E-Paper
Advertisement

Brahmamudi Serial Today August 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: స్పృహ కోల్పోయిన రాజ్ – దుఖః సంద్రంలో కావ్య

Brahmamudi Serial Today August 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: స్పృహ కోల్పోయిన రాజ్ – దుఖః సంద్రంలో కావ్య
Advertisement

Brahmamudi serial today Episode: అపర్ణ కోపంతో రాజ్‌కు నిజం చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. కావ్య అడ్డుపడుతుంది. దీంతో ఏయ్‌ నువ్వు ఆగు ఇప్పటికే చాలా ఆలస్యం చేశానే.. అది నిన్ను నానా మాటలు అంటున్నా.. కన్నతీపితో కొడుకుకు ఏమీ కాకూడదని ఇన్ని రోజులు ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు నా కొడుకే ఇలా దిగజారిపోయి మాట్లాడుతుంటే ఇక నిజం దాచడంలో ప్రయోజనం లేదు. ఏంట్రా అలా చూస్తున్నావు. అర్థం కావడం లేదా..? నువ్వు నా కొడుకు లాంటి వాడివి కాదురా.. నా పేగు తెంచుకు పుట్టిన నా కన్న కొడుకువి ఈ కుటుంబం నీది నువ్వు పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే వీళ్లందరూ నీ వాళ్లురా అసలు నీ పేరే రామ్‌ కాదు రాజ్‌.. స్వరాజ్‌. నువ్వు కళావతి అంటూ పిలుచుకుంటున్న నీ భార్య పేరు కళావతి కాదురా..? తన పేరు కావ్య.

కావ్య నెల తప్పడానికి కారణం నువ్వు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వు. ఈ దుగ్గిరాల ఇంటికి వారసుడివిరా నువ్వు.. అంటూ అలా శ్రీశైలానికి వెళ్లిన మీకు యాక్సిడెంట్‌ అయ్యి నువ్వు చనిపోయావని మేమందరం ఆశలు వదులుకుని ఏడుస్తూ ఉంటే నువ్వు బతికే ఉన్నావని నమ్మిన మొదటి మనిషిరా నీ భార్య. నువ్వు బతికే ఉన్నావని తన మనసు చెప్తుంది అంటే దాన్ని పిచ్చిదానిలా చూశామే కానీ దాని ప్రేమను అర్థం చేసుకోలేకపోయాము. ఈ యామిని నీకు కాలేజీలో పరిచయం అయి నువ్వు తన ప్రేమని రిజెక్టు చేస్తే నీకు జరిగిన యాక్సిడెంట్‌లో నువ్వు గతాన్ని మర్చిపోయావని ఆ అవకాశాన్ని వాడుకుని నిన్ను నమ్మించి  తన ఇటికి తీసుకెళ్లి బావ అంటూ నిన్ను పెళ్లి చేసుకోవాలని చూసింది.

Advertisement

ఎవరో రోడ్డులో పడిపోయిన మనిషిని చూడగానే నీ మనసు ఎందుకు చలించిపోయిందిరా… ఎందుకు హాస్పిటల్‌కు తీసుకెళ్లిపోయావు… తనను చూసినప్పటి నుంచి తన వెంట ఎందుకు పడ్డావు.. పదే పదే ఎక్కడో చూసినట్టుగా ఉందని నీ మనసుకు ఎందుకు అనిపించింది. ఈ ఇంటి అడ్రస్‌ తెలియకపోయినా వెతుక్కుంటూ ఎలా వచ్చావు. తనకు ఎలా దగ్గరయ్యావు. అంతెందుకురా.. ఈ యామిని చస్తాను అని చెప్పినా సరే పెళ్లి మండపంలో కావ్యను పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పావు.. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్నది జన్మజన్మల బంధం. ఆ దేవుడు వేసిన బ్రహ్మముడే తనను నువ్వు గుర్తు పట్టకపోయినా నీ మనసు తన వైపు నడిపించింది. యామిని నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నా అంటున్నా తనను ఎందుకు పరాయి మనిషిలా చూశావు. పరాయి మనిషిలా ఉంటున్న  కావ్యను సొంత మనిషిలా ఎలా ఫీల్ అవ్వగలిగావు.

అసలు నిన్ను మోసం చేసింది కావ్య కాదురా ఈ యామిని దాని ఫ్యామిలీ. ఆఖరికి నీకు పుట్టబోయే బిడ్డ నీ బిడ్డ కాదు అని నమ్మించడానికి వచ్చింది. నీ నుంచి నీ భార్యను శాశ్వతంగా  దూరం చేయడానికి వచ్చింది. హాస్పిటల్‌లో డాక్టర్‌ నీకు గతాన్ని గుర్తు చేయాలని ప్రయత్నిస్తే నువ్వు చనిపోతావని చెప్పడంతో నీకు ఏం జరుగుతుందోనని భయపడి ఈ పిచ్చిది తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే అని గుండెలు పగిలేలా అరిచి చెప్పాలని ఉన్నా మౌనంగా భరించిందిరా నీకోసం. ఆఖరికి నువ్వు తనని  వదిలేసి శాశ్వతంగా అమెరికా వెళ్లిపోతుంటే నువ్వు ఎక్కడో ఒక చోట హ్యాపీగా ఉంటే చాలని తన మీద నింద వేసుకోవడానికి సిద్ద పడింది. అంతే కానీ ఆ నిజాన్ని మాత్రం చెప్పడానికి ఒప్పుకోలేదు. ఆఖరికి తన మీద ఈ మచ్చ పడుతున్నా సరే నోరు మాత్రం తెరవలేదు.

Advertisement

ఇదంతా ఎందుకు చేసింది. కేవలం నీకోసం రా నీకోసం. ఇప్పుడు చెప్తున్న విను నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నువ్వు తాళి కట్టిన భార్య. దీని కడుపున పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే.. అంటూ అపర్ణ చెప్పగానే.. రాజ్కు గతం గుర్తుకు వస్తుంది. జరిగిన విషయాలు కావ్యను పెళ్లి చేసుకున్న విషయం గుర్తుకు వస్తుంది. దీంతో రాజ్‌ ఏడుస్తూ కిందపడిపోతాడు. అందరూ కంగారు పడతారు. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. రాజ్‌ను చెక్‌ చేసిన డాక్టర్‌ రాజ్‌కు క్రిటికల్‌గా ఉంది. పల్స్‌ రేటు తగ్గిపోయింది. బీపీ డౌన్‌ అయింది. అంటూ చెప్పి వెళ్లిపోతాడు. అందరూ బాధపడుతుంటే.. రాహుల, రుద్రాణి హ్యపీగా ఫీలవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×