E-Paper
Advertisement

Brahmamudi Serial Today April 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణకు నిజం చెప్పిన కావ్య – ఆనందంతో బాధపడ్డ అపర్ణ

Brahmamudi Serial Today April 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణకు నిజం చెప్పిన కావ్య – ఆనందంతో బాధపడ్డ అపర్ణ
Advertisement

Brahmamudi serial today Episode: రాజ్‌ బతికే ఉన్నాడన్న నిజం ఇంట్లో వాళ్లకు చెప్పాలని అప్పు ఆలోచిస్తుంది. ఇంతలో కావ్య వచ్చి అప్పు ఏంటే ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. దీంతో నీ కోసమే ఎదురుచూస్తున్నాను అక్కా అంటుంది. నాకోసమా అంటూ కావ్య అడగ్గానే.. పెద్దత్తయ్య గారి పరిస్తితి ఏం బాగా లేదు అక్క.. ఏం తినడం లేదు. తాగడం లేదు. చివరకు మంచినీళ్లు కూడా తాగడం లేదు. ఇలాగే వదిలేస్తే ఏమై పోతారోనని భయంగా ఉంది అక్క అని చెప్పగానే.. తెలుసు అప్పు.. కానీ ఏం చేస్తం.. అత్తయ్య సమస్యకు పరిష్కారం ఆయన ఒక్కరే ఆయన్ని తిరిగి తీసుకురావడానికి ఇంకా టైం పడుతుంది అని కావ్య చెప్పగానే.. అప్పు ఆవేదనతో కానీ అంత వరకు ఆవిడను అలాగే వదిలేయలేము కదా..? అత్తయ్య అలా బాధపడుతుంటే బావ బతికే ఉన్నాడన్న నిజం చెప్పేద్దామని నిన్ను అడక్కుండా చెప్పలేకపోయాను అక్క. రేపు అత్తయ్య పుట్టినరోజు అంట ప్రతి సంవత్సరం గుడిలో అన్నదానం చేసేవారంట. అదే విషయం ప్రకాషం అంకుల్‌ అడిగితే నా కొడుకు లేకుండా నాకు ఏ పుట్టిన రోజు అక్కర్లేదు అని రూంలోకి వెళ్లిపోయారు అక్క అని చెప్పగానే కావ్య అత్తయ్యతో నేను మాట్లాడతాను దీని గురించి ఇక నువ్వు వదిలేయ్‌ అంటూ లోపలికి వెళ్లిపోతుంది.

అపర్ణ రూంలో  కూర్చుని బాధపడుతుంది. కావ్య వచ్చి ఎందుకు ఇలా కూర్చున్నారని ప్రశ్నిస్తుంది. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక నాకు లేదని అపర్ణ ఏడుస్తుంది. దీంతో భోజనం చేస్తే ఆ ఓపిక వస్తుంది అత్తయ్య అంటుంది కావ్య. అపర్ణ ఏడుస్తూ.. కన్న కొడుకు ఈ లోకానికే దూరం అయ్యాక వాడు చేసిన పనులను చూసి ఏ తల్లైన సంబరపడిపోతుందా..? అంటుంది. దీంతో కావ్య అత్తయ్యా ఆయన లేరని ఎవరు చెప్పారు. రారని ఎందుకు అనుకుంటున్నారు. ఆయన బతికే ఉన్నారని తిరిగి వస్తారని  నేను ఎంత చెప్పినా మీరందరూ ఎందుకు నమ్మడం లేదు. అంటుంది. దీంతో అపర్ణ ఎలా నమ్మమంటావే.. వాడు నీకు మాత్రమే కనిపిస్తూ ఈ ఇంట్లో ఎవరికీ కనిపించడం లేదంటే ఎలా నమ్మమంటావు. వాడి మీద ప్రేమతో వాడు బతికే ఉన్నాడన్న భ్రమలో మాట్లాడుతున్నావో లేక మాకు ధైర్యం చెప్పడానికి ఇలా మాట్లాడుతున్నావో అసలు నీ మానసిక పరిస్థితి ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు కావ్య అంటుంది.

Advertisement

దీంతో కావ్య అంటే నేను పిచ్చి దానిలా కనిపిస్తున్నానా..? అత్తయ్యా అని అడుగుతుంది. దీంతో అపర్ణ అలాగే కనిపిస్తున్నావు. నిజంగా వాడు బతికే ఉంటే ఇంటికి ఎందుకు రావడం లేదు. తన కన్న వాళ్లను కూడా కాదని ఎక్కడో బయట బతకాల్సిన అవసరం ఏముంది చెప్పు.. చెప్పలేవు కదా..? నీ మాటే కాదు చివరికి ఆ దేవుడే వచ్చి చెప్పినా నేను కళ్లారా చూడకుండా నమ్మను. నిజంగా వాడు బతికే ఉంటే ఈ తల్లికి దూరంగా ఒక్క క్షణం కూడా ఉండడు.. కానీ ఎందుకు రాలేదు.. చెప్పు కావ్య ఎందుకు రాలేదు చెప్పు అని బలవంతంగా అడగడంతో కావ్య ఎందుకంటే ఆయన గతం మర్చిపోయారు. అంటూ నిజం చెప్తుంది. దీంతో అపర్ణ ఏంటే నువ్వు మాట్లాడేది నిజం చెప్పవే అంటూ అడగ్గానే.. కావ్య అత్తయ్యా నేను ఎప్పుడైనా అబద్దం చెప్పానా..? అంటూ జరిగింది మొత్తం చెప్తుంది.

దీంతో అపర్ణ బాధపడుతుంది. యామిని గురించి చెప్పి కావ్య బాధపడుతుంది.  ఇంతలో రాజ్‌కు గతాన్ని గుర్తు చేస్తే గుర్తుకు రాదా అని అపర్ణ అడగ్గానే.. ఆయనకు గతాన్ని గుర్తు చేస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్‌ చెప్పారు. అందుకే నేను సైలెంట్‌గా ఉండిపోయాను అని కావ్య చెప్పగానే.. అపర్ణ నేను ఇప్పుడు వాడిని చూడాలి అని చెప్తుంది. కావ్య వద్దని చెప్తుంది. దీంతో అపర్ణ నన్ను ఓదార్చడానికి నువ్వు ఈ కట్టు కథ చెప్తున్నావు కదూ అంటుంది. అయితే రేపే మీకు ఆయన్ని చూపిస్తాను. కానీ మీరు ఆయనతో గతం గురించి మాట్లాడను అని మాటిస్తేనే చూపిస్తాను అని కావ్య అడుగుతుంది. సరేనని మాటిస్తుంది అపర్ణ.

Advertisement

తర్వాత రాజ్‌ను ఎలా తీసుకొచ్చి అత్తయ్యకు ఎలా చూపించాలి. అయ్యో దేవుడా ఎదైనా దారి చూపించు అంటూ మనసులో అనుకుంటుంది. రాజ్‌ కూడా సేమ్‌ కావ్య లాగే ఆలోచిస్తుంటాడు. కావ్య ఒక్కసారి ఫోన్‌ చేసి చూద్దాం అనుకుంటూ ఫోన్‌ తీసుకోబోతుంటే.. రాజ్‌ ఫోన్‌ చేస్తాడు. ఎక్కడున్నావు అని అడుగుతాడు. కావ్య వెజిటేబుల్‌ షాక్‌ కు వెళ్లాలి అని చెప్తుంది. రాజ్‌ ఇదేదో మనకు పనికొచ్చేలా ఉందే.. అని మనసులో అనుకుని అరే ఇప్పుడే మా ఆంటీ కూడా నన్ను వెజిటేబుల్స్‌ తీసుకురమ్మని చెప్పింది. భలే కో ఇన్సిడెంట్‌ కదండి అంటాడు. ఇంతకీ మీరు కూరగాయలకు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. కావ్య అడ్రస్‌ చెప్తుంది. మా ఆంటీ కూడా అక్కడే తీసుకురమ్మని చెప్పారు అంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×