E-Paper
Advertisement

Road Accident: విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన బైకర్లు, ఇదిగో సీసీటీవీ ఫుటేజ్

Road Accident: విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన బైకర్లు, ఇదిగో సీసీటీవీ ఫుటేజ్
Advertisement

Road Accident: రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఏ విధంగా జరుగుతాయో చెప్పలేము. రోడ్డుపై ఏ మాత్రం కంగారుపడినా మళ్లీ ఇంటికి రావడం కష్టం. ఎందుకంటే విశాలమైన రోడ్లు, అతివేగంతో వాహనాలు వెళ్లడమే ఇందుకు కారణం. విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

విజయవాడ-పెనమలూరు జాతీయ రహదారి నెప్పల్లి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం 11.36 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. నెప్పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ఆసిఫ్ బాషా-పఠాన్ మక్బుల్ టూ వీలర్స్ పై వెళ్తున్నారు. అయితే నేషనల్ హైవేపై కుడివైపుకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఓ కారు.. వారిని బలంగా ఢీ కొట్టింది.

ఢీ కొట్టిన కారు.. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తోంది. కారు వేగానికి బైకర్లు గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆసిఫ్ తల, కాలుకు తీవ్రగాయాలు అయ్యాయి. అలాగే మక్బుల్‌  గాయపడ్డాడు. ఈ ఘటన తర్వాత ఆగింది కారు. ఈలోగా స్థానికులు అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు.

Advertisement

గాల్లో ఎగిరిన బైకర్లు, ఇదిగో సీసీటీవీ ఫుటేజ్

గాయపడినవారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుత వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమీపంలోని ఓ షాపు వద్ద సీసీటీవీ కెమెరా ఉంది. అందులో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.  ప్రమాదాలు జరిగితే ఏ విధంగా ఉంటాయో చెప్పడానికి ఇదొక ఘటన.

దేవుడి దయవల్ల ఈ ప్రమాదంలో బైకర్లు గాయాలతో బయటపడడంతో కారులో ప్రయాణిస్తున్నవారు ఊపిరి పీల్చుకున్నారు.  రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా క్రాసింగుల వద్ద జరుగుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా వెళ్లాల్సిన వాహనాలు, వేగంగా వెళ్లడమే ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

ALSO READ: అడ్డంగా బుక్కైన మహిళా టెక్కీ, ఆ తర్వాత రోడ్డుపైకి

https://twitter.com/bigtvtelugu/status/2001111221941178679

 

 

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×