YS Jagan Plan Reverse: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటింది. అయిదేళ్లు అధికారం చెలాయించిన వైసీపీకి అనూహ్యంగా ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. గెలిచిన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఇక ఓడిపోయిన నాయకులు చాలా సెగ్మెంట్లలో కనిపించడమే మానేశారు. పవర్‌లో ఉన్నప్పుడు తమతో అడ్డమైన పనులు చేయించి, ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్న టైమ్‌లో నాయకులు కనిపించకుండా పోవడంతో కేడర్ ఆగ్రహంతో రగిలిపోతుందంట. ముఖ్యంగా ఆ నియోజకవర్గం వైసీపీలో ఆ వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తుందంటున్నారు. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏది? అసలక్కడ ఏం జరుగుతుంది?
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం.. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ కుండ మార్పిడి రాజకీయాలు చేసింది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుని మార్కాపురం అభ్యర్ధిగా, మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డిని గిద్దలూరు క్యాండెట్‌గా జగన్ కుండమార్పిడి చేశారు. అది ఆయా అభ్యర్ధుల ఇష్టానుసారం జరిగిందో? లేకపోతే వైసీపీ అధ్యక్షుడు తన సొంత సర్వేల ద్వారా తీసుకున్న నిర్ణయమో కాని.. అప్పట్లోనే రెండు సెగ్మెంట్లలో వైసీపీ వర్గాలు అసంతృప్తితో రగిలిపోయాయి.
అయితే జగన్ మార్పుల చేర్పుల ఫార్ములా గిద్దలూరు, మార్కాపురం రెండు నియోజకవర్గాల్లో వర్కౌట్ కాలేదు. రెండు సెగ్మెంట్స్‌లో వైసీపీ పరాజయం పాలైంది. అంతే ఓటమి తర్వాత అన్నా రాంబాబు, కుందూరు నాగార్జునరెడ్డి తాము పోటీ చేసిన నియోజకవర్గాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ క్రమంలో ఎన్నికల ముగిసిన ఆరు నెలల దాటుతున్న కార్యకర్తల మంచి చేడు పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడని ఇటీవల గిద్దలూరు నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలు భగ్గుమన్నారు. ప్రస్తుత గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్ ప్రకటించిన మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి తమకు వద్దని సమావేశంలో నినాదాలు హోరెత్తించారు.
మళ్లీ గిద్దలూరు వైసీపీ ఇన్చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు అవకాశం ఇవ్వాలని .. లేకుంటే స్థానిక నేతలకు గిద్దలూరు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలని అక్కడ వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. నియోజకవర్గంలో లేని నేతకు ఇన్చార్జి బాధ్యతలు కట్టబెట్టడం ఏంటని? జగన్ నిర్ణయాలతో అసలే అవశాన దశలో ఉన్న పార్టీ పూర్తిగా అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుందని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు.
Also Read: చెవిరెడ్డి దెబ్బకి టెన్షన్‌లో అధికారులు.. ఎందుకంటే..
అదలా ఉంటే నాగార్జునరెడ్డి నిర్వహించిన ఒక సమావేశానికి కొంతమంది వైసీపీ ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదు. గిద్దలూరు ఇన్చార్జి కుందూరు నాగార్జునరెడ్డి సదరు వైసీపీ నేతలకు ఆహ్వానాలు పంపలేదట. గత ఎన్నికలలో వైసీపీలో ఉంటూ టీడీపీ అభ్యర్ధి ముత్తుముల అశోక్ రెడ్డికి సపోర్ట్ చేశారని నాగార్జున రెడ్డి సొంత పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపలేదని బహిరంగంగానే చెప్తున్నారు. ఎవరికి అయితే ఆహ్వనాలు పంపలేదో ఆ అసమ్మతి నేతలు వైసీపీ అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిపై ఫిర్యాదులు చేశారట. నాగార్జున ఒంటెద్దు పోకడలతో గిద్దలూరులో వైసీపీ కేవలం ఆరు వందల ఓట్ల తేడాతో ఓడిపోయిందని .. తిరిగి నాగార్జునరెడ్డిని మార్కాపురం పంపించేయాలని లేఖలు రాశారట .. ఆ లేఖలు గిద్దలూరు వైసిపిలో హాట్ టాపిక్‌గా మారాయి.
అసలే అధికారం లేక కష్టకాలంలో ఉంటే ఇప్పుడు ఈ గ్రూప్ గోలలు ఎంటని వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారంట. ఇటు అన్నా రాంబాబుకు గిద్దలూరు నియోజకవర్గంలో 15ఏళ్ల రాజకియ అనుబంధం ఉంది. గిద్దలూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గిద్దలూరు వైసిపిలోని ఒక వర్గం మాత్రం మళ్లీ అన్నా రాంబాబు కావాలని అధిష్టానాన్ని కోరుతుందంట. తనకు పొలిటికల్ కెరీర్ ఇచ్చిన గిద్దలూరు నియోజకవర్గంలో రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని మాజీ అన్నా రాంబాబు అనుకుంటునట్లు టాక్ నడుస్తుంది. రాంబాబు అయితే ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేత అవ్వడంతో తమకు అండగా ఉంటారని ఒక వర్గం వైసీపీ పెద్దలకు లేఖల మీద లేఖలు రాస్తున్నారంట.
గిద్దలూరు వైసిపిలోని మరో వర్గం మాత్రం గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన స్థానిక రెడ్డి నేతాలకే ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వాలని కోరుతుందట.. ఆ వైసీపీ ఇన్చార్జ్ రేసులో కామూరు రమణరెడ్డి, కడప వంశీధర్ రెడ్డి , పిడతల ప్రవీణ్‌కుమార్ రెడ్డిలు ఉన్నారట .. ప్రస్తుతం గిద్దలూరు ఇన్చార్జిగా జగన్ ప్రకటించిన కుందూరు నాగార్జునరెడ్డి పూర్తిగా మార్కాపురానికే అంకితం అయ్యారు. దాంతో తమ మంచి, చెడూ పట్టించుకునే వారే కరువయ్యారని కార్యకర్తలు నాగార్జునరెడ్డిపై ఫైర్ అవుతున్నారు. నాగార్జున తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి ఒవర్ యాక్షన్ పార్టీలో ఎక్కువ అవటం కొంతమంది నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒక ఒంగోలు తప్ప మిగిలిన 11 నియోజకవర్గాలలో అభ్యర్ధుల మార్పులు చేర్పులు జరిగాయి.. గిద్దలూరు నియోజకవర్గాన్ని ఇప్పుడు టచ్ చేస్తే.. మిగిలిన సెగ్మెంట్ల నుంచి కూడా డిమాండ్లు పెరిగిపోతాయని వైసీపీ పెద్దలు భయపడుతున్నారంట. అసలే వలసలతో లీడర్లు కరువైన పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ మార్పులు చేర్పులు చేయాలంటే కష్టమని వెనకాముందూ అడుతున్నారంట. అందుకే గిద్దలూరులో అంత రచ్చ జరుగుతున్నా చూసీచూడనట్లు పోతున్నారంట. మొత్తానికి అలా నడిచిపోతుంది వైసీపీ రాజకీయం