Allu Arjun Case: తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun) కారణంగా రష్మిక మందన్న(Rashmika Mandanna) చిక్కుల్లో పడిందని తెలుస్తోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద నిన్న ఓయూ జేఏసీ నాయకులు ముట్టడి చేసిన విషయం తెలిసిందే. ఇంటి కాంపౌండ్ లోపలికి ప్రవేశించి పూలకుండీలు ధ్వంసం చేశారు. ప్రహరీ గోడ ఎక్కి రాళ్లు విసిరారు. టమోటోలతో విధ్వంసం సృష్టించారు. అంతేకాదు రేవతి మరణానికి కారణం అల్లు అర్జున్ అని , ఆమె కొడుకు శ్రీ తేజ హాస్పిటల్ బారిన పడడానికి కూడా అల్లు అర్జున్ కారణం అంటూ కామెంట్లు చేస్తూ.. కోటి రూపాయలు ఇవ్వాలని నినాదాలు చేయగా.. వాతావరణం ఉద్రిక్తతగా మారడంతో జూబ్లీహిల్స్ పోలీసులు జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకొని అల్లు అర్జున్ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
అల్లు అర్జున్ ఇంటిని ముట్టడి చేయడంపై స్పందించిన అల్లు అరవింద్..
ఇక నిన్న తమ ఇంటి వద్ద జరిగిన ఘటనపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravindh)మీడియాతో మాట్లాడుతూ..” ఇప్పుడు మేము సంయమనం పాటిస్తున్నాము. ఏ విషయం పైన ఇప్పుడు చర్చించలేము. ముఖ్యంగా మా ఇంటి ముందు ఇలా జరగడం నిజంగా దారుణం.. ఇలాంటి ఘటన ఎవరి ఇంటి ముందు కూడా జరగకూడదని మాత్రమే ఆశిస్తున్నాము” అంటూ తెలిపారు.
రూ.25 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్
ఇదిలా ఉండగా నిన్న సాయంత్రం మీడియా ముందుకు వచ్చిన ఓయూ జేఏసీ నేత మాట్లాడుతూ..”తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి సహాయం చేయాలి అని అల్లు అర్జున్ ఇంటి ముందు శాంతియుత నిరసన చేసాము. కానీ అల్లు అర్జున్ సిబ్బంది మాపై దాడి చేశారు.అల్లు అర్జున్ ఇప్పటికైనా ఆ కుటుంబానికి రూ.25 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అలా చేయలేని పక్షంలో 1500 మందితో వెళ్లి అల్లు అర్జున్ ఇంటిని చుట్టుముడతామని కూడా ఆయన హెచ్చరించారు.
రష్మిక రూ.15 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్..
హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)కూడా తన వంతు బాధ్యతగా బాధిత కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇక దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది. ఈ విషయం తెలిసి పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తప్పు ఒకరు చేస్తే ఆ భారం ఇంకొకరు మోయలా అంటూ ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతూ ఉండడం గమనార్హం. తమ హీరోయిన్ సినిమాలో నటించినది కానీ తనవల్ల అక్కడ ప్రాణ నష్టం జరగలేదు కదా.. అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ కారణంగా ఇప్పుడు రష్మిక కూడా కొత్త చిక్కులు ఎదుర్కొంటోంది అని చెప్పడంలో సందేహం లేదు అని నెటిజెన్సీ సైతం కామెంట్లు చేస్తున్నారు.
సంధ్య థియేటర్ దగ్గర దుర్ఘటన..
పుష్ప2 సినిమా.. డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్డు లో ఉన్న సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో వేయగా ఆ బెనిఫిట్ చూడడానికి అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహించుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా.. ఆమె కొడుకు ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ దుర్ఘటనకు కారణం అల్లు అర్జున్ కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఓయూ జేఏసీ నాయకులు నిరసనలు చేస్తున్నారు.