BigTV English

Mehul Choksi Arrest: డైమండ్ వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అరెస్ట్.. రూ.13,500 కోట్లు, భారత్‌కు రప్పిస్తారా?

Mehul Choksi Arrest: డైమండ్ వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అరెస్ట్.. రూ.13,500 కోట్లు, భారత్‌కు రప్పిస్తారా?

Mehul Choksi Arrest: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని మోసం చేసిన కేసులో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఆయనపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. దాదాపు రూ.13,500 కోట్ల మోసం చేసినట్టు దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అతడ్ని అప్పగించాలని భారత్ కోరింది. అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


చిక్కిన ఛోక్సీ

డైమండ్ వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన గురించి భారతీయులకు బాగా తెలుసు. అంత బాగా పాపులర్ అయ్యాడు కూడా. పంజాబ్ నేషనల్ బ్యాంకు పేరు చెప్పగానే ముందుగా ఆయన పేరే వస్తుంది. ఆ రేంజ్‌లో బ్యాంకుని మోసం చేశాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 13, 500 కోట్ల రూపాయలను మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఘనుడు కూడా.


వేల కోట్ల రూపాయలతో విదేశాలకు చెక్కేసిన నిందితుపై భారత్ దృష్టి పెట్టింది. వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్‌ ఛోక్సీ బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన బెల్జియం జైలులో ఉన్నాడు. ఛోక్సీపై తీవ్ర అభియోగాలు ఉండడంతో ఆయన్ని అప్పగించాలని బెల్జియం ప్రభుత్వాన్ని భారత్ కోరింది.

తప్పడు పత్రాలతో నివాసం?

భారత్ నుంచి పారిపోయిన మెహుల్‌ ఛోక్సీ బెల్జియంలో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య ప్రీతి చోక్సీ బెల్జియం పౌరురాలు. అయితే మెహుల్ చోక్సీ బెల్జియంలో ఉండటానికి ఎఫ్ రెసిడెన్సీ కార్డ్ పొందారు. అక్కడి చట్టాల ప్రకారం మెహుల్‌ ఛోక్సీ ఇండియాకు వస్తాడా? లేకుంటే విజయ్ మాల్యా మాదిరిగా అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించి కాలం గడిపేస్తాడా? అన్నది అసలు పాయింట్.

ALSO READ: ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్, ఆపై హత్య.. నిందితుడ్ని ఎవరు లేపేశారు

సరిగ్గా 2018 జనవరిలో భారత్‌కు ఓ కుదుపు కుదిపేసింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్. దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ ఇది. ఈ కుంభకోణం బయటపడటానికి కొద్దివారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు విదేశాలకు పారిపోయాడు. కుంభకోణం బయటకు రావడానికి ముందు అంటిగ్వా పౌరసత్వం పొందినట్టు తెలిసింది.

భారత్ నుంచి నేరుగా వెస్టిండీస్‌కు

ఈ కేసులో మరో నిందితుడు చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడు. ఆయన్ని రప్పించేందుకు భారత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ కేసులో ఓ అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. నవంబర్ 15, 2023న బెల్జియంలో ఛోక్సీ ఉండటానికి అనుమతి లభించింది. ఇండియా నుంచి నేరుగా వెస్టిండీస్ దీవులైన ఆంటిగ్వా, బార్బుడాలో నివసించాడు కూడా.

బెల్జియంలో స్థిరంగా ఉండేందుకు పక్కాగా స్కెచ్ వేశాడు ఛోక్సీ. నకిలీ పత్రాలు సమర్పించి, అక్కడి ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించాడనే ఆరోపణలు ఛోక్సీపై ఉన్నాయి.  65 ఏళ్ల మెహుల్ చోక్సీకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ట్రీట్ మెంట్ కోసం బెల్జియం నుంచి స్విట్జర్లాండ్‌కు వెళ్లాడు.

ఆ తర్వాత బెల్జియంకు వచ్చాడని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛోక్సీ ఇండియాకు వస్తే ఇలాంటి ఫలితం ఉండదని అంటున్నారు. ఆయన ఆరోగ్యానికి మనం ఖర్చు చేయాల్సివస్తుందని అంటున్నారు. బ్యాంక్‌కు ఎగ్గొట్టిన  13 వేల కోట్ల రూపాయలను రాబట్టాలని అంటున్నారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×