Illu Illalu Pillalu Today Episode April 14th : నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి. అందరిని రిసీవ్ చేసుకుంటూ కొడుకులతో అవి ఇవి ఏంటో చెబుతూ ఉంటాడు. ధీరజ్త తన తండ్రి తనతో మాట్లాడుతున్నాడని సంతోషపడతాడు. బుజ్జమ్మ హడావుడి చూసి నర్మదా కూడా సెటైర్లు వేస్తుంది. పెళ్లి పనులు నేనొక్కదాన్నే చూసుకుంటున్నాను కనీసం ఎవరు సాయం చేయాలని అనుకోవట్లేదు. అందుకే నేను అలిసిపోతున్నానని అంటుంది. అత్త మీద ఆమె వేసే సెటైర్స్ అక్కడ ఉన్న వారిని ఆకట్టుకున్నాయి. నువ్వు ఇలా కల్పించుకొని నాకు జ్యూసులుగా ట్రై చేస్తూ ఉండాలి అమ్మాయి అనేసి వేదవతి అంటుంది. ఇక ధీరజ్ వచ్చేసి ప్రేమను చూసి సంతోషపడతాడు. ప్రేమ అందాన్ని వేరే వాళ్ళ పొగుడుతుంటేనే తను నా భార్య మీరెవరు పొగడ్డానికి అనేసి అంటాడు.. నీ పని మీరు చూసుకుంటే మంచిది అని వాళ్లకు వార్నింగ్ ఇస్తారు ఇక ప్రేమతో ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు నిజంగానే దేవకన్యలా ఉన్నావని పొగడ్తలతో ముంచేస్తాడు.. ప్రేమ మనసులో ప్రేమను సంపాదించుకోవడం కోసం బాగా ట్రై చేస్తాడు ధీరజ్.. ఇక ప్రేమ వచ్చి కవర్ చేసుకుంది చాల్లే ఈ చీర ఎలా ఉందో చెప్పు ని అడుగుతుంది ప్రేమ. బాగుంది బాగుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బ్యుటీషియన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఇక కూతుర్ని పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ తెగ మురిసిపోతుంటుంది భాగ్యం. మా అమ్మడు కుందనపు బొమ్మలా ఉంది పొంగిపోతుంది.. ఇక అందరు పెళ్లి కోసం వెయిట్ చేస్తుంటారు. ఖర్చుల కోసం మా ఆయన పది లక్షలు ఇచ్చాడు కదా.. నా మేకప్ కోసం ఖర్చు పెట్టలేవా? ఏంటీ అని అంటుంది శ్రీవల్లి. అయ్ బాబోయ్.. అప్పుడే మా డబ్బులు.. మా ఆయన అని అనేస్తున్నావే.. అని భాగ్యం అంటే.. కాసేపట్లో పెళ్లి అయిపోతుంది కదమ్మా అని తెగ సిగ్గుపడిపోతుంది శ్రీవల్లి. అవునే అమ్మడూ.. మీ పెళ్లి అయిపోనట్టే ఇక మీ పెళ్లి ఎట్టాంటి ఆటంకాలు.. అడ్డంకులు లేవు అని అంటుంది భాగ్యం..
పెళ్లిని ఆపేశక్తి మీ భూమిపై ఎవరికీ లేదు అని భాగ్యం అనేసరికి.. నాకు ఉంది కదా అన్నట్టుగా వచ్చి తలుపుకొడుతుంది బ్యుటీషియన్. ఎవరు మీరు అని అంటే.. నేను మేకప్ ఆర్టిస్ట్‌ని అని పరిచయం చేసుకుని శ్రీవల్లి దగ్గరకు వెళ్తుంది. మేకప్ కావాలని నేను చెప్పలేదు కదా.. నువ్వెందుకు వచ్చావ్ అని భాగ్యం అడిగితే.. నన్ను పెళ్లి కొడుకు వాళ్లు పంపించారు అని అంటుంది.. డబ్బులు వాళ్ళే ఇస్తారని అంటుంది.. భాగ్యం అక్కడికి వచ్చి పెళ్లి కూతురు అని చెప్పారు కానీ అక్కడ పెళ్ళికి కూతురు కనిపించదు. భాగ్యం ఎక్కడ పోయిందని టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ మేకప్ వేసే అమ్మాయి కూడా లేదని అనుకుంటుంది.
పెళ్లికూతురు తీసుకురమ్మ అని చెప్తే వాళ్ళందరూ వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్లి చూస్తే భాగ్యంతో పాటు అందరూ షాక్ అవుతారు. అప్పుడే శ్రీవల్లి పక్కన నుంచి వస్తుంది. ఈ రూమ్ లో ఏసీ లేదని అ రూమ్ కి వచ్చానని అంటుంది ఇక వెళ్లి పూజ చేస్తూ ఉంటుంది. పెళ్ళికొడుకుని తీసుకోమని పూజారి చెప్తాడు. అప్పుడే విశ్వంకి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చందును తీసుకురమ్మని పూజారి గారు చెప్తే ఇద్దరు అన్నదమ్ములు అక్కడికి వెళ్తారు కానీ అక్కడ చందు లేకపోవడంతో అందరూ టెన్షన్ పడుతుంటారు.
ఒక లెటర్ కనిపిస్తుంది ఆ లెటర్ ని చూసి అక్కడ ఏమయిందని చూస్తారు కానీ చందు ఈ పెళ్లి ఇష్టం లేదు నా మనసులో వేరే అమ్మాయిని లెటర్లో రాసిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు విశ్వం క్రియేట్.. అది చూసిన వాళ్ళందరూ రామ్ రాజ్తో సహా అందరూ షాక్ అవుతారు అసలు అన్నయ్య ఎక్కడికెళ్లాడో తెలుసుకోవాలి అని ప్రయత్నాలు చేస్తుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…