకు డామియన్ ఆ ఇంట్లో తనదైన ముద్ర వేసుకుంటాడు. చివరికి డామియన్ ని ఆ కుటుంబం గుర్తిస్తుందా ? ఈ కుటుంబానికి అతను ఎలా సహాయపడతాడు ? ఈ క్లైమాక్స్ ఎలా ముగుస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
ప్రైమ్ వీడియోలో
‘స్టేరింగ్ ఎట్ స్ట్రేంజర్స్’ (Staring at strangers) 2022లో విడుదలైన స్పానిష్-బెల్జియన్ థ్రిల్లర్ చిత్రం. దీనికి ఫెలిక్స్ విస్కారెట్ దర్శకత్వం వహించారు. జువాన్ జోస్ మిల్లాస్ రచించిన ‘Desde la sombra’ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో పాకో లియోన్ (డామియన్), లియోనోర్ వాట్లింగ్ (లూసియా), ఆలెక్స్ బ్రెండెముల్ (ఫెడే), మరియా రొమానిల్లోస్ (మరియా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈసినిమా 2022 నవంబర్ 4న స్పెయిన్‌లో థియేట్రికల్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. IMDb లో ఈ సినిమాకి 6.1/10 రేటింగ్ ఉంది.
Read Also : భార్యకు తెలియకుండా మరో అమ్మాయితో… కూతురు కూడా తండ్రితో చేతులు కలిపి ఇదేం దిక్కుమాలిన పనిరా అయ్యా ?