E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్:   రుద్రాణి, ధాన్యలక్ష్మీకి కావ్య వార్నింగ్‌ – కావ్యను భార్యగా ఒప్పుకోని రాజ్‌      

Brahmamudi Serial Today December 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్:   రుద్రాణి, ధాన్యలక్ష్మీకి కావ్య వార్నింగ్‌ – కావ్యను భార్యగా ఒప్పుకోని రాజ్‌      
Advertisement

Brahmamudi serial today Episode:   ఆఫీసుకు వెళ్లిన రాజ్‌, కావ్య దగ్గరకు బ్యాంకు వాళ్లు వచ్చి డబ్బు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని అడగ్గానే అంత మొత్తం ఒకేసారి కట్టలేము కదా..? ఇన్‌స్టాల్‌ మెంట్‌ గా కడతామని రిక్వెస్ట్‌ చేస్తుంది. దీంతో కన్వీన్స్‌ అయిన  బ్యాంకు వాళ్లు కావ్య ప్రపోజల్‌కు అంగీకరిస్తారు.  మీరు ఎలా ఇన్‌స్టాల్‌మెంట్స్‌ కడతారని అడుగుతారు. దీంతో కావ్య మేము ఐదు ఇన్‌స్టాల్‌మెంట్స్‌ లో పే చేస్తామని మొదటి ఇన్‌స్టాల్మెంట్‌ గా 20 కోట్లు ఇవాళే పే చేస్తామని కావ్య చెప్తుంది. అందుకు డ్యాకుమెంట్స్‌ రెడీ చేయండి అని చెప్తుంది. సరేనని బ్యాంకు వాళ్లు వెళ్లిపోతారు.

రాజ్‌, కావ్యను ఆశ్చర్యంగా చూస్తుంటే ఎంటలా చూస్తున్నారు అని అడుగుతుంది. చాలా బాగా మాట్లాడావు. చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడావు. గుడ్‌ జాబ్‌, కీపిటప్‌ అంటూ మెచ్చుకుని రాజ్‌ వెళ్లిపోతాడు. శృతి వచ్చి ఆశ్చర్యపోతుంది. రాబోయే 24 గంటల్లో ఏవైనా తుఫాను వస్తుందా..? అసలు రాజ్ సార్‌ ఏంటి ఇంతలా మారిపోయారు. మీరేదే మ్యాజిక్‌ చేశారు మేడం అంటుంది.

Advertisement

ధాన్యలక్ష్మీ కాఫీ చేసుకుంటుంటే రుద్రాణి వస్తుంది. తాపీగా కాపీ చేసుకుంటున్నావా..? ధాన్యలక్ష్మీ పనిలో పనిగా టీ కూడా బాగా చేయడం నేర్చుకో ఎందుకంటే రేపోమాపో బయటకు వెళ్లి టీ కొట్టు పెట్టుకోవాలి కదా..? అంటుంది. దీంతో ధాన్యలక్ష్మీ కోపంగా రుద్రాణి మతిపోయిందా.. నీకు నేనేంటి టీ కాఫీలు అమ్ముకోవడం ఏంటి..? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ ధాన్యలక్ష్మీ తిట్టడంతో నీకు ఇంకా అర్థం కాలేదా… అక్కడ రాజ్‌ ఇంట్లోనే కాదు ఆఫీసులో కూడా అడుగుపెట్టనివ్వను అని చాణక్య శపథం చేశాడు. ఇప్పుడు ఏమైంది. ఇంట్లోనే కాదు ఆఫీసుకు కూడా కావ్యను తీసుకుని వెళ్లాడు. అంటూ రుద్రాణి చెప్పగానే ధాన్యలక్ష్మీ ఆలోచనలో పడిపోతుంది.

ఆఫీసులో రాజ్‌ హ్యాపీగా ఫీలవుతుంటాడు. ఫస్ట్‌ టైం నా క్యాబిన్‌లోకి థర్డ్‌ పర్సన్‌ నా పర్మిషన్‌ లేకుండా వచ్చాడు. నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నాను. ఈ విషయం ఎవరికి  చెప్పాలో అర్థం కాక తల పట్టుకున్నాను. నాకేం సంబంధ లేదు అంటే అవతల తాతయ్య మాట పోతుంది. ఎవరో ఒకరితో షేర్‌ చేసుకుంటే తప్పా నా బాధ తగ్గదు. అందుకే నీతో చెప్పాను. నేను ఆశించినట్టుగానే నువ్వు దీనికి సొల్యూషన్‌ చెప్పావు. నీకు ఎలా థాంక్స్‌ చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు నన్ను భార్యగా అంగీకరిస్తే నాకు థాంక్స్‌ చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది కావ్య. ఇక ఏదీ కాదు అసలు బయటి దానిలా బావిస్తే నాకు ఇంకా ఏదీ అవసరం లేదు అంటుంది కావ్య.

Advertisement

మొత్తానికి బ్యాంకు సమస్య 20శాతం తగ్గిపోయింది. ఇంకా నెలా నెలా 4 నెలలు ఎలా కట్టాలి అని ఆలోచిస్తాడు. ఏవండి ఒక్క నెల అని ఆలోచించకుండా 30 రోజులు అని ఆలోచిచండి పరిష్కారం మీకే దొరుకుతుంది. అని కావ్య చెప్పగానే.. రాజ్‌ మేనేజర్‌ను పిలిచి ఈ రోజు నుంచి వర్క్‌ పాస్ట్‌ గా అవ్వాలి అని చెప్తాడు. ఎంత స్పీడుగా చేసినా 15 రోజులు పడుతుందని మేనేజర్‌ చెప్పగానే కావ్య ఎలా చేయాలో చెప్తుంది. ఏవండి ప్రాబ్లమ్స్‌ అన్ని సాల్వ్‌ అయ్యాయి కదా..? మీరు రిలాక్స్‌ అవ్వండి. అని కావ్య చెప్పగానే ఇంకోక ప్రాబ్లమ్‌ ఉంది. ఉన్న డబ్బులు ఇక్కడే వాడేశాము. ఇంట్లో వాళ్లు డబ్బులు అడిగితే ఎలా మేనేజ్‌ చేయాలి అని రాజ్‌ చెప్పగానే ఇంట్లో వాళ్లకు నేను సమాధానం చెప్తాను మీరు ఆలోచించకండి అని చెప్తుంది.

స్వప్న ఫోన్‌ మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతుంటే రుద్రాణి, రాహల్‌ వచ్చి స్వప్న దగ్గర ఉన్న తాళాలు చూసి ఒకరిని ఒకరు తిట్టుకుంటారు. మనకు తాళాల గుత్తి అక్కర లేదురా ఆ బీరువాలో ఉన్న డబ్బు కావాలి అని స్వప్నను డబ్బులు అడుగుదామని నిర్ణయం తీసుకుని వచ్చి తమకు డబ్బులు కావాలని వచ్చి అడుగుతారు. స్వప్న తనకు వినబడతలేదని చెప్తుంది. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మేము ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్తాము అని రుద్రాణి బెదిరిస్తుంది. స్వప్న డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంటే కావ్య వచ్చి ఆపుతుంది. ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నావు అక్కా అని అడుగుతుంది కావ్య. డబ్బులు ఇవ్వకపోతే ధాన్యలక్ష్మీకి చెప్తామని బెదిరించారు అని స్వప్న చెప్పగానే అక్కా నీకు తాళాలు ఇచ్చానని వీళ్లు ఆట మొదలుపెట్టారు. ఎమర్జెన్సీ అవసరం వస్తుందని నీకు తాళాలు ఇచ్చాను.

కానీ వీళ్లు ఇలా డబ్బులు దాటిస్తారని అనుకోలేదు అంటూ తాళాలు, డబ్బులు తీసుకున్న కావ్య ఇంట్లో వాళ్లందరిని పిలువు అని చెప్పగానే స్వప్న అందరినీ పిలుస్తుంది. అందరికీ వచ్చాక.. అపర్ణ, కావ్య ఎందుకు అందరినీ పిలిచావు.  ఈ ఇంట్లో అందరికీ చెప్తున్నాను. ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు ఇక  నుంచి ఇంట్లోకి ఏం కావాలో నేను చూసుకుంటాను. డబ్బు అవసరం అయి ఎవరైనా అడిగితే తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చూపించాలి. కారులో పెట్రోల్‌ పోయించినా నాకు బిల్లు చూపించాలి అని కావ్య చెప్తుంది.  ఇంటి తాళాలు చేతికి వచ్చే సరికి కొమ్ములు పెరిగాయా అని ధాన్యలక్ష్మీ కోప్పడుతుంది. లేదు అంతకుముందు ఉన్నంతే ఉన్నాయి.

ఇక ముందు పెరిగే అవకాశం ఉంది అని కావ్య చెప్తుంది. ఎవరు ఏమనుకున్నా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నాకు నిజంగా అనవసరం. ఈ రూల్స్‌ను స్టిక్ట్‌గా పాటించాలి ఇట్స్‌ మై ఆర్డర్‌ అంటుంది కావ్య. దీంతో రూల్స్‌ పెట్టడానికి ఇదేమైనా జైలు అనుకుంటున్నావా.? ఇన్ని రోజులు మా అమ్మా నాన్న కూడా ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు అంటుంది రుద్రాణి. దీంతో ఖర్చులకు డబ్బులు అవసరం అయ్యాక అమ్మా నాన్న గుర్తుకొచ్చారా..? రుద్రాణి. మా ఆయన హాస్పిటల్‌ లో ఉన్నప్పుడు ఇక్కడ ఆస్తుల కోసం చిచ్చు పెట్టినప్పుడు మేము నీకు అమ్మా నాన్నల్లా కనిపించలేదా..? అంటుంది ఇందిరాదేవి. అంటే ఇకనుంచి ఈ కావ్య చెప్పిందే అమలవుతుందా..? అని ధాన్యలక్ష్మీ, ఇందిరాదేవిని అడుగుతుంది. అక్కడ అడుగుతారేంటి ధాన్యలక్ష్మీ గారు ఇక నుంచి నేను చెప్పిందే అమలవుతుంది. అర్థమైందా…? ఎనీ డౌట్స్‌ అని కావ్య అడగ్గానే ప్రకాష్‌ అబ్బే నో డౌట్స్‌ అంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×