E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆఫీసులో ఇంటి దొంగను పట్టుకున్న కావ్య, రాజ్

Brahmamudi Serial Today December 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆఫీసులో ఇంటి దొంగను పట్టుకున్న కావ్య, రాజ్
Advertisement

Brahmamudi serial today Episode:  

రాహుల్ దగ్గరకు కోపంగా వెళ్తున్న రాజ్‌ దగ్గరకు స్వప్ప వచ్చి ఎమోషనల్‌ అవుతుంది. మీరే లేకపోతే ఇవాళ రాహుల్ ఇలా ఉండలేడని చెప్తుంది. రాజ్‌, కావ్యకు థాంక్స్‌ చెప్పి స్వప్న వెళ్లిపోతుంది. స్వప్న వెళ్లిపోయాక కావ్య చూశారా మా అక్క ఎంత సంతోషంగా ఉంది. రాహుల్ తప్పు చేస్తున్నాడని మా అక్కకు తెలియదు. రాహుల్‌ చాలా కష్టపడుతున్నాడని ఆ కష్టంతోనే తన భర్తకు గౌరవం దక్కుతుందని ఆనంద పడుతుంది. ఇప్పుడు మీరు వెళ్లి మా అక్క ఆనందాన్ని ఆవిరి చేస్తారా… అంటూ కావ్య అడగ్గానే.. రాజ్‌ చూస్తుండిపోతాడు.

మరోవైపు అప్పు  అందరూ నిద్రపోయాక ఇంటికి వచ్చి మెల్లగా డోర్‌ ఓపెన్‌ చేసుకుని నక్కి నక్కి లోపలికి వెళ్తుంటే.. ప్రకాష్ ఎదురుగా వస్తాడు. ప్రకాస్‌ను చూసి షాక్‌ అయిన అప్పు మామయ్య మీరా..? అంటుంది. ఏమోనమ్మా నేనేనా..? మామయ్యనేనా..? నువ్వు గుర్తు చేశావు కదా గుర్తొచ్చింది అంటాడు ప్రకాష్‌. జోక్‌ బాగుంది మామయ్య అంటుంది అప్పు దీంతో ప్రకాష్‌ ఇంతకీ ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అమ్మ.. అని అడుగుతాడు. మీ అబ్బాయి ఇంకులో పెన్ను అయిపోయిందంట… చచ అది కాదు.. పెన్నులో ఇంకు అయిపోయిందంట అది కొనుక్కుని రావడానకి వెళ్లాను మామయ్య.. కరెక్టుగానే చెప్పాను కదా కన్వీనిన్స్‌ గా లేదా మామయ్య.. అని అప్పు అడగ్గానే.. ఇది వర్కవుట్‌ కాలేదు కానీ.. ఇంకేదైనా చెప్పమ్మా.. అని ప్రకాస్ అడగ్గానే.. చల్లగాలికి బయటకు వెళ్లాను మామయ్య.. అని అప్పు చెప్తుంటే.. క

Advertisement

ళ్యాణ్‌ వచ్చి పొట్టి ఇంకా లాగకు నాన్నకు అంతా తెలిసిపోయింది అని చెప్పగానే.. అప్పు షాక్‌ అవుతుంది. తెలిసిపోయిందా… ఎలా మామయ్య అని అడుగుతుంది. ప్రకాష్‌ సీరియస్‌గా అసలు మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుస్తుందా..? అంటాడు.. అంటే మమయ్య అది ఒక కేసు అర్జెంట్‌ అవసరం ఉండి డీల్‌ చేయాల్సి వచ్చింది అని చెప్పగానే.. అదే సమస్య అసలు నీవు పోలీస్‌ జాబే చేయకూడదని మీ అత్తయ్య చెప్తుంది. ఇప్పుడేమో నువ్వు ఉన్న కండీషన్‌లో మీ నాటకం మీ అమ్మకు తెలిసిందనుకో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి అని చెప్పగానే.. అయ్యో ఊహించుకోవడమే కష్టంగా ఉంది నాన్న ఇంకా చెప్పకు అంటాడు కళ్యాణ్‌. దీంతో ప్రకాష్‌ కోపంగా కళ్యాణ్‌, అప్పులను తిడతాడు. దీంతో ఇక నుంచి నువ్వే అమ్మను కవర్‌ చేయాలని కళ్యాణ్‌, ప్రకాష్‌ను రిక్వెస్ట్‌ చేస్తాడు. ప్రకాస్‌ ఒప్పుకోకపోతే కళ్యాణ్‌, అప్పు ఇద్దరూ కలిసి తమ మాటలతో ప్రకాష్ ను కన్వీన్స్‌ చేసి లోపలికి వెళ్లిపోతారు.

ఇంటికి వచ్చిన రాజ్‌, కావ్యలకు అపర్ణ, ఇంద్రాదేవి, సుభాష్‌ ఆలోచిస్తూ ఉంటారు. మీరు కేరళ నుంచి ఇంటికి రాగానే రాహుల్‌ చేసిన పని గురించి చెప్పాలనుకున్నాం. కానీ మీరు ఫంక్షన్‌కు వెళ్లాక మళ్లీ వాడికి సత్కారం చేసి వచ్చారా..? అంటూ సుభాష్‌ కోప్పడతాడు. మీ నాన్నను నమ్మించి గొంతు కోశాడు. మన కంపెనీకి కోట్లలో నష్టం వచ్చేలా చేశాడు. అలాంటి రాహుల్‌ను ఇంకా నమ్మాలనుకుంటున్నావా..? అని అపర్ణ అడగ్గానే.. రాజ్‌ కోపంగా లేదు అమ్మా వంద మందిలో వాడిని నిలదీద్దాం అని అనుకున్నాను కానీ అప్పుడే  స్వప్న అడ్డు పడింది అంటూ రాజ్‌ చెప్పగానే.. అంటే ఈ విషయం స్వప్నకు కూడా తెలుసా..? అని సుభాస్‌ అడగ్గానే.. స్వప్నకు తెలిస్తే స్వప్నే గడ్డి పెట్టేది. కానీ రాహుల్‌ను అమాయకంగా నమ్ముతుంది.

Advertisement

రాహుల్‌ చాలా కష్టపడి పైకి వస్తున్నాడని ఊహించుకుంటుంది. వాడో గొప్ప క్రియేటర్‌ అని అపోహ పడుతుంది అని రాజ్‌ చెప్పగానే.. అసలు ఏం అంటున్నావురా… స్వప్నకు తెలియకుండా అడ్డుపడటం ఏంటి.? అని అపర్ణ అడగ్గానే…అవునమ్మా స్వప్నకు అసుల నిజం తెలియదు.. ఇప్పుడు ఇదంతా అబద్దం అని ఆ డిజైన్స్‌ రాహుల్‌ వి కాదు.. అవి నా కంపెనీ నుంచి దొంగిలించాడని స్వప్నకు తెలిస్తే.. రాహుల్‌ను మళ్లీ కన్నెత్తి కూడా చూడదు.. అందుకే స్వప్నకు తన భర్త మీద ఇప్పుడిప్పుడే పెరుగుతున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఆగిపోయాను అంటాడు రాజ్‌. దీంతో సుభాష్‌, అపర్ణ ఇలాగే వదిలేస్తే వాడు మన కంపెనీ కింద గోతులు తీస్తూనే ఉంటాడు అని చెప్తారు. రాజ్‌, కావ్య ఆలోచిస్తుంటారు.

అవార్డుతో ఇంటికి వచ్చిన రాహుల్‌ను రుద్రాణి మెచ్చుకుంటుంది. రాజ్‌, కావ్యలకు నిజం తెలిసినా ఎందుకు మౌనంగా ఉండిపోయారు అని అడుగుతుంది. ఇప్పుడే కాదు మామ్‌ ఇక ఎప్పటికీ నోరు విప్పరు.. అని చెప్తాడు రాహుల. ఎలా సాధ్యం అవుతుందిరా అని రుద్రాణి అడగ్గానే.. వాళ్లకైనా.. నాకైనా ఉన్న ఆయుధం ఒక్కటే అది స్వప్నే అని రాహుల్‌ చెప్తాడు. తర్వాత ఆఫీసుకు వెళ్లిన రాజ్, కావ్య శృతితో సహా అందిరని పిలిచి తిడతారు. ఆఫీసులో ఉన్న ఇంటి దొంగ ఎవరో తెలియడం లేదని సీరియస్ అవుతారు. తర్వాత ఆఫీసులో డిజైన్స్‌ దొంగిలించిన వ్యక్తిని పట్టుకునేందుకు కావ్య ప్లాన్‌ చేస్తుంది. ప్లాన్‌ ప్రకారం ఆఫీసులో దొంగను పట్టుకుంటారు కావ్య, రాజ్‌. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×