E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్ ను హగ్ చేసుకున్న రేఖ

Brahmamudi Serial Today December 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్ ను హగ్ చేసుకున్న రేఖ
Advertisement

Brahmamudi serial today Episode:

రుద్రాణి కూతరు రేఖకు రుద్రాణికి గొడవ జరుగుతుంది. ఆరోజు తనను రాజ్‌కు ఇచ్చి పెళ్లి చేసి ఉంటే తాను ఇప్పుడు తెగిన గాలిపటంలా ఇలా తిరిగేదాన్నే కాదు అంటూ చెప్తుంది రేఖ. వాడికి నువ్వుంటే ఇష్టం లేదు కదే ఎలా పెళ్లి చేయాలి అని రుద్రాణి అడగ్గానే.. ఆ రాజ్‌ బావకు కావ్య అంటే ఇష్టం ఉండే పెళ్లి చేసుకున్నాడా..? ఇప్పుడు ఇష్టంతో కాపురం చేయడం లేదా..? నువ్వే కదా ప్లాన్‌ చేసి కావ్య మెడలో తాళి కట్టేలా చేశావు. అలాగే ఏదో ఒకటి చేసి నన్నే ఇచ్చి పెళ్లి చేసుంటే నీ ముందే రాజ్‌ బావతో హ్యాపీగా ఉండేదాన్ని కదా..? నీ వల్లే నా జీవితం ఇప్పుడు ఇలా తగలబడింది అంటూ కోపంగా వెళ్లిపోతుంది రేఖ. ఇప్పుడు ఏం చేయాలి అంటూ రుద్రాణి భయపడుతుంది.

తర్వాత రూంలో కూర్చుని రేఖ మందు తాగుతుంటే.. రాహుల్‌ వెళ్లి తిడుతుంటాడు. ఇక నువ్వు మారవా..? నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది ఫారిన్‌ కాదు. చదువుకున్నావు కదా.. చెప్తే అర్థం కాదా..?  ఆ మాత్రం సెన్స్‌ కూడా లేదా..? అంటూ తిడుతుంటాడు. అక్కడ ప్రశాంతత లేదనే ఇండియాకు వచ్చాను. నువ్వు ఇలాగే టార్చర్‌ పెడితే ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోతాను అంటుంది రేఖ. ఇంతలో అక్కడికి రాజ్‌ వచ్చి ఏంటి రాహుల్‌ ఇన్ని రోజుల తర్వాత చెల్లి వస్తే ఇలాగేనా మాట్లాడేది. అరే తనేదో ఆవేశంలో మాట్లాడుతుంది. నువ్వు ఇలాగేనా అర్థం చేసుకునేది అంటాడు.

Advertisement

దీంతో రాహుల్‌ మరేం చేయమంటావు రాజ్‌ ఫారిన్‌లో ఒకడితో రిలేషన్‌లో ఉంది. అది బ్రేకప్‌ అయింది. ఆ డిప్రెషన్‌ అంతా తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తానంటే ఎలా కుదురుతుంది. నువ్వే చూడు ఎలా తాగుతుందో అంటాడు. దీంతో రేఖ కోపంగా నీకు నేను తాగేదే కనిపిస్తుంది కానీ నేను పడుతున్న బాధ కనిపించడం లేదా.. అని అడుగుతుంది. దీంతో రాహుల్ కోపంగా దానికి కూడా కారణం నువ్వే పెద్ద వాళ్ల మాట వినకుండా వెళ్లింది నువ్వు.. అక్కడ సెటిల్‌ అవుతానని చెప్పింది నువ్వు.. అంటూ తిడుతుంటే. ఇప్పుడు అనుభవిస్తుంది కూడా నేనే కద నీకేంటి బాధ అంటుంది రేఖ. దీంతో చూశావా రాజ్‌ ఎంత పొగరుగా మాట్లాడుతుందో.. అంటాడు రాహుల్‌.. రాజ్‌ కూల్‌ రాహుల్‌.. రేఖతో నేను మాట్లాడతాను నువ్వు వెళ్లు అని చెప్పగానే.. రాహుల్‌ వెళ్లిపోతాడు. రాజ్‌, రేఖను కన్వీన్స్‌ చేయడానికి ప్రయత్నిస్తాడు. రేఖ చేతిలో ఉన్న మందు గ్లాస్‌, బాటిల్‌ తీసుకుని వెళ్లిపోతాడు.

తర్వాత రాజ్‌, ఇంటి దగ్గరే ఉండి కావ్యకు సేవలు చేయడం చూస్తుంది రేఖ. కోపంతో ఇరిటేట్‌ అవుతుంది. వెళ్లి టాబ్లెట్స్‌ వేసుకుంటుంటే.. రాజ్‌ చూసి రేఖ ఏంటివి అని అడుగుతాడు. దీంతో డిప్రెషన్‌లో ఉన్నాను బావ. అది పోవడానికి వేసుకుంటున్నాను అని చెప్తుంది. దీంతో రాజ్‌ ఇన్ని వేసుకుంటే డిప్రెషన్‌ పోవడం కాదు నువ్వు పోతావు అంటూ టాబ్లెట్స్‌ లాక్కుని విసిరేస్తాడు. చూడు రేఖ పరిస్థితి అనేది మన నీడ కాదు ఎప్పుడూ మనతో ఉండటానికి అది ఎప్పుడూ మారిపోతుంటాయి. అని చెప్పగానే.. నిజమే బావ కానీ దీన్ని నేను దాటలేకపోతున్నాను. ఏదో తెలియని ఒంటరి ఫీలింగ్‌.. నాకంటూ ఎవరూ లేరనే బాధ దిగులు నన్ను వెంటాడుతున్నాయి బావ అని చెప్పగానే.. చూడు రేఖ అలాంటి ఫీలింగ్స్‌ పోవాలంటే మందుల దగ్గరకు కాదు పోవాల్సింది. మనుషుల దగ్గరకు. మనుషులతో కలువు.. కలివిడిగా ఉండు.. నీ ఫీలింగ్స్‌ షేర్‌ చేసుకో.. యోగ ఎక్సర్‌సైజ్‌ చేయ్‌.. ఉదయాన్నే ఇదిగో ఇలాంటి జ్యూస్‌ లు తాగు అని చెప్పగానే.. రాజ్‌ చేతిలో ఉన్న జ్యూస్‌ తీసుకుని నాకోసమేనా బావ థాంక్యూ అంటూ జ్యూస్‌  తాగుతుంది రేఖ.  ఇంతలో జ్యూస్‌ కోసం బయటి నుంచి వచ్చిన కావ్య రాజ్‌తో గొడవ పెట్టుకుని లోపలికి వెళ్తుంది.

Advertisement

తర్వాత సుభాష్‌, ప్రకాష్‌లను బలవతంగా రెడీ చేసి ఆఫీసుకు పంపిస్తారు అపర్ణ, ధాన్యలక్ష్మీ. తర్వాత రేఖ కిచెన్‌లోకి వెళ్లి పని మనిషితో తనకు త్వరగా జ్యూస్‌ చేసి ఇవ్వమని గొడవ పడుతుంది. ఇంద్రాదేవి, అపర్ణ వెళ్లి రేఖను తిడతారు. తర్వాత రాజ్‌, రేఖను బయటకు తీసుకెళ్లి ఓదార్చి హగ్‌ ఇస్తాడు. అది కావ్య చూసి తిడుతూ లోపలికి వెళ్తుంది. ఇంద్రాదేవితో జరిగిన విషయం చెప్తే ఆ మాత్రం దానికే నువ్వు అంతలా ఫీల్ అవ్వాలా..? అంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×